అన్వేషించండి

Aattam OTT: ఓటీటీలోకి మలయాళ సూపర్ హిట్ థ్రిల్లర్ ‘ఆట్టం’ - స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Aattam OTT Release: మలయాళంలో థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కి సూపర్ హిట్‌ను అందుకుంది ‘ఆట్టం’. రెండు నెలల క్రితం థియేటర్లలో విడుదలయిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి ఎంటర్ అయ్యింది.

Aattam OTT Release Date: మలయాళ సినిమాలకు రోజురోజుకీ క్రేజ్ పెరిగిపోతోంది. దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్‌ను తమ కొత్త కథతో, కథనాలతో ఆకట్టుకుంటున్నారు మలయాళ మేకర్స్. చివరికి ఈ చిత్రాలను నేరుగా థియేటర్లలోనే చూసి, బ్లాక్‌బస్టర్ చేసేంత వరకు వెళ్లారు ప్రేక్షకులు. ఇక ఓటీటీలో కూడా మలయాళ చిత్రాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉండగా.. తాజాగా ఒక సూపర్ హిట్ సస్పెన్స్ మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. అదే ‘ఆట్టం’. మామూలుగా మలయాళ మేకర్స్ ఎక్కువగా ఫీల్ గుడ్ కథలతోనే ప్రేక్షకులను కట్టిపడేస్తారు. కానీ ‘ఆట్టం’ అలా కాదు. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్.

స్ట్రీమింగ్ మొదలు..

సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లకు భాషతో సంబంధం లేదు. ఏ భాషలో అయినా ఈ జోనర్‌లో సినిమాలు చూడడానికి ఎంతోమంది ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారు. అలాగే మలయాళంలో కూడా ‘ఆట్టం’ చూడాలని చాలామంది ప్రేక్షకులు ఎదురుచూడగా.. ఇప్పుడు ఇది ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో ‘ఆట్టం’ స్ట్రీమింగ్ ప్రారంభించుకుంది. ఈ సినిమాను ఓటీటీలో చూసినవారు అప్పుడే దీనికి పాజిటివ్ రివ్యూలు ఇచ్చేస్తున్నారు. కానీ ప్రస్తుతం ఈ మూవీ కేవలం మలయాళ భాషలో మాత్రమే అందుబాటులో ఉంది. దీనిని చూడాలనుకునే ప్రేక్షకులు సబ్ టైటిల్స్‌తె మ్యానేజ్ చేయవచ్చు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vinay Forrt (@vinayforrt)

నాటకం..

‘ఆట్టం’ అంటే తెలుగులో నాటకం అని అర్థం. ఈ మూవీని ఆనంద్ ఏకర్షి డైరెక్ట్ చేశాడు. వినయ్ ఫోర్ట్ ఇందులో హీరోగా నటించగా.. జరీన్ షిహాబ్ హీరోయిన్‌గా నటించింది. కళాభవన్ షాజాన్ కీలక పాత్రలో కనిపించారు. వీరితో పాటు అజీ తిరువంకులం, జాలీ ఆంటనీ, మదన్ బాబు, నందన్ ఉన్నీ, ప్రశాంత్ మాధవన్, సనోష్ మురళి, సెల్వరాజ్ రాఘవన్ తదితరులు కూడా ఈ సినిమాలో నటించారు. జాయ్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డాక్టర్ అజిత్ జాయ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా థియేటర్లలో విడుదల అవ్వకముందే ఎన్నో ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రసారం అయ్యింది. ఎన్నో అవార్డులను కూడా అందుకుంది.

ఎన్నో అవార్డులు..

గోవాలో జరిగిన 54వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఓపెనింగ్ ఫీచర్ ఫిల్మ్‌గా ఎంపికయ్యింది ‘ఆట్టం’. దీంతో పాటు ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ లాస్ ఏంజెల్స్‌లో కూడా ఈ సినిమాకు గ్రాండ్ జ్యూరీ అవార్డ్ దక్కింది. ఇక ఈ సినిమా గురించి తెలుసుకున్న తర్వాత మలయాళ మూవీలను ఇష్టపడే వారు దీనిని చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. 2024 జనవరి 5న ‘ఆట్టం’ థియేటర్లలో విడుదలయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా పలు థియేటర్లలో ఈ సినిమా రన్ అయ్యింది. కానీ అప్పట్లో దీనికి ఎక్కువగా ప్రమోషన్స్ చేయకపోవడంతో ఎక్కువమందికి ‘ఆట్టం’ రీచ్ అవ్వలేకపోయింది. ఓటీటీ మాత్రం బ్లాక్‌బస్టర్ అందుకునే సూచనలు కనిపిస్తున్నాయి.

