Love Mouli OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న నవదీప్ బోల్డ్ మూవీ ‘లవ్ మౌళి’ - స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
Love Mouli OTT: చాలాకాలం తర్వాత నవదీప్ హీరోగా నటించిన చిత్రమే ‘లవ్ మౌళి’. ఈ మూవీలో నవదీప్ లుక్స్‌కు, పర్ఫార్మెన్స్‌కు మంచి మార్కులు పడ్డాయి. త్వరలోనే ఈ సినిమా ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతోంది.
![Love Mouli OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న నవదీప్ బోల్డ్ మూవీ ‘లవ్ మౌళి’ - స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే? Navdeep starrer Love Mouli is all set to release on this OTT Love Mouli OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న నవదీప్ బోల్డ్ మూవీ ‘లవ్ మౌళి’ - స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/19/331694added9f33305ce5be661b20b851718796737812239_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Love Mouli OTT Release: జూన్ మొదటి వారంలో పలు తెలుగు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో నవదీప్ హీరోగా నటించిన ‘లవ్ మౌళి’ కూడా ఒకటి. హీరోగా తన కెరీర్‌ను ప్రారంభించిన నవదీప్.. మధ్యలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ అయ్యాడు. స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ అప్పుడప్పుడు నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్‌లో కూడా అలరించాడు. అలాంటి నవదీప్ ‘లవ్ మౌళి’తో హీరోగా కమ్‌బ్యాక్ ఇవ్వాలనుకున్నాడు. అయినా కూడా ఈ మూవీకి అనుకున్నంత రీచ్ లభించలేదు. దీంతో రెండు వారాల్లోనే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ అప్డేట్ బయటికొచ్చింది.
పాజిటివ్ రివ్యూలు..
అవనీంద్ర దర్శకత్వంలో నవదీప్ హీరోగా నటించిన చిత్రమే ‘లవ్ మౌళి’. చాలాకాలం తర్వాత హీరోగా నటిస్తున్న మూవీ కావడంతో ‘లవ్ మౌళి’పై ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేయడానికి నవదీప్ చాలా కష్టపడ్డాడు. బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్ కూడా చేశాడు. అలా ఎంతో హైప్ మధ్య జూన్ 7న ఈ సినిమా విడుదలయ్యింది. కానీ అనుకున్నంత రేంజ్‌లో హిట్ అవ్వలేకపోయింది. సినిమా చూసినవారంతా నవదీప్ కొత్తగా కనిపించాడు, లుక్స్ బాగున్నాయి, యాక్టింగ్ బాగుంది అని పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు. కానీ ఎక్కువమందికి మాత్రం ఈ మూవీ రీచ్ అవ్వలేకపోయింది. దీంతో రెండు వారాల్లోని ‘లవ్ మౌళి’కి సంబంధించిన ఓటీటీ అప్డేట్ వచ్చేసింది.
లవ్ మౌళి జర్నీ..
ఎక్స్‌క్లూజివ్ తెలుగు ఓటీటీ యాప్ అయిన ఆహాలో ‘లవ్ మౌళి’ విడుదల కానుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. ‘తను ప్రేమ గురించి మిమ్మల్ని గట్టిగా ఆలోచించేలా చేస్తాడు. త్వరలోనే ఆహాలో లవ్ మౌళి జర్నీని ఎక్స్‌పీరియన్స్ చేయండి’ అంటూ ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చింది ఆహా. కానీ స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడు అనే విషయం మాత్రం ఇంకా ఫైనల్ చేయలేదు. దీంతో థియేటర్లలో మిస్ అయినవారు ‘లవ్ మౌళి’ని ఓటీటీలో చూడడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో నవదీప్‌కు జంటగా పంఖూరీ గిద్వానీ, ఛార్వీ దత్తా హీరోయిన్లుగా నటించారు.
View this post on Instagram
అప్పుడప్పుడు హీరోగా..
నవదీప్ చివరిగా ‘రన్’ అనే ఆహా ఒరిజినల్ మూవీలో హీరోగా కనిపించాడు. నేరుగా ఓటీటీలో విడుదలయినా కూడా ఈ సినిమాకు ఎక్కువ రీచ్ రాలేదు. అంతకు ముందు ‘నెక్స్‌ట్ ఏంటి’, ‘భమ్ భోలేనాథ్’ చిత్రాల్లో కూడా లీడ్ రోల్ చేశాడు. అలా రెండు, మూడేళ్లకు ఒకసారి హీరోగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు నవదీప్. కానీ వాటన్నింటితో పోలిస్తే ‘లవ్ మౌళి’ చాలా భిన్నమని ఈ సినిమా చూసిన ప్రేక్షకులు చెప్తున్నారు. పెద్ద జుట్టు, గడ్డంతో మూవీ కోసం పూర్తిగా తన లుక్‌ను మార్చేశాడు నవదీప్. ఫస్ట్ లుక్‌లో అయితే అసలు నవదీప్‌ను చాలామంది గుర్తుపట్టలేదని అన్నారు.
Also Read: రియల్ లైఫ్‌లో అమ్మాయి లేదు.. ఇకపై ఉండరు కూడా - పెళ్లిపై శ్రీనివాస్ అవసరాల కామెంట్స్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)