Iraivan OTT Release : ఓటీటీలో నయనతార కొత్త సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
'జయం' రవి, నయనతార జంటగా నటించిన సినిమా 'ఇరైవన్'. తెలుగులో ఈ సినిమా 'గాడ్' పేరుతో విడుదలైంది.
God Telugu MOvie OTT Release : తమిళ స్టార్ హీరో 'జయం' రవి, లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara)లది సూపర్ డూపర్ హిట్ జోడీ. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన సినిమా 'ధృవ' గుర్తు ఉంది కదా! ఆ చిత్రానికి మాతృక, తమిళ సినిమా 'తని ఒరువన్'లో జయం రవి, నయనతార నటించారు. వాళ్ళిద్దరూ జంటగా నటించిన తాజా సినిమా 'ఇరైవన్' (Iraivan Movie).
తెలుగు ప్రేక్షకుల ముందుకు 'గాడ్'గా...
తెలుగులో 'ఇరవైన్' చిత్రాన్ని 'గాడ్' (GOD Telugu Movie) పేరుతో విడుదల చేశారు. తమిళంలో సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు సినిమా వస్తే... తెలుగులో ఈ నెల 13న విడుదల అయ్యింది. విమర్శకుల నుంచి తమిళంలో, తెలుగులో ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. ఐ.అహ్మద్ దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఇది. సుధన్ సుందరం, జి.జయరాం, సి.హెచ్.సతీష్ కుమార్ నిర్మాతలు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే...
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఈ నెల 26న...
'ఇరైవన్' / 'గాడ్' సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ నెల 26న తమిళం, తెలుగుతో పాటు కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది.
Also Read : అద్దంలో నన్ను నేను చూసుకుని గుర్తుపట్టలేదు - బాలకృష్ణ
'గాడ్' సినిమా విషయానికి వస్తే (GOD Movie Story)... అర్జున్ ('జయం' రవి), ఆండ్రూ (నరేన్ రామ్) ఏసీపీలు. అంతకు మించి మంచి స్నేహితులు. భయం అంటే ఏమిటో తెలియని దూకుడు స్వభావం కల వ్యక్తి అర్జున్. నేరస్థులను పట్టుకున్న తర్వాత ఇంటరాగేషన్, ఆ తర్వాత కోర్టు విచారణ పేరుతో టైమ్ వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు. ఎన్కౌంటర్లు చేస్తాడు. అర్జున్ చేసే తప్పుల్ని ఆండ్రూ కవర్ చేస్తుంటాడు. వీళ్ళిద్దరి చేతికి సైకో కిల్లర్ కేసు అప్పగిస్తారు.
నగరంలో పది మందికి పైగా అమ్మాయిలను అత్యంత దారుణంగా హత్యలు చేసిన సైకో కిల్లర్ స్మైలింగ్ బ్రహ్మ (రాహుల్ బోస్)ను పట్టుకుంటారు. అయితే... అతడిని పట్టుకునే క్రమంలో ఆండ్రూ ప్రాణాలు కోల్పోతాడు. ఆ తర్వాత పోలీస్ విధుల నుంచి అర్జున్ తప్పుకొంటాడు. పోలీసు సెక్యూరిటీ నడుమ ఆస్పత్రిలో బ్రహ్మ ఉండగా... బయట ఓ అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. తర్వాత ఆస్పత్రి నుంచి బ్రహ్మ తప్పించుకుంటాడు. ఈసారి అర్జున్ సన్నిహితులే లక్ష్యంగా హత్యలు మొదలవుతాయి. బ్రహ్మ తప్పించుకోవడానికి కారణం ఎవరు? కొత్త బ్రహ్మ ఎవరు? అతడిని అర్జున్ ఎలా పట్టుకున్నారు? అతని జీవితంలో ఆండ్రూ సోదరి ప్రియా (నయనతార) పాత్ర ఏమిటి? అనేది సినిమా.
Also Read : వెనక్కి తగ్గేది లేదు - ప్రభాస్‌తో పోటీలో ఒక్క రోజు ముందుకు షారుఖ్
జయం రవి, నయనతార జంటగా నటించిన ఈ సినిమాలో వినోద్ కిషన్, రాహుల్ బోస్ సీరియల్ కిల్లర్ రోల్స్ చేశారు. విజయలక్ష్మి, నరైన్ రామ్, ఆశిష్ విద్యార్థి తదితర ఆర్టిస్టులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : హరి కె.వేదాంతం, సంగీతం : యువన్ శంకర్ రాజా.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial