Jigel Movie OTT Streaming: 3 నెలల తర్వాత ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ 'జిగేల్' - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Jigel OTT Platform: రీసెంట్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ 'జిగేల్' తాజాగా ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. మార్చి 7న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ మంచి టాక్ సొంతం చేసుకుంది.

Arun's Jigel Movie OTT Streaming On Sunnxt: క్రైమ్, కామెడీ, రొమాంటిక్, హారర్ కామెడీ మూవీస్‌పై ఆడియన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తోన్న వేళ ఓటీటీలు అలాంటి కంటెంట్‌నే స్ట్రీమింగ్ చేస్తున్నాయి. తాజాగా రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ 'జిగేల్' ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో రిలీజ్ అయిన 3 నెలల తర్వాత స్ట్రీమింగ్ అవుతోంది.
ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
త్రిగుణ్, మేఘా చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ థ్రిల్లర్ 'జిగేల్' మార్చి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిన్న సినిమాగా రిలీజ్ అయినా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకుంది. తాజాగా.. ప్రముఖ ఓటీటీ 'సన్ నెక్స్ట్'లో గురువారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. 'స్టైల్, సస్పెన్స్, సర్‌ప్రైజెస్.. 'జిగేల్' కొత్త స్థాయి ఎంటర్‌టైన్‌మెంట్ అన్ లాక్ చేసేందుకు సిద్ధంగా ఉంది.' అంటూ సోషల్ మీడియా వేదికగా సదరు ఓటీటీ సంస్థ పేర్కొంది.
ఈ మూవీకి మల్లి యేలూరి దర్శకత్వం వహించగా.. వై.జగన్మోహన్, నాగార్జున అల్లం నిర్మించారు. సినిమాలో త్రిగుణ్, మేఘా చౌదరితో పాటు షియాజి షిండే, పోసాని కృష్ణమురళి, రఘుబాబు, పృథ్వీ రాజ్, మధునందన్, ముక్కు అవినాశ్, మేక రామకృష్ణ, నళిని, జయవాణి, అశోక్, గడ్డం నవీన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఆనంద్ మంత్ర మ్యూజిక్ అందించారు.
Style, suspense, and surprises—Jigel is here to unlock a whole new level of entertainment.🗝️💥
— SUN NXT (@sunnxt) June 4, 2025
Get ready for a ride that’s slick, smart, and seriously fun.#Jigel – Streaming Now on SunNXT! 🎬🍿#SunNXT #JigelOnSunNXT #Tollywood #NowStreaming #SunNXTExclusive #NewOnSunNXT… pic.twitter.com/TUv0uGd9r8
Also Read: 'థగ్ లైఫ్' రివ్యూ: కమల్‌ను శింబు డామినేట్ చేశారా? 'నాయకుడు'ను మర్చిపోయేలా మణిరత్నం సినిమా ఉందా?
స్టోరీ ఏంటంటే?
చిన్న చిన్న చోరీలు చేసుకునే ఓ ప్రేమ జంట చుట్టూ ఈ స్టోరీ ఉంటుంది. నందు (త్రిగుణ్) ఓ లాకర్ల దొంగ. తన టాలెంట్‌తో ఎలాంటి లాకర్ అయినా ఈజీగా బ్రేక్ చేస్తాడు. అతనికి కలలో ఓ అందమైన అమ్మాయి మీనా (మేఘా చౌదరి) కనిపిస్తుంది. ఆమెతో ఉన్నట్లు కలలు కంటాడు. అయితే, నిజంగానే ఆమెను చూసి ఆశర్యపోతూ.. లవ్‌లో పడతాడు. మీనా కూడా చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్నట్లు నందుకు తెలుస్తుంది. దీంతో ఇద్దరూ కలిసి చోరీలు చేయడం ప్రారంభిస్తారు.
ఇదే సమయంలో రాజా చంద్ర వర్మ ప్యాలెస్‍లో ఓ పురాతన లాకర్ ఉందని తెలుసుకుంటుంది మీనా. అందులో పెద్ద ఎత్తున విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయని.. అది తెరుచుకోవడం లేదని గుర్తిస్తుంది. ఆ లాకర్ గురించి మరింత సమాచారం తెలుసుకునేందుకు జేపీ (షియాజీ షిండే) దగ్గర పీఏగా చేరుతుంది. నందుతో కలిసి ఆ లాకర్ తెరవాలని ప్లాన్ చేస్తుంది మీనా. మరి ఆమె ప్లాన్ వర్కౌట్ అయ్యిందా?, అసలు ఆ లాకర్ ఎవరిది? దాని వెనుక స్టోరీ ఏంటి? లాకర్ తెరిచేందుకు యత్నించిన నందు, మీనాలకు ఎదురైన సవాళ్లేంటి? తెలియాలంటే మూవీ చూడాల్సిందే.





















