ott release: ఆ ఓటీటీలోకి యోగిబాబు ‘గుడ్ లక్ గణేశా’ మూవీ - తెలుగు ట్రైలర్ చూశారా?
Goodluck Ganesha : యోగిబాబు నటించిన 'యానై ముగతాన్' మూవీ ఇప్పుడు తెలుగులో వచ్చేసింది. 'ఆహా' ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో దాన్ని రిలీజ్ చేశారు. 'గుడ్‌లక్ గణేశ' పేరుతో తెలుగు ప్రేక్షకుల మందుకు రాబోతోంది
YogiBabu Superhit Movie: ఒకప్పుడు ఏదైనా సినిమా ఒక భాషలో వచ్చి.. అది పెద్ద హిట్ అయ్యిందంటే దాన్ని మనం ఆ రాష్ట్రానికి వెళ్లి, అదే భాషలో చూడాలి. లేదంటే ఎవరైనా పెద్ద ప్రొడ్యూసర్లు చూసి దాన్ని ఇంకో పెద్ద హీరోతో రీమేక్ చేసి రిలీజ్ చేసేవాళ్లు. అలా ఎన్నో సినిమాలు వచ్చాయి, చూశాం. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఓటీటీలు వచ్చేశాయి. మంచి మంచి సినిమాలు భాషతో సంబంధం లేకుండా రిలీజ్ అయిపోతున్నాయి. ఈ మధ్యకాలంలో అలా ఎన్నో సినిమాలు తెలుగులో రిలీజ్ అయ్యాయి. ఇక ఇప్పుడు మరో హిట్ సినిమా తెలుగులో రిలీజ్ కాబోతోంది. అదే యోగిబాబు నటించిన 'యానై ముగతాన్' అనే తమిళ్ సినిమా.. ఇప్పుడు తెలుగులో వచ్చేసింది. 'ఆహా' ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో దాన్ని రిలీజ్ చేశారు. 'గుడ్‌లక్ గణేశ' పేరుతో తెలుగు ప్రేక్షకుల మందుకు తీసుకొస్తున్నారు. ఆ సినిమాకి సంబంధించి ట్రైలర్‌ని కూడా తెలుగులో ఇప్పటికే రిలీజ్ చేసింది ఆహా..సినిమాకి సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ ట్వీట్ చేసింది.
గుడ్‌లక్ గణేశ
యోగిబాబు.. పరిచయం అక్కర్లేని పేరు. పేరుకు తమిళ్ యాక్టర్ అయినప్పటికీ తెలుగులో కూడా ఆయనకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. తనదైన కామెడీ టైమింగ్‌తో కడుపుబ్బా నవ్విస్తారు యోగిబాబు. తమిళ్‌లో హీరోలతో సమానంగా క్రేజ్ ఉంది యోగిబాబుకి. ఇక ఆయన ఎంచుకునే సినిమాలు కూడా దాదాపు అన్నీ హిట్ అనే చెప్పాలి. అలా గత ఏడాది ఏప్రిల్‌లో తమిళ్‌లో రిలీజైన 'యానై ముగతాన్' అనే సినిమా కూడా చాలా పెద్ద హిట్ అయ్యింది. తమిళనాట ఈ సినిమాకి మంచి రివ్యూలు వచ్చాయి. దీంతో దాన్ని ఇప్పుడు 'గుడ్‌లక్ గణేశ' పేరుతో తెలుగులోకి రిలీజ్ చేశారు. '' ఈ గణేశ్ కోసం ఆ గణేశ్ వస్తున్నాడు'' 'గుడ్ లక్ గణేశ' కమింగ్ సూన్ అంటూ ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. కాగా.. జనవరి 19న ఆహాలో దీన్ని రిలీజ్ చేశారు.
Ee Ganesh kosam Aa Ganesh Vasthunnadu!
— ahavideoin (@ahavideoIN) January 16, 2024
Good luck, Ganesha Coming ona aha👉#Goodluckganesha Premieres January 19.@iYogiBabu @thilak_Ramesh @RMidhila @bharathsankar12 @anthonydaasan @sonymusic_south pic.twitter.com/YFalr1QnB7
ఆకట్టుకుంటున్న ట్రైలర్..
ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ ఆకట్టుకుంటోంది. గణేశ్ పాత్రలో ఉన్న రమేశ్ తిలక్‌కి ఎక్కడ చూసినా వినాయకుడు కనిపించకపోవడం, ఆ తర్వాత వినాయకుడు యోగిబాబు రూపంలో రావడం ఈ సన్నివేశాలు అన్నీ చాలా ఆసక్తి కలిగించేలా ఉన్నాయి. తానే దేవుడని చెప్పినా గణేశ్ నమ్మకపోవడం లాంటి విషయాలు ఆసక్తి రేపుతున్నాయి.
ఇక ఈ సినిమాలో రమేశ్ తిలక్, యోగిబాబు, ఊర్వశి, కరుణాకరన్, ఉదయ్ చంద్ర ప్రధాన పాత్రలు పోషించారు. రజీశ్ మిథిలా సినిమాకి దర్శకత్వం వహించారు. భరత్ శంకర్ సంగీతం అందించగా, ఈ సినిమాను గ్రేట్ ఇండియన్ సినిమాస్ బ్యానర్ పై రజీష్ మిథిలా, లిజో జోన్స్ నిర్మించారు. ఇక తమిళ్‌లో భారీ హిట్ పొందిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు. మండేలా మూవీలో లీడ్ రోల్ చేసి తనలో ఎంతస్థాయి నటుడు ఉన్నాడో చూపించిన యోగిబాబు మరోసారి తెలుగు ప్రేక్షకులకు ఆ మ్యాజిక్ చూపించబోతున్నారు.
Read Also: రజనీకాంత్ స్టైల్‌లో కరణ్‌జోహార్ యాక్టింగ్ - షాకైన కియారా, తమన్నా ఏమందో తెలుసా?