By: ABP Desam | Updated at : 11 Apr 2022 07:26 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
మాగెల్లాన్ టీవీ లోగో (Image Credits: MagellanTV)
మీరు క్రైమ్ డ్రామాలు ఎక్కువగా చూస్తుంటారా? అయితే మీరు వాటిని చూస్తూ కూడా డబ్బులు సంపాదించవచ్చు. అవును... మీరు విన్నది నిజమే! 24 గంటల పాటు తమ క్రైమ్ షోలు చూసిన వారికి మాగెల్లాన్ టీవీ (MagellanTV) అనే స్ట్రీమింగ్ సర్వీస్ రూ.1.8 లక్షలు చెల్లించనుంది.
మాగెల్లాన్ టీవీ అనేది ఒక డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ సర్వీసు. ఇందులో అన్ని డాక్యుమెంటరీలే ఉంటాయి. ఇందులో ఉన్న నిజమైన క్రైమ్ డాక్యుమెంటరీలను చూసిన వారికి కంపెనీ ఈ రూ.1.8 లక్షలను అందించనుంది. ఈ నగదు పొందడానికి ఆ డాక్యుమెంటరీలను చూడటంతో పాటు... దానికి సంబంధించిన ఎక్స్‌పీరియన్స్‌ను కూడా షేర్ చేయాల్సి ఉంటుంది.
మాగెల్లాన్ టీవీ ఈ తరహా జాబ్‌ను అందించడం ఇది మూడో సారి. గతంలో కూడా ఇలా నాన్‌స్టాప్‌గా వెబ్ సిరీస్‌లు చూసినందుకు గంటకు రూ.7,500 అందించింది. కంపెనీ వెబ్ సైట్ తెలుపుతున్న దాని ప్రకారం... నిజమైన క్రైమ్ డ్రామా ఫ్యాన్స్ కోసం మాగెల్లాన్ టీవీ వెతుకుతోంది.
ఎంతో దారుణమైన సీరియల్ కిల్లింగ్ డ్రామాలు, రక్తపాతం ఎక్కువగా ఉన్న కంటెంట్ చూసి కూడా తట్టుకునే వారి కోసం కంపెనీ వెతుకుతోంది. మీరు నిజంగా ఇటువంటి డ్రామాలను ఎంజాయ్ చేసే వారు అయితే మీకు రూ.1.8 లక్షలతో పాటు ఒక సంవత్సరం పాటు మాగెల్లాన్ టీవీ సబ్‌స్క్రిప్షన్ కూడా లభించనుంది. వీరితో పాటు మరో 100 మందికి ఉచితంగా సంవత్సరం పాటు మాగెల్లాన్ టీవీ సబ్‌స్క్రిప్షన్ అందించనున్నారు.
మాగెల్లాన్ టీవీ తన వెబ్‌సైట్లో మొత్తం 32 క్రైమ్ డాక్యుమెంటరీలను తన వెబ్ సైట్లో లిస్ట్ చేసింది. వీటి నిడివి 25 నిమిషాల నుంచి ఒక గంట వరకు ఉంది. వీటన్నిటినీ పూర్తి చేస్తే రూ.1.8 లక్షలు మీకు సొంతం అయ్యే అవకాశం ఉంది.
Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ట్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?
Also Read: కొత్త ఐప్యాడ్ వచ్చేసింది - అన్నీ లేటెస్ట్ ఫీచర్లే - ధర ఎంతంటే?
ఓటీటీలోకి ‘కణ్మని రాంబో ఖతీజా’, వెరైటీగా ప్రకటించిన విఘ్నేష్!
She-Hulk Trailer: హల్క్ చెల్లి ‘షి-హల్క్’ వచ్చేస్తోంది, తెలుగు ట్రైలర్ చూశారా?
Prey Teaser: ‘ప్రే’ టీజర్ చూశారా? మరింత భయానకంగా ప్రిడేటర్ ప్రీక్వెల్
Bigg Boss OTT Winner: బిగ్ ఓటీటీ ఫినాలే - గెలిచేదెవరు?
Son Of India in OTT: ఓటీటీలో ‘సన్ ఆఫ్ ఇండియా’, స్ట్రీమింగ్ మొదలైంది!
Anantapur TDP : అనంత టీడీపీకి అసలైన సమస్య సొంత నేతలే ! చంద్రబాబు చక్కదిద్దగలరా ?
YSRCP Politics : సీఎం జగన్ పది రోజుల విదేశీ టూర్ - వైఎస్ఆర్సీపీ నేతలకు ఫుల్ హోం వర్క్ !
Gyanvapi Mosque Survey Report: జ్ఞానవాపి మసీదులో ఆలయ అవశేషాల గుర్తింపు- వారణాసి కోర్టు విచారణకు సుప్రీం బ్రేకులు!
RRR Visual Effects: ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో పులి, పాముకు ఇలా ప్రాణం పోశారు, ఇదిగో VFX వీడియో!