Jack OTT Release Date: ఓటీటీలోకి సిద్ధు 'జాక్' - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
Jack OTT Platform: యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ లేటెస్ట్ మూవీ 'జాక్'. ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ తాజాగా 'నెట్ ఫ్లిక్స్' ఓటీటీలోకి స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అవుతోంది.

Siddu Jonnalagadda's Jack OTT Release On Netflix: టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) నటించిన లేటెస్ట్ స్పై యాక్షన్ ఎంటర్‌టైనర్ 'జాక్' (Jack). ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. నెల రోజులైన కాక ముందే ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.
ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' (Netflix) సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నెల 8 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. దీనికి సంబంధించి ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో ఈ మూవీ అందుబాటులో ఉండనుంది.
Also Read: నెల రోజుల్లోపే ఓటీటీలోకి తమన్నా హారర్ థ్రిల్లర్ - 'ఓదెల 2' స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
ఈ మూవీ రిలీజ్‌కు ముందే ప్రమోషన్స్ కంటెంట్‌తో మంచి బజ్ నెలకొంది. అయితే, బాక్సాఫీస్ వద్ద మాత్రం నిరాశపరిచింది. దాదాపు రూ.8 కోట్లు మాత్రమే రాబట్టినట్లు తెలుస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించగా.. సిద్ధు సరసన యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించారు. మూవీలో సీనియర్ నటులు నరేష్, ప్రకాష్ రాజ్, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర మూవీస్ బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. సినిమాలో సిద్దు జొన్నలగడ్డ వన్ లైనర్స్, కామెడీ టైమింగ్, హీరోయిన్ వైష్ణవి చైతన్య యాక్టింగ్ బాగానే ఉన్నప్పటికీ, స్పై యాక్షన్ అంశాలు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా థ్రిల్ చేయలేదని అంటున్నారు.
స్టోరీ ఏంటంటే?
జాక్ అలియాస్ పాబ్లో నెరుడా (సిద్ధూ జొన్నలగడ్డ) బీటెక్ చేశాడు. ఏదో ఒక ఆర్డినరీ జాబ్ చేయడం ఇష్టం లేక రా (RAW) ఏజెంట్ కావాలని కలలు కంటాడు. ఇందుకోసం తీవ్రంగా ప్రయత్నిస్తూ.. తన టాలెంట్‌తో ఇంటర్వ్యూ వరకూ వెళ్తాడు. అయితే, జాబ్ వచ్చే లోపు తనను తాను నిరూపించుకోవాలని దేశాన్ని కాపాడేందుకు రంగంలోకి దిగుతాడు. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఉగ్రవాదులు విధ్వంసం సృష్టించేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుసుకుని వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు.
ఇదే సమయంలో 'జాక్' ఏం పని చేస్తున్నాడో తెలుసుకోవాలంటూ ప్రైవేట్ డిటెక్టివ్ అఫిషాన్ బేగం (వైష్ణవి చైతన్య)కు కాంట్రాక్ట్ ఇస్తాడు నెరుడా తండ్రి ప్రసాద్ (నరేశ్). దీంతో ఆమె అతనిపై నిఘా పెడుతుంది. టెర్రరిస్టులను పట్టుకునే క్రమంలో పొరపాటున 'రా'లో సీనియర్ ఆఫీసర్ మనోజ్ (ప్రకాష్ రాజ్)ను పట్టుకుంటాడు జాక్. దీంతో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? తీవ్రవాదిని పట్టుకోవడానికి జాక్ నేపాల్ వెళ్తే అతడి వెంట మనోజ్ అండ్ టీం కూడా వెళ్తుంది. అక్కడ ఏం జరిగింది? సర్జికల్ స్ట్రైక్ సమయంలో మృతి చెందిన అవుతార్ రెహ్మాన్ (రాహుల్ దేవ్) మళ్లీ ఎలా బ్రతికాడు? టెర్రరిస్టుల కుట్రను జాక్ ఎలా ఆపాడు? అతనికి 'రా'లో జాబ్ వచ్చిందా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.





















