Animal OTT Release: ‘యానిమల్’ ఓటీటీ రిలీజ్‌కు లైన్ క్లియర్ - ఆ ఎక్స్‌ట్రా సీన్స్‌తో పాటు స్ట్రీమింగ్‌కు సిద్ధం
Animal OTT Release: రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘యానిమల్’ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఫైనల్‌గా అవన్నీ క్లియర్ అయినట్టు తెలుస్తోంది.
Animal OTT Release: కొన్ని సినిమాలు థియేటర్లలో మాత్రమే కాదు.. ఓటీటీలోకి వచ్చేవరకు కూడా కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తూనే ఉంటాయి. అలాంటి వాటిలో ఇప్పుడు ‘యానిమల్’ కూడా యాడ్ అవ్వనుంది. ఇప్పటికీ సినీ సర్కిల్లో ‘యానిమల్’ ఓటీటీ రిలీజ్‌పై అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి. అసలు ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడు ప్రారంభించుకుంటుందా అని చాలామంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ‘యానిమల్’ ఓటీటీ రిలీజ్‌కు చాలాసార్లు బ్రేకులు పడగా.. ఫైనల్‌గా దీనిపై ఒక క్లారిటీ వచ్చేసింది. ఈ మూవీని ఓటీటీలో చూడడానికి ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఒక గుడ్ న్యూస్ వినిపిస్తోంది.
ఫైనల్‌గా లైన్ క్లియర్..
‘యానిమల్’ సినిమాకు కో ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరించిన Cine1 స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్.. మరో నిర్మాణ సంస్థ అయిన టీ సిరీస్‌పై కేసు పెట్టడంతో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ వాయిదా పడే అవకాశాలు కనిపించాయి. ముందుగా అనుకున్న అగ్రిమెంట్ ప్రకారం.. ఈ రెండు సంస్థలు కలిపి ‘యానిమల్’ మూవీని నిర్మించాయి. ఇక ఆ అగ్రిమెంట్‌లో ఉన్నట్టుగా ‘యానిమల్’ నుంచి 35 శాతం ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, 35 శాతం లాభాల్లో షేర్.. Cine1 స్టూడియోస్‌కు దక్కాల్సి ఉంది. అయితే లాభాల షేరింగ్ విషయంలో అగ్రిమెంట్‌ను టీ సిరీస్ పక్కన పెట్టిందని.. అంతే కాకుండా సినిమాను ప్రమోట్ చేస్తున్న సమయంలో తమకు ఎలాంటి వివరాలను అందించలేదని Cine1 స్టూడియోస్ ఆరోపించింది. దీంతో ‘యానిమల్’ ఓటీటీ రిలీజ్‌పై ఢిల్లీ హై కోర్టు ఆలోచనలో పడింది. కానీ ఫైనల్‌గా లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది.
సెటిల్‌మెంట్ అయిపోయింది..
జనవరి 22న Cine1 స్టూడియోస్‌తో పాటు టీ సిరీస్ కూడా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఇక రెండు పార్టీల తరపున న్యాయవాదులు ఫైనల్‌గా ఒక సెటిల్‌మెంట్‌గా వచ్చారు. ఆ సెటిల్‌మెంట్‌ను, దానికి సంబంధించిన అగ్రిమెంట్‌ను కోర్టు ముందు పెట్టారు. జనవరి 24న ఈ కేసుకు సంబంధించిన ఫైనల్ తీర్పు రానుంది. ఎక్కువశాతం రెండు పార్టీలు ఒక సెటిల్‌మెంట్‌కు వచ్చేయడంతో ‘యానిమల్’ ఓటీటీ రిలీజ్‌కు ఇక లైన్ క్లియర్ అయినట్టే అని తెలుస్తోంది. ముందుగా జనవరి 26న ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభించుకోనున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఇంతలోనే Cine1 స్టూడియోస్ పెట్టిన కేసు వల్ల ‘యానిమల్’ ఓటీటీ రిలీజ్ వాయిదా పడే అవకాశాలు కనిపించాయి. ఫైనల్‌గా ఈ ఓటీటీ రిలీజ్‌కు సర్వం సిద్ధమయ్యిందని సమాచారం.
ఎక్స్‌ట్రా సీన్స్‌తో పాటు..
3 గంటల 21 నిమిషాల నిడివితో ‘యానిమల్’ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యింది. అయితే ఓటీటీ వర్షన్‌లో మాత్రం మరికొన్ని సీన్స్‌ను యాడ్ చేస్తానని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ముందు నుండి చెప్తూనే ఉన్నాడు. దాదాపు 8 నుండి 10 నిమిషాల ఎక్స్‌ట్రా సీన్స్‌ను యాడ్ చేసి పూర్తిగా 3 గంటల 30 నిమిషాల ‘యానిమల్’ వర్షన్‌ను ఓటీటీలో స్ట్రీమ్ చేయనున్నట్టు సమాచారం. రణబీర్ కపూర్, రష్మిక మందనా హీరోహీరోయిన్లుగా నటించిన ‘యానిమల్’ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఒక సెన్సేషన్‌ను సృష్టించింది. ఇందులో తృప్తి దిమ్రీ, అనిల్ కపూర్ వంటి వారు కూడా ఇతర కీలక పాత్రల్లో కనిపించారు.
Also Read: ‘ఫైటర్’ సినిమా రిలీజ్‌కు ఒప్పుకోని ఆ దేశాలు, కారణం ఇదేనా?