అన్వేషించండి

Manjummel Boys OTT: ‘మంజుమ్మెల్ బాయ్స్’ను వద్దంటున్న ఓటీటీలు - బ్లాక్‌బస్టర్ మూవీకి ఎందుకీ తిప్పలు?

Manjummel Boys OTT Release: ‘మంజుమ్మెల్ బాయ్స్’ సినిమా థియేటర్లలో రూ.130 కోట్ల కలెక్షన్స్ సాధించింది. కానీ ఓటీటీ విషయంలో మాత్రం దీనిని కొనుగోలు చేయడానికి ప్లాట్‌ఫార్మ్స్ సిద్ధంగా లేవని తెలుస్తోంది.

Manjummel Boys OTT Release Update: ఈమధ్య థియేటర్లలో బ్లాక్‌బస్టర్ అవుతున్న సినిమాలు.. ఓటీటీలోకి రావడం కష్టమయిపోయింది. ఇప్పటికే ‘హనుమాన్’ సినిమాకు ఓటీటీ కష్టాలు ఎదురవుతున్నాయి. ఇక మరో మలయాళ బ్లాక్‌బస్టర్ చిత్రానికి కూడా ఓటీటీ కష్టాలు ఎదురవుతున్నాయని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ సినిమా మరేదో కాదు.. ‘మంజుమ్మెల్ బాయ్స్’. ముందుగా హైదరాబాద్‌లోని కొన్ని థియేటర్లలో మలయాళంలోనే విడుదలయిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ సాధించడంతో తెలుగులో కూడా డబ్ అయ్యింది. థియేటర్లలో ఇంత క్రేజ్ సంపాదించుకున్నఈ సినిమా ఓటీటీ హక్కులను కొనుగోలు చేయడానికి మాత్రం ఏ ప్లాట్‌పార్మ్ ముందుకు రావడం లేదని సమాచారం.

ఎక్కువ డిమాండ్..

‘మంజుమ్మెల్ బాయ్స్’ చిత్రం థియేటర్లలో విడుదలయ్యి దేశవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ అందుకుంది. మలయాళ మేకర్స్ సత్తా ఏంటో ఈ సినిమా మరోసారి నిరూపించింది అంటూ సోషల్ మీడియాలో దీనికి తెగ ప్రశంసలు దక్కాయి. కానీ ఓటీటీ రిలీజ్ విషయంలో మాత్రం అలా జరగడం లేదట. థియేటర్లలో ఓ రేంజ్‌లో హిట్ అవ్వడంతో ఓటీటీ హక్కులను కాస్త ఎక్కువ రేటుకు అమ్మాలని మేకర్స్ నిర్ణయించుకున్నారట. దీంతో ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ ఏవీ ‘మంజుమ్మెల్ బాయ్స్’ కోసం అంత భారీ మొత్తాన్ని ఖర్చు చేయడానికి ముందుకు రావడం లేదని సమాచారం. ఇక ‘మంజుమ్మెల్ బాయ్స్’ కొనుగోలుకు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ ఆసక్తి చూపించడం లేదని వార్త సినీ సర్కిల్లో హాట్ టాపిక్‌గా మారింది.

అంతకంటే ఎక్కువ రాదు..

ప్రపంచవ్యాప్తంగా ‘మంజుమ్మెల్ బాయ్స్’కు రూ.130 కోట్ల కలెక్షన్స్ దక్కాయి. ఈ సినిమా కలెక్షన్స్ వేట ఇంకా ముగిసిపోలేదు. ఇప్పటికీ ఈ మూవీని చూడడానికి ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. అందుకే ‘మంజుమ్మెల్ బాయ్స్’ ఓటీటీ హక్కులను రూ.20 కోట్లకు అమ్మాలని మేకర్స్ నిర్ణయించుకున్నారట. కానీ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ మాత్రం దీనికి రూ.10 కోట్లు కంటే ఎక్కువ పెట్టడానికి ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది. ‘మంజుమ్మెల్ బాయ్స్’ మాత్రమే కాదు.. మరెన్నో ఇతర సౌత్ సినిమాలు కూడా థియేటర్లలో బ్లాక్‌బస్టర్ అందుకుంటే ఓటీటీ ప్రైజ్‌ను పెంచేస్తున్నాయని తెలుస్తోంది. ఇప్పుడు ఈ సినిమా కూడా అదే రూటును ఫాలో అవుతోంది.

త్వరలో తెలుగులో విడుదల..

ఇండస్ట్రీ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఒక చిత్రం థియేటర్లలో విడుదలయ్యి బ్లాక్‌బస్టర్ టాక్ అందుకుంటే.. దానిని ఓటీటీలో రిలీజ్ చేయడానికి కనీసం రెండు నెలలు అయినా గ్యాప్ ఇస్తున్నారు మేకర్స్. అంత ఆలస్యం అవ్వడంతో సినిమాకు ఎక్కువ ఫ్యాన్సీ ప్రైజ్ పెట్టి కొనుగోలు చేయడం అనవసరం అని భావిస్తున్నాయట ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్. దీనివల్ల ‘మంజుమ్మెల్ బాయ్స్’కు మాత్రమే కాదు.. మరెన్నో ఇతర సినిమాల ఓటీటీ రిలీజ్‌పై కూడా క్లారిటీ లేదని తెలుస్తోంది. ఇక చిదంబరం దర్శకత్వంలో తెరకెక్కిన ‘మంజుమ్మెల్ బాయ్స్’లో శోభున్ షాహిర్​, శ్రీనాథ్ బాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్, జూనియర్ లాల్, అభిరామ్, అరుణ్, దీపక్ లీడ్ రోల్స్‌లో నటించారు. మార్చి 15న ఈ మూవీ తెలుగు వర్షన్ థియేటర్లలో విడుదలకు సిద్ధమయ్యింది.

Also Read: రష్మిక, విజయ్‌ల ‘పింక్ క్యాప్‌’ సీక్రెట్ - మళ్లీ దొరికిపోయారంటున్న అభిమానులు, ఇదిగో ఫ్రూఫ్!

టాప్ హెడ్ లైన్స్

Memu Copulam Series OTT : మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Pyaar Prema Kalyanam OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Janhvi Kapoor: ఓటీటీలోకి జాన్వీ కపూర్... తమిళ వెబ్ సిరీస్‌లో ఆమె పాత్ర అదేనా?
ఓటీటీలోకి జాన్వీ కపూర్... తమిళ వెబ్ సిరీస్‌లో ఆమె పాత్ర అదేనా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget