Money Heist Korea: ఈసారి దోపిడీ కొరియాలో.. మనీ హెయిస్ట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్!
మనీ హెయిస్ట్ కొరియా రీమేక్ క్యారెక్టర్ టీజర్‌ను నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసింది.
ఇటీవలే నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన మనీ హెయిస్ట్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే కొరియన్ వెబ్ సిరీస్‌లకు కూడా మంచి పేరు ఉంది. మరి మనీ హెయిస్ట్.. కొరియాలో జరిగితే ఎలా ఉంటుంది? ఈ ఆలోచనే నెట్‌ఫ్లిక్స్‌కు వచ్చింది. వెంటనే మనీ హెయిస్ట్ కొరియా రీమేక్ మొదలైపోయింది. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయిపోయింది. క్యారెక్టర్ ఇంట్రడక్షన్ టీజర్‌ను నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసింది. ఈ కొరియా వెర్షన్‌కు మనీ హెయిస్ట్: కొరియా - జాయింట్ ఎకనమిక్ ఎరా అని పేరు పెట్టారు.
2017లో మనీహెయిస్ట్ మొదటి సీజన్ విడుదల అయింది. మొదట దాన్ని స్పెయిన్‌లో మాత్రమే విడుదల చేయగా.. అంత పేరు రాలేదు. కానీ నెట్‌ఫ్లిక్స్ తన స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాంలో పెట్టాక ప్రపంచవ్యాప్తంగా ఈ షోకు మంచి క్రేజ్ వచ్చింది. ఇటీవలే విడుదల అయిన ఐదో సీజన్ ఇందులో ఆఖరిది.
2020లో కొరియా రీమేక్‌కు సంబంధించిన పనులు ప్రారంభం అయ్యాయి. కొరియన్ వెర్షన్‌లో 60 నిమిషాల నిడివి ఉన్న 12 ఎపిసోడ్లు ఉండనున్నాయని తెలుస్తోంది. ఐదు సీజన్ల కథను ఒకే సీజన్‌లో చెప్తారో.. లేకపోతే మరిన్ని సీజన్లు పొడిగిస్తారో అనే సంగతి ఇంకా తెలియరాలేదు.
మ్యాడ్ డాగ్ అనే ఫేమస్ కొరియన్ వెబ్ సిరీస్‌లో లీడ్ రోల్ చేసిన యూ జిన్-టే ఇందులో ప్రొఫెసర్ పోషిస్తున్నాడు. ఇక అత్యంత కీలకమైన, ఎంతో పేరు పొందిన బెర్లిన్ పాత్రలో స్క్విడ్ గేమ్‌లో హీరో ఫ్రెండ్‌గా నటించిన పార్క్ హే-సో కనిపించనున్నారు. అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న క్యాస్టింగ్‌తోనే వెళ్తున్నారు, దీంతోపాటు మనీ హెయిస్ట్ మంచి థ్రిల్లర్. అయితే కొరియా నేటివిటీకి తగ్గట్లు కొన్ని మార్పులు చేశామని మేకర్స్ అంటున్నారు. ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుందో లేదో చూడాలి మరి!
Also Read: 'వారియర్' టైటిల్ కోసం ఇద్దరు హీరోల ఫైట్.. నెగ్గేదెవరో..?
Also Read: అతడు టార్చర్ చేస్తుంటాడు.. ఆ విషయం తెలిస్తే రివెంజ్ తీర్చుకునేదాన్ని.. రష్మిక వ్యాఖ్యలు..