Divya Drishti OTT : నేరుగా ఓటీటీలోకే సునీల్ హారర్ థ్రిల్లర్ 'దివ్య దృష్టి' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Divya Drishti OTT Platform : సునీల్, ఈషా చావ్లా జంటగా నటించిన హారర్ థ్రిల్లర్ మూవీ 'దివ్య దృష్టి' నేరుగా ఓటీటీలోకే రానుంది. ఈ మూవీ హారర్ థ్రిల్లర్ అంశాలతో ముడిపడినట్లు తెలుస్తోంది.

Sunil's Divya Drishti OTT Release Date Locked : టాలీవుడ్ హీరో సునీల్, ఇషా చావ్లా ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ హారర్ థ్రిల్లర్ 'దివ్య దృష్టి'. ఈ మూవీ థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకే రానుంది. ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా సస్పెన్స్, హారర్ థ్రిల్లర్ అంశాలతో మూవీ ఉండనున్నట్లు తెలుస్తోంది.
స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఈ మూవీని ఈ నెల 19 నుంచి 'దివ్య దృష్టి' మూవీ ఎక్స్‌క్లూజివ్‌గా ప్రముఖ ