Insidious: The Red Door : హాలీవుడ్ హారర్ మూవీ ‘ఇన్సిడియస్: ది రెడ్ డోర్’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది!
హాలీవుడ్ హారర్ మూవీ ‘ఇన్సిడియస్: ది రెడ్ డోర్’ సినిమా త్వరలో ఓటీటీలోకి రానుంది. ఈ మేరకు చిత్రబృందం ఓటీటీ రిలీజ్ డేట్, ప్లేస్ ను ప్రకటించింది.
Insidious: The Red Door : హాలీవుడ్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉంటారు. ఇండియాలో కూడా హాలీవుడ్ సినిమాలను ఎక్కువగా ఇష్టపడుతుంటారు మూవీ లవర్స్. అందులోనూ హాలీవుడ్ హారర్ సినిమాలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుంది. అలాంటి హాలీవుడ్ హారర్ సినిమాల్లో ‘ఇన్సిడియస్’ సిరీస్ కూడా ఒకటి. 2010 లో వచ్చిన ‘ఇన్సిడియస్’ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దీని తర్వాత ఆ మూవీకు సీక్వెల్ గా ‘ఇన్సిడియస్ చాప్టర్ 2’ 2013 లో విడుదల అయింది. ఈ మూవీ వచ్చి దాదాపు పదేళ్లు గడుస్తోంది. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ ఈ సిరీస్ నుంచి మరో మూవీ వచ్చింది. అదే ‘ఇన్సిడియస్: ది రెడ్ డోర్’. ఈ సినిమాకు పాట్రిక్ విల్సన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ జులై 6 న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో లేటెస్ట్ అప్డేట్ ఒకటి వచ్చింది. మూవీ త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్టు ప్రకటించారు మేకర్స్.
నెట్ ఫ్లిక్స్ లో ‘ఇన్సిడియస్: ది రెడ్ డోర్’
వెన్నులో వణుకు పుట్టించే ఈ హర్రర్ థ్రిల్లర్‌కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇదివరకు వచ్చిన మూవీస్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ‘ఇన్సిడియస్: ది రెడ్ డోర్’ మూవీను నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేయనున్నారు మేకర్స్. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ‘ఇన్సిడియస్: ది రెడ్ డోర్’ మూవీను థియేటర్లలో మిస్ అయిన వారు నెట్ ఫ్లిక్స్ లో చూడొచ్చని తెలిపారు మేకర్స్. ఇక ఈ సినిమా నవంబర్ 4 నుంచి నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంటుందని తెలిపారు.
‘ఇన్సిడియస్: ది రెడ్ డోర్’ కథేంటంటే?
‘ఇన్సిడియస్: ది రెడ్ డోర్’ ఇన్సిడియస్ సీరీస్ లో 5వ పార్ట్ గా రిలీజైంది. ‘ఇన్సిడియస్ చాప్టర్ 2’ సినిమా ముగింపు అంటే దాదాపు పదేళ్ల తర్వాత ఈ సినిమా కంటిన్యూ పార్ట్ విడుదలైంది. జోష్ లాంబెర్ట్ తన కొడుకు డాల్టన్ ను ఒక ఇడిలిక్ యూనివర్శిటీకి పంపడానికి వెళ్తాడు. అయితే అక్కడ వాతావరణం డాల్టన్ కు ఒక పీడకలలా తయారవుతుంది. ఇందులో గతంలో అతని చేత అణచివేతకు గురైనవాళ్లు సడెన్ గా వీరిని వెంటాడేందుకు వస్తారు. అయితే వారిని అంతం చేయడానికి, లాంబెర్ట్ పీడకలని ఆపడానికి జోష్, డాల్టన్ ఏం చేశారు అనేదే ‘ఇన్సిడియస్: ది రెడ్ డోర్’ కథ. అయితే ఈ సినిమాకు అనుకున్నంతగా సినీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. మూవీలో మంచి బ్యాగ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఆర్ట్ డైరెక్షన్ తో కాస్త పర్వాలేదనిపించింది. అయితే గతంలో సిరీస్ లు చూసిన వారు మాత్రం ఈ మూవీను మిస్ అవ్వకుండా చూస్తారు. ఈ మూవీలో డాల్టన్ లాంబెర్ట్ గా టై సింప్కిన్స్, జోష్ లాంబెర్ట్ గా పాట్రిక్ విల్సన్, ఫోస్టర్ లాంబెర్ట్ గా ఆండ్రూ ఆస్టర్ తదితరులు నటించారు.
Also Read: ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial