అన్వేషించండి

ETV Win New Web Series: 'ఈటీవీ విన్' కొత్త వెబ్ సిరీస్... ఓటీటీలోకి ఐఐటీ చదువుల్ని తెస్తున్న సందీప్ రాజ్

AIR Web Series: 'ఈటీవీ విన్' ఓటీటీ కొత్త వెబ్ సిరీస్ అనౌన్స్ చేసింది. ఐఐటీ చదువుల నేపథ్యంలో యువ దర్శకుడు సందీప్ రాజ్ అందించిన కథతో ఈ సిరీస్ తెరకెక్కుతోంది. ఇందులో నటీనటులు, దీనికి దర్శకుడు ఎవరంటే?

ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్ (ETV Win App) ఓటీటీలో అత్యంత వీక్షక ఆదరణ పొందిన సిరీస్ ఏది? అని అడిగితే... తెలుగు ప్రజలు అందరూ చెప్పే సమాధానం ఒక్కటే, 'నైంటీస్' (90s web series) అని! తెలుగు నేటివిటీతో కూడిన సిరీస్ అది. అందులో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఫైనాన్షియల్ ప్లానింగ్, ముఖ్యంగా కుటుంబ అనుబంధాలు, 90వ దశకంలో చదువుల్ని చక్కగా ఆవిష్కరించారు. ఈసారి ఐఐటీ చదువుల నేపథ్యంలో 'ఈటీవీ విన్' కొత్త సిరీస్ అనౌన్స్ చేసింది.

ఎయిర్... ఆల్ ఇండియా ర్యాంకర్స్!
AIR Web Series First Look: ఈటీవీ విన్ కోసం రూపొందుతున్న ఎక్స్‌క్లూజివ్ వెబ్ సిరీస్ 'ఎయిర్' (AIR). అంటే... ఆల్ ఇండియా ర్యాంకర్స్ అని! ఇందులో ముగ్గురు చిన్నారులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారని తెలిసింది. ఇవాళ ఆ ముగ్గురి ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

'చుక్కలు ఉన్న చదువు... చుక్కలు చూపించిన చదువు... ఐఐటీ ప్రపంచానికి స్వాగతం' అంటూ కొత్త వెబ్ సిరీస్ 'ఎయిర్' అనౌన్స్‌మెంట్ పోస్టర్ రిలీజ్ చేసింది ఈటీవీ విన్. ఐఐటీ ర్యాంకుల కోసం పిల్లల మీద కాలేజీలు పెడుతున్న ఒత్తిడిని చూపిస్తారో? లేదంటే ఆ చదువుల నేపథ్యంలో వినోదాత్మక సిరీస్‌ తీస్తున్నారో? వెయిట్‌ అండ్‌ సీ.

సందీప్ రాజ్ సమర్పణలో 'ఎయిర్' వెబ్ సిరీస్!
యువ దర్శకుడు సందీప్ రాజ్ (Sandeep Raj) సమర్పణలో 'ఎయిర్' వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. ఆయనే షో రన్నర్ కూడా! దీనికి జోసెఫ్ క్లింటన్ చెవ్వేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హార్ష్ రోషన్, భాను ప్రకాష్, జయతీర్థ, సింధు రెడ్డి ప్రధాన తారాగణం.

Also Read: కాబోయే భర్త, పెళ్లి కోసం సోనాక్షి సిన్హా ముస్లిం మతంలోకి మారుతుందా? క్లారిటీ ఇచ్చిన పెళ్లి కొడుకు తండ్రి

'ఎయిర్ - ఆల్ ఇండియా ర్యాంకర్స్' ఫస్ట్ లుక్ చూస్తే... ఐఐటీ ఎంట్రన్స్ కోసం పిల్లలు పరీక్షలు రాస్తారు కదా! అందులో సమాధానాలు అన్నీ ఓఎంఆర్ షీట్ మీద మార్క్ చేయాలి. ఆ షీట్ చింపుకొని బయటకు చూస్తున్న ముగ్గురు స్టూడెంట్స్ ఉన్నారు. లుక్ అయితే బావుంది. మరి, సిరీస్ ఎలా ఉంటుందో చూడాలి. 


'ఎయిర్'ను పాకెట్ మనీ పిక్చర్స్ పతాకంపై మీద ప్రదీప్ అంగిరేకుల ప్రొడ్యూస్ చేస్తున్నారు. సందీప్ రాజ్ కథ అందించిన 'ముఖ చిత్రం' సినిమాకూ ఆయనే ప్రొడ్యూసర్. వాళ్లిద్దరి కలయికలో ఇది రెండో ప్రాజెక్ట్. ఇంకా 'ఎయిర్'లో హర్ష చెముడు, చాందిని రావు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. దర్శకుడిగా సందీప్ రాజ్ తొలి సినిమా 'కలర్ ఫోటో' సైతం ఓటీటీలో విడుదలైంది. ఆహాలో ఆ చిత్రానికి మంచి స్పందన లభించింది. ఓటీటీ వీక్షకుల్లో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది.

