This Week OTT Movies: కొత్త సినిమాలతో దద్దరిల్లనున్న ఓటీటీ, ఈ వారం 20కి పైగా సినిమాలు, సీరిస్‌లు!
ఈ వారం థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు పెద్దగా లేవు. ఓటీటీ మాత్రం పెద్ద సంఖ్యలో విడుదల కానున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 20కి పైగా చిత్రాలు స్ట్రీమింగ్ కు రానున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
గత వారం రోజులుగా సినిమాలకు సంబంధి ఒకే ఒక్క టాపిక్ ‘ఆదిపురుష్‘. ఎట్టకేలకు జూన్ 16న విడుదలై థియేటర్లలో రన్ అవుతోంది. తొలి షో నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా అలరించలేదని చెప్పుకోవచ్చు. ఈ వారం థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు పెద్దగా లేవు. ఓటీటీలో మాత్రం పెద్ద సంఖ్యలు సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఒకటి రెండు కాదు, ఏకంగా 20కి పైగా కొత్త సినిమాలు ఈ వారంలో స్ట్రీమింగ్ కు రానున్నాయి. వీటిలో 'ద కేరళ స్టోరీ', ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్‘. ‘ఏజెంట్‘, 'ఇంటింటి రామాయణం', 'జాన్ విక్ 4' సహా పలు సినిమాలు ఉన్నాయి. ఈ వారంలో ఓటీటీలో సందడి చేయనున్న పూర్తి సినిమాల లిస్టు ఇప్పుడు తెలుసుకుందాం..
నెట్‌ఫ్లిక్స్
- గ్లామరస్ - ఇంగ్లీష్ సిరీస్ - జూన్ 22న విడుదల
- స్కల్ ఐలాండ్ - ఇంగ్లీష్ సిరీస్ - జూన్ 22న విడుదల
- స్లీపింగ్ డాగ్ - ఇంగ్లీష్ సిరీస్ - జూన్ 22న విడుదల
- సోషల్ కరెన్సీ - హిందీ సిరీస్ - జూన్ 22న విడుదల
- ఐ నంబర్ నంబర్: జోజి గోల్డ్ - ఇంగ్లీష్ మూవీ - జూన్ 23న విడుదల
- త్రూ మై విండో - ఇంగ్లీష్ సినిమా - జూన్ 23న విడుదల
- క్యాచింగ్ కిల్లర్స్: సీజన్ 3 - ఇంగ్లీష్ డాక్యుమెంటరీ - జూన్ 23న విడుదల
- టేక్ కేర్ ఆఫ్ మాయ - ఇంగ్లీష్ మూవీ (కొనసాగుతున్న స్ట్రీమింగ్)
- నాట్ క్వైట్ నార్వల్ - ఇంగ్లీష్ సిరీస్ (కొనసాగుతున్న స్ట్రీమింగ్)
అమెజాన్ ప్రైమ్
- టీకూ వెడ్స్ షేరు - హిందీ సినిమా - జూన్ 23న విడుదల
- పొన్నియిన్ సెల్వన్ 2 - హిందీ వెర్షన్ - జూన్ 23న విడుదల
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
- క్లాస్ ఆఫ్ '09 - ఇంగ్లీష్ సిరీస్ - జూన్ 21న విడుదల
- సీక్రెట్ ఇన్వేషన్ - ఇంగ్లీష్ సిరీస్ - జూన్ 21న విడుదల
- జాగ్డ్ మైండ్ - ఇంగ్లీష్ సినిమా - జూన్ 23న విడుదల
- కేరళ క్రైమ్ ఫైల్స్ - మలయాళ మూవీ - జూన్ 23న విడుదల
- వరల్డ్స్ బెస్ట్ - ఇంగ్లీష్ సినిమా - జూన్ 23న విడుదల
‘Kerala Crime Files’ - Shiju, Parayil Veedu, Neendakara' trailer is out now. Streaming from June 23rd in Malayalam in Hindi, Tamil, Telugu, Malayalam, Kannada, Bengali & Marathi#KeralaCrimeFiles #ShijuParayilVeeduNeendakara #HotstarSpecials #DisneyPlusHotstar #AjuVarghese #Lal pic.twitter.com/c8DEX4DDHg
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) June 8, 2023
ఆహా
- ఇంటింటి రామాయణం - తెలుగు సినిమా - జూన్ 23న విడుదల
జీ5
- కిసీ కా భాయ్ కిసీ కా జాన్ - తెలుగు డబ్బింగ్ మూవీ - జూన్ 23న విడుదల
- ది కేరళ స్టోరీ- తెలుగు డబ్బింగ్ సినిమా - జూన్ 23న విడుదల
సోనీ లివ్
- ఏజెంట్ -తెలుగు సినిమా - జూన్ 23న విడుదల
లయన్స్ గేట్ ప్లే
- జాన్ విక్ చాప్టర్ 4 - ఇంగ్లీష్ సినిమా - జూన్ 23న విడుదల
అడ్డా టైమ్స్
- ఫ్లై ఓవర్ - బెంగాలీ మూవీ - జూన్ 23న విడుదల
Read Also: రిహార్సల్స్ చేసి మరీ లిప్ లాక్ - వైరల్ గా మారిన స్మృతి వెంకట్ ముద్దు సీన్!