Image Credit:Ahavideoin/Instagram
Mentoo Movie: ఇటీవల కాలంలో ప్రేక్షకుడు సినిమాను చూసే విధానం పూర్తిగా మారిపోయింది. సినిమా విషయంలో ఒకప్పుడు ఉన్న లెక్కలు ఇప్పుడు లేవు. ఇప్పుడు అంతా సినిమాలో కంటెంట్ ఉంటే అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. కొన్ని చిన్న సినిమాలు కూడా పెద్ద హిట్ సాధిస్తున్నాయి. మరి కొన్ని విడుదల అయిన కొన్ని రోజులకే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లోకి వచ్చేస్తున్నాయి. ఇటీవల థియేటర్ లో విడుదల అయిన ‘#మెన్ టూ’ సినిమా కూడా త్వరలో ఓటీటీలో కి రానుంది. ఈ సినిమా మే 26 న థియేటర్ లలో విడుదల అయి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే విడుదల అయిన కొద్ది రోజులకే మూవీను ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్.
ఈ సినిమాలో నరేశ్ అగస్త్య, బ్రహ్మజీ, హర్ష చెముడు, సుదర్శన్, రియా సుమన్ తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో కనిపించారు. పురుషుల కష్టాలు ఎలా ఉంటాయో చూపించే కథతో హాస్యం ప్రధానంగా ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించిన అగస్త్య, బ్రహ్మాజీ, హర్ష, సుదర్శన్ లు ఓ పబ్ లో రెగ్యులర్ గా కలుస్తుంటారు. అయితే వీరంతా మహిళా బాధితులే ఒకరి కష్టాలను ఒకరితో చెప్పుకుంటూ ఉంటారు. ఇంతలో వీరి బ్యాచ్ లో ఓ వ్యక్తి చనిపోతాడు. అసలు ఆ వ్యక్తి ఎలా చనిపోయాడు, ఎందుకు చనిపోయాడు, అసలు అమ్మాయిలతో వాళ్లు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు అనేదే కథ. సినిమా మొత్తం నవ్వులతో సాగినా చివరలో ఎమోషన్స్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఇప్పుడీ సినిమాను ఓటీటీ లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించడంతో ఆసక్తి నెలకొంది.
‘మెన్ టూ’ సినిమాను విడుదల అయిన కొన్ని రోజులకే ఓటీటీ కు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఈ మూవీను ఆహా ఓటటీ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానుంది. జూన్ 9 నుంచి మూవీ ఆహా లో అందుబాటులో ఉంటుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆహా అధికారికంగా ప్రకటించింది. సినిమా స్టిల్స్ ను షేర్ చేస్తూ.. "ప్రపంచ పురుషోత్తములారా.. ఈ బిగ్ అనౌన్స్మెంట్ మీ కోసమే” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ మూవీకు శ్రీకాంత్ జి రెడ్డి దర్శకత్వం వహించగా మౌర్య సిద్దవరం నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. రియా సుమన్, ప్రియాంక శర్మ ప్రత్యేక పాత్రల్లో కనిపించారు. ఎలిషా ప్రవీణ్ జి, ఓషో వెంకట్ సంగీతం అందించారు.
Manchu Manoj: రాకింగ్ స్టార్ ఈజ్ బ్యాక్ - హోస్ట్ అవతారమెత్తిన మంచువారబ్బాయ్, ఇదిగో ప్రోమో!
'ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 3పై - అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన ప్రియమణి!
ఓటీటీలో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోన్న రణ్ వీర్, అలియా భట్ రీసెంట్ హిట్ - ఎక్కడంటే?
'పాపం పసివాడు' వెబ్ సీరిస్ సాంగ్ రిలీజ్ - ఆహాలో స్ట్రీమింగ్, ఎప్పుడంటే?
ఓంకార్ హారర్ వెబ్ సిరీస్ 'మాన్షన్ 24'లో సత్యరాజ్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Chandrababu Arrest : విశాఖలో టీడీపీ కొవొత్తుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, పలువురి అరెస్ట్ తో ఉద్రిక్తత
కాంగ్రెస్ లో ఉంటే, ఏ పదవీ లేకపోయినా గౌరవంగా బతకొచ్చు: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
Bigg Boss Season 7 Telugu: ‘బిగ్ బాస్’ హౌస్ నుంచి వంటలక్క ఔట్? మౌనితాకే మూడో పవర్ అస్త్ర!
IND Vs AUS: రెండో వన్డేలో తుదిజట్లు ఎలా ఉంటాయి? - భారత్ మార్పులు చేస్తుందా?
/body>