Also Readమహేష్ బాబు - రాజమౌళి సినిమా.. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ రివీల్ చేసిన కీరవాణి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PBKS vs RCB: విరాట్ కోహ్లీ ఆన్ ఫైర్, చివరివరకూ ఉండి పంజాబ్‌పై రివేంజ్ విక్టరీ అందించిన ఛేజ్ మాస్టర్
విరాట్ కోహ్లీ ఆన్ ఫైర్, చివరివరకూ ఉండి పంజాబ్‌పై రివేంజ్ విక్టరీ అందించిన ఛేజ్ మాస్టర్
CM Chandrababu: సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా అన్న ప్రసాద పథకానికి రూ.44 లక్షలు విరాళం
సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా అన్న ప్రసాద పథకానికి రూ.44 లక్షలు విరాళం
AP DSC Notification 2025: ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ప్రారంభం- పూర్తి వివరాలివే
ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ప్రారంభం- పూర్తి వివరాలివే
Simran: డబ్బా రోల్స్ చేయడం కంటే ఆంటీగా నటించడం బెటర్ - జ్యోతికను టార్గెట్ చేసిన సిమ్రాన్?
డబ్బా రోల్స్ చేయడం కంటే ఆంటీగా నటించడం బెటర్ - జ్యోతికను టార్గెట్ చేసిన సిమ్రాన్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MI vs CSK Match Preview IPL 2025 | నేడు వాంఖడేలో ముంబైని ఢీకొడుతున్న చెన్నై | ABP DesamPBKS vs RCB Match preview IPL 2025 | బెంగుళూరులో ఓటమికి పంజాబ్ లో ప్రతీకారం తీర్చుకుంటుందా | ABP DesamAvesh Khan Game Changer vs RR | IPL 2025 లో లక్నోకు గేమ్ ఛేంజర్ గా మారిన ఆవేశ్ ఖాన్ | ABP DesamYashasvi Jaiswal Vaibhav Suryavanshi | భలే క్యూట్ గా ఆడిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు | ABP Desm

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PBKS vs RCB: విరాట్ కోహ్లీ ఆన్ ఫైర్, చివరివరకూ ఉండి పంజాబ్‌పై రివేంజ్ విక్టరీ అందించిన ఛేజ్ మాస్టర్
విరాట్ కోహ్లీ ఆన్ ఫైర్, చివరివరకూ ఉండి పంజాబ్‌పై రివేంజ్ విక్టరీ అందించిన ఛేజ్ మాస్టర్
CM Chandrababu: సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా అన్న ప్రసాద పథకానికి రూ.44 లక్షలు విరాళం
సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా అన్న ప్రసాద పథకానికి రూ.44 లక్షలు విరాళం
AP DSC Notification 2025: ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ప్రారంభం- పూర్తి వివరాలివే
ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ప్రారంభం- పూర్తి వివరాలివే
Simran: డబ్బా రోల్స్ చేయడం కంటే ఆంటీగా నటించడం బెటర్ - జ్యోతికను టార్గెట్ చేసిన సిమ్రాన్?
డబ్బా రోల్స్ చేయడం కంటే ఆంటీగా నటించడం బెటర్ - జ్యోతికను టార్గెట్ చేసిన సిమ్రాన్?
MI vs CSK: ముంబైతో మ్యాచ్.. సీఎస్కేదే ఫస్ట్ బ్యాటింగ్, రేసులో నిలవాలంటే నెగ్గాల్సిందే
ముంబైతో మ్యాచ్.. సీఎస్కేదే ఫస్ట్ బ్యాటింగ్, రేసులో నిలవాలంటే నెగ్గాల్సిందే
Kakinada DCCB Chairman: కాకినాడ డీసీసీబీ ఛైర్మ‌న్ గిరి కోసం ఎందుకంత పోటీ..? రేసులో టిడిపి, జనసేన నేతలు
కాకినాడ డీసీసీబీ ఛైర్మ‌న్ గిరి కోసం ఎందుకంత పోటీ..? రేసులో టిడిపి, జనసేన నేతలు
Malavika Mohanan: లోకల్ ట్రైన్‌లో ముద్దు అడిగాడు - మాళవికా మోహనన్‌కు చేదు అనుభవం
లోకల్ ట్రైన్‌లో ముద్దు అడిగాడు - మాళవికా మోహనన్‌కు చేదు అనుభవం
Ponnam Prabhakar: నిరుద్యోగులకు గుడ్​ న్యూస్​.. ఆర్టీసీలో 3,038 ఉద్యోగాల భర్తీ: మంత్రి పొన్నం
నిరుద్యోగులకు గుడ్​ న్యూస్​.. ఆర్టీసీలో 3,038 ఉద్యోగాల భర్తీ: మంత్రి పొన్నం
Embed widget