Also Read: కవలలకు జన్మనిచ్చిన మనోజ్‌ భార్య మౌనిక అంటూ వార్తలు - క్లారిటీ ఇచ్చిన మంచు హీరో

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Chairman: క్షమాపణలు చెబితే చనిపోయిన వారు తిరిగొస్తారా ? -పవన్ డిమాండ్‌పై టీటీడీ చైర్మన్ కీలక వ్యాఖ్యలు
క్షమాపణలు చెబితే చనిపోయిన వారు తిరిగొస్తారా ? -పవన్ డిమాండ్‌పై టీటీడీ చైర్మన్ కీలక వ్యాఖ్యలు
Pawan Kalyan Tour In Pithapuram: క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌
క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌
NTR Nagar:  జగన్‌కు మరో షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం - సెంటు స్థలాల కాలనీలకు కొత్త పేరు ఖరారు!
జగన్‌కు మరో షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం - సెంటు స్థలాల కాలనీలకు కొత్త పేరు ఖరారు!
Ambati Rambabu: అంబటి రాంబాబుకు షాకిచ్చిన జగన్ - సత్తెనపల్లి ఇంచార్జ్‌గా తొలగింపు - కొత్త నేతకు చాన్స్
అంబటి రాంబాబుకు షాకిచ్చిన జగన్ - సత్తెనపల్లి ఇంచార్జ్‌గా తొలగింపు - కొత్త నేతకు చాన్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tirupati Stampede Explained | తిరుపతి తొక్కిసలాట పాపం ఎవరిది.? | ABP DesamTirupati Pilgrim Stampede CPR | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTirupati Pilgrim Stampede | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTTD Chairman BR Naidu on Stampede | తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఛైర్మన్ దిగ్భ్రాంతి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Chairman: క్షమాపణలు చెబితే చనిపోయిన వారు తిరిగొస్తారా ? -పవన్ డిమాండ్‌పై టీటీడీ చైర్మన్ కీలక వ్యాఖ్యలు
క్షమాపణలు చెబితే చనిపోయిన వారు తిరిగొస్తారా ? -పవన్ డిమాండ్‌పై టీటీడీ చైర్మన్ కీలక వ్యాఖ్యలు
Pawan Kalyan Tour In Pithapuram: క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌
క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌
NTR Nagar:  జగన్‌కు మరో షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం - సెంటు స్థలాల కాలనీలకు కొత్త పేరు ఖరారు!
జగన్‌కు మరో షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం - సెంటు స్థలాల కాలనీలకు కొత్త పేరు ఖరారు!
Ambati Rambabu: అంబటి రాంబాబుకు షాకిచ్చిన జగన్ - సత్తెనపల్లి ఇంచార్జ్‌గా తొలగింపు - కొత్త నేతకు చాన్స్
అంబటి రాంబాబుకు షాకిచ్చిన జగన్ - సత్తెనపల్లి ఇంచార్జ్‌గా తొలగింపు - కొత్త నేతకు చాన్స్
Sankranti Buses : ప్రైవేట్ ట్రావెల్స్ సంక్రాంతి దందా - ఒక్కో టిక్కెట్ ధర రూ.3వేలకుపైమాటే
ప్రైవేట్ ట్రావెల్స్ సంక్రాంతి దందా - ఒక్కో టిక్కెట్ ధర రూ.3వేలకుపైమాటే
Sankranti Special Buses : సంక్రాంతి కోసం 6432 ప్రత్యేక బస్సులు- ప్రైవేటు ట్రావెల్స్ ఛార్జీలు పెంచితే తాట తీస్తాం- పొన్నం ప్రభాకర్ హెచ్చరిక
సంక్రాంతి కోసం 6432 ప్రత్యేక బస్సులు- ప్రైవేటు ట్రావెల్స్ ఛార్జీలు పెంచితే తాట తీస్తాం- పొన్నం ప్రభాకర్ హెచ్చరిక
Game Changer Review - 'గేమ్ చేంజర్' రివ్యూ: పవన్ 'జనసేన'కు ప్లస్సే - రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా ఉందంటే?
'గేమ్ చేంజర్' రివ్యూ: పవన్ 'జనసేన'కు ప్లస్సే - రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా ఉందంటే?
498A: అతుల్ సుభాష్‌లా ఆత్మహత్య చేసుకుంటేనే స్పందిస్తారా ? తన సోదరుడి దుస్థితిపై తెలుగు యువతి ఆవేదన - ఈ ప్రశ్నకు బదులేది?
అతుల్ సుభాష్‌లా ఆత్మహత్య చేసుకుంటేనే స్పందిస్తారా ? తన సోదరుడి దుస్థితిపై తెలుగు యువతి ఆవేదన - ఈ ప్రశ్నకు బదులేది?
Embed widget