అన్వేషించండి

Dunki Vs Salaar : వెనక్కి తగ్గేది లేదు - ప్రభాస్‌తో పోటీలో ఒక్క రోజు ముందుకు షారుఖ్

రెబల్ స్టార్ ప్రభాస్ 'సలార్', బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ 'డంకీ' మధ్య పోటీ తప్పేలా లేదు. మరోసారి షారుఖ్ ఖాన్ సినిమా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశారు.

Dunki to release on Dec 21st : రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ మధ్య పోటీ తప్పేలా లేదు. క్రిస్మస్ పండక్కి కొన్ని రోజుల ముందు వాళ్ళిద్దరూ బాక్సాఫీస్ బరిలో పోటీ పడుతున్నారు. మరోసారి షారుఖ్ సినిమా విడుదల తేదీని కన్ఫర్మ్ చేశారు. 

డిసెంబర్ 21న 'డంకీ' విడుదల...
ఒక్క రోజు ముందుకు షారుఖ్ ఖాన్!
షారుఖ్ ఖాన్ 'డంకీ' సినిమాను డిసెంబర్ నెలలో విడుదల చేస్తామని చాలా రోజుల క్రితమే అనౌన్స్ చేశారు. అయితే... అనూహ్యంగా ఆ తేదీకి, క్రిస్మస్ సీజన్ బరిలోకి ప్రభాస్ 'సలార్' సినిమా వచ్చింది. దాంతో తెలుగు సినిమాలు నాని 'హాయ్ నాన్న', నితిన్ 'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్' డిసెంబర్ 7, 8 తేదీలకు వచ్చాయి. విక్టరీ వెంకటేష్ 'సైంధవ్' అయితే సంక్రాంతి పండక్కి... జనవరి 13వ తేదీకి వెళ్ళింది. 

షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) 'డంకీ' సైతం వాయిదా పడుతుందని వార్తలు వచ్చాయి. ప్రభాస్ 'సలార్'తో పోటీకి వెనకడుగు వేసిందని గుసగుసలు చాలా వినిపించాయి. అయితే... అటువంటిది ఏమీ లేదని గతంలో కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు మరోసారి విడుదల తేదీ వెల్లడించారు. చిన్న ఛేంజ్ ఏమిటంటే... ఒక్క రోజు సినిమా ముందుకు వెళ్ళింది. డిసెంబర్ 22న కాకుండా 21న థియేటర్లలోకి వస్తున్నారు షారుఖ్. అదీ సంగతి!

Also Read : 'లియో' రివ్యూ : LCUలో విజయ్ - దర్శకుడు లోకేష్ కనగరాజ్ మేజిక్ వర్కవుట్ అవుతుందా? లేదా?

'పఠాన్', 'జవాన్'... ఈ ఏడాది షారుఖ్ ఖాన్ రెండు భారీ విజయాలు నమోదు చేశారు. బాక్సాఫీస్ బరిలో ఆయన సినిమాలు కొత్త సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాయి. మరి, ఇయర్ ఎండింగ్‌లో మరో హిట్టు కొట్టి హ్యాట్రిక్ నమోదు చేస్తారో? లేదో? వెయిట్ అండ్ సి!

షారుఖ్ ఖాన్ బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలు... ఆయన విజయాల జోరుకు తోడు 'మున్నాభాయ్ ఎంబీబీఎస్', 'లగే రహో మున్నాభాయ్', '3 ఇడియట్స్', 'సంజు' చిత్రాల దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ ఉండటంతో 'డంకీ' మీద ఉత్తరాది ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. రాజ్ కుమార్ హిరాణీకి తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. 

Also Read : టైగర్ నాగేశ్వరరావు రివ్యూ : రవితేజ ప్రేక్షకుల మనసు దోచుకున్నాడా? లేదా? సినిమాలో ప్లస్, మైనస్ పాయింట్స్ ఏంటి?

షారుఖ్ జోరు మీద ఉంటే... మరోవైపు ప్రభాస్ లాస్ట్ రెండు సినిమాలు ఆశించిన విజయాలు సాధించలేదు. భారీ ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ... సినిమాల్లో విషయం లేకపోవడంతో వీకెండ్ తర్వాత చతికిలపడ్డాయి. అయితే... 'కెజియఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ ఉండటం, 'రాధే శ్యామ్' & 'ఆదిపురుష్' తరహాలో కాకుండా 'సలార్' అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమా కావడంతో ఈసారి తప్పకుండా భారీ సక్సెస్ కొట్టడం ఖాయమని పరిశ్రమ వర్గాలు కూడా భావిస్తున్నాయి. 

