అన్వేషించండి

This Week Movie Releases: ఈ ఏడాది ఫస్ట్ వీక్ రిలీజ్ కానున్న మూవీస్ ఇవే - థియేటర్లో కంటే ఓటీటీల్లోనే ఎక్కువ సందడి!

OTT releases: న్యూ ఇయర్ అయినా కూడా థియేటర్లలో హైప్ ఉన్న కొత్త సినిమాలు ఏమీ విడుదల కావడం లేదు. కానీ ఓటీటీలో మాత్రం పలు ఎంటర్‌టైనింగ్ సినిమాలు, సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

New year first week ott releases: న్యూ ఇయర్‌లో ముందుగా భారీ బడ్జెట్ తెలుగు సినిమాలు ఏవీ ప్రేక్షకుల ముందుకు రావడం లేదు. న్యూ ఇయర్ రోజుతో పాటు ఫస్ట్ వీకెండ్‌లో కేవలం రెండు సినిమాలు మాత్రమే ప్రేక్షకులను అలరించనున్నాయి. ఇక థియేటర్ల విషయం పక్కన పెడితే.. ఓటీటీలో మాత్రం తెలుగుతో పాటు మరెన్నో ఇతర భాషల చిత్రాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాయి. 

థియేటర్లలో వేడుక లేదు

న్యూ ఇయర్ సందర్భంగా సింగర్ సునీత కుమారుడు ఆకాశ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘సర్కారు నౌకరి’ థియేటర్లలో విడుదలయ్యింది. గంగనమోని శేఖర్ దర్శకత్వంలో వహించిన ఈ మూవీతో భావన వళపండల్ హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. హీరోహీరోయిన్లు కొత్తవారే అయినా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు.. ‘సర్కారు నౌకరి’లోని కంటెంట్ నచ్చి దీనిని నిర్మించడానికి ముందుకొచ్చారు. సునీతతో పాటు ఆకాశ్ కూడా ఈ మూవీ ప్రమోషన్స్ కోసం చాలా కష్టపడ్డాడు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కింది ఈ చిత్రం. ఇక ‘సర్కారు నౌకరి’ న్యూ ఇయర్ సందర్భంగా విడుదలయితే.. ‘రాఘవరెడ్డి’ అనే మరో చిత్రం డిసెంబర్ 5న విడుదల సిద్ధమవుతోంది. శివ కంఠమనేని హీరోగా నటిస్తున్న ఈ సినిమా సంజీవ్ మేగోటి తెరకెక్కించారు.

‘హాయ్ నాన్న’ కోసం ఎదురుచూపులు

న్యూ ఇయర్ అయినా కూడా థియేటర్లో కొత్త సినిమాల సందడి అంతగా లేకపోయినా.. ఓటీటీలో మాత్రం బాగానే ఉంది. ఈవారం ఓటీటీలో విడుదలవుతున్న చిత్రాల్లో ముందుగా చెప్పుకోవాల్సిన చిత్రం ‘హాయ్ నాన్న’. శౌర్యువ్ దర్శకత్వంలో నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ మూవీ థియేటర్లలో బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. కొంతమంది ప్రేక్షకులు అయితే ఒకసారి చూస్తే సరిపోలేదని ఈ మూవీ కోసం మళ్లీ మళ్లీ థియేటర్లకు వెళ్లారు. ఇక ఫైనల్‌గా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే సమయం వచ్చేసింది. జనవరి 4న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యింది ‘హాయ్ నాన్న’.

  • ‘బిట్‌కాన్డ్’, ‘గుడ్ గ్రీఫ్’ అనే హాలీవుడ్ చిత్రాలు కూడా న్యూ ఇయర్ సందర్భంగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నాయి.
  • ‘కన్జూరింగ్ కన్నప్పన్’ అనే తమిళ చిత్రం కూడా జనవరి 5న స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యింది. ఇది తెలుగులో కూడా స్ట్రీమింగ్ కానుంది.
  • ‘ఫూల్ మీ వన్స్’, ‘ది బ్రదర్స్ సన్’ అనే రెండు వెబ్ సిరీస్‌లు కూడా నెట్‌ఫ్లిక్స్ ప్రేక్షకులను అలరించనున్నాయి.

ఈటీవీ విన్‌లో బిగ్ బాస్ శివాజీ వెబ్ సీరిస్

  • అమేజాన్ ప్రైమ్‌లో ‘టైగర్’ అనే హిందీ చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
  • ‘మ్యారీ మై హజ్బెండ్’ అనే ఒక కొరియన్ మూవీ న్యూ ఇయర్ సందర్భంగా ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
  • జియో సినిమాలో ‘మెగ్ 2 - ది ట్రెంచ్’ అనే హాలీవుడ్ చిత్రం జనవరి 3న స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యింది.
  • జీ5లో ‘తేజస్’, సోనీలివ్‌లో ‘క్యూబికల్స్’ అనే హిందీ చిత్రాలు జనవరి 5న స్ట్రీమింగ్‌ను ప్రారంభించుకోనున్నాయి.
  • బిగ్ బాస్ ఫేమ్ శివాజీ ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘#90s’ అనే తెలుగు వెబ్ సిరీస్.. జనవరి 5 నుంచి ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఇందులో శివాజీతో పాటు వాసుకి ఆనంద్, మౌళి, వసంతిక, రోహన్, స్నేహల్ కూడా కీలక పాత్రలో పోషిస్తున్నారు. ఈటీవీ విన్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.

Also Read: మాలశ్రీ కూతురు అదిరిపోయే ఎంట్రీ, తొలి మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ - ‘సలార్’కే పోటీ!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Embed widget