Inspector Zende OTT Release Date: రియల్ లైఫ్ పోలీస్... బికినీ కిల్లర్ క్రైమ్ స్టోరీ - 'కుబేర' విలన్ మూవీ ఎక్స్‌క్లూజివ్‌గా ఆ ఓటీటీలోకి వచ్చేస్తోంది
Inspector Zende OTT Platform: ఓటీటీ ఆడియన్స్‌కు ఫుల్ థ్రిల్ పంచేందుకు మరో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ వచ్చేస్తోంది. రియల్ సంఘటనల ఆధారంగా రూపొందిన 'ఇన్‌స్పెక్టర్ జెండె' మూవీ ఓటీటీలోకి రాబోతోంది.

Manoj Bajapayee's Inspector Zende OTT Release On Netflix: మూవీ లవర్స్, ఓటీటీ ఆడియన్స్ ఇంట్రెస్ట్‌కు అనుగుణంగా ప్రముఖ ఓటీటీలు ఎక్స్‌క్లూజివ్‌గా హారర్, క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ జానర్లలో కంటెంట్‌నే ఎక్కువగా అందుబాటులో ఉంచుతున్నాయి. తాజాగా మరో ఎక్స్‌క్లూజివ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి రాబోతోంది.
ఎందులో స్ట్రీమింగ్ అంటే?
బాలీవుడ్ యాక్టర్ మనోజ్ బాజ్‌పేయి, జిమ్ సర్బ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'ఇన్‌స్పెక్టర్ జెండే'. చిన్మయ్ డి మాండ్లేకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబర్ 5 నుంచి ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ కానుంది. జై షేవక్రమణి, ఓం రౌత్ నిర్మాతలుగా వ్యవహరించారు. 'ఇంటర్ పోల్ మోస్ట్ వాంటెడ్ ముంబైలోని అత్యంత ఆపలేని వ్యక్తిని కలుస్తుంది. ఈసారి కార్ల్ భోజరాజ్ తప్పించుకోగలరా?' అంటూ సదరు ఓటీటీ సంస్థ ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ మూవీలో మనోజ్, జిమ్ సర్బ్‌లతో పాటు బాలచంద్ర కదమ్, సచిన్ ఖేడ్కర్, హరీష్ దుదాడే, గిరిజా ఓక్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
View this post on Instagram
రియల్ సంఘటనల ఆధారంగా...
1970ల్లో జరిగిన స్విమ్ సూట్ కిల్లర్‌గా పేరుగాంచిన నిందితుడిని పట్టుకున్న ఓ పోలీస్ రియల్ లైఫ్ సంఘటనల ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. బికినీ కిల్లర్ రోల్‌లో జిమ్ సర్బ్ నటిస్తుండగా... మనోజ్ బాజ్‌పేయి ఇన్‌స్పెక్టర్ జెండే రోల్ పోషిస్తున్నారు. సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్ స్టోరీ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మరి ఆ స్విమ్ సూట్ కిల్లర్‌ను పట్టుకునే క్రమంలో ఆ ఇన్వెస్టిగేషన్ అధికారికి ఎదురైన పరిణామాలేంటి? వరుస హత్యలు చేస్తూ పోలీసులకే సవాల్‌గా మారిన నిందితుడిని ఎలా పట్టుకున్నారు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.





