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Anirudh Kavya Maran Wedding : పురోహితులు లేరు... గొలుసులే మార్చుకున్నారు - అనిరుధ్, కావ్య మారన్ సెల్ప్ రెస్పెక్ట్ మ్యారేజ్
పురోహితులు లేరు... గొలుసులే మార్చుకున్నారు - అనిరుధ్, కావ్య మారన్ సెల్ప్ రెస్పెక్ట్ మ్యారేజ్
Ranabaali OTT : ఓటీటీలోకి వచ్చేసిన రణబాలి - విరోష్ కపుల్ కొత్త మూవీ ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేసిన రణబాలి - విరోష్ కపుల్ కొత్త మూవీ ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Today OTT Series : శుక్రవారం ఓటీటీల్లో సూపర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లు - ఈ ఓటీటీల్లో డోంట్ మిస్
శుక్రవారం ఓటీటీల్లో సూపర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లు - ఈ ఓటీటీల్లో డోంట్ మిస్
Itlu Arjuna Twitter Review : ఇట్లు అర్జున ట్విట్టర్ రివ్యూ - మూగవాడిగా యంగ్ హీరో అనీష్ మెప్పించాడా?... నెటిజన్స్ ఏమంటున్నారు?
ఇట్లు అర్జున ట్విట్టర్ రివ్యూ - మూగవాడిగా యంగ్ హీరో అనీష్ మెప్పించాడా?... నెటిజన్స్ ఏమంటున్నారు?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KA Paul on Revanth Reddy: నాతో చేతులు కలపండి.. రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చేస్తా.. కాంగ్రెస్ నేతలకు కేఏ పాల్ పిలుపు
నాతో చేతులు కలపండి.. రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చేస్తా.. కాంగ్రెస్ నేతలకు కేఏ పాల్ పిలుపు
CM Revanth Reddy: హైదరాబాద్‌లో కొత్త రవాణా వ్యవస్థ.. 3 కారిడార్లలో PRTS కు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం
హైదరాబాద్‌లో కొత్త రవాణా వ్యవస్థ.. 3 కారిడార్లలో పీఆర్టీఎస్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం
Hyderabad Bharat Summit : హైదరాబాద్‌లో భారత్ సమ్మిట్.. 70 దేశాల ప్రతినిధుల రాక, రాహుల్ గాంధీ పర్యటనపై ఉత్కంఠ!
హైదరాబాద్‌లో భారత్ సమ్మిట్.. 70 దేశాల ప్రతినిధుల రాక, రాహుల్ గాంధీ పర్యటనపై ఉత్కంఠ!
Why Close Aides Are Leaving YS Jagan: విజయమ్మ, షర్మిల నుంచి విజయసాయిరెడ్డి వరకు - వైఎస్ జగన్‌కు ఆప్తులే ఎందుకు శత్రువులవుతున్నారు? అసలు తప్పు ఎక్కడుంది?
విజయమ్మ, షర్మిల నుంచి విజయసాయిరెడ్డి వరకు - వైఎస్ జగన్‌కు ఆప్తులే ఎందుకు శత్రువులవుతున్నారు? అసలు తప్పు ఎక్కడుంది?
Makhana For Thyroid : థైరాయిడ్ ఉన్నవారు రోజూ మఖానా తింటే కలిగే లాభాలు ఇవే.. ఎలా తింటే మంచిదంటే..
థైరాయిడ్ ఉన్నవారు రోజూ మఖానా తింటే కలిగే లాభాలు ఇవే.. ఎలా తింటే మంచిదంటే..
AP Municipal Elections 2026: 4 కార్పొరేషన్లలో టీడీపీ ఒక్క చోటే పోటీ.. పుంజుకోవడానికి వైసీపీకి ఇది మరో సువర్ణావకాశమా?
4 కార్పొరేషన్లలో టీడీపీ ఒక్క చోటే పోటీ.. పుంజుకోవడానికి వైసీపీకి ఇది మరో సువర్ణావకాశమా?
Expert Opinion: కాలంతో పాటు బైక్‌లు మారుతున్నా సర్వీసింగ్‌ తీరు మారడం లేదు.. ఇంకా మెరుగుపడాలి!
ఖరీదైన, మోడ్రన్‌ బైక్‌లు.. నాసిరకం, పాతకాలపు సర్వీసింగ్! మెకానిక్‌లు మెరుగుపడేది ఎప్పుడు?
Telangana Volunteer System : తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
Embed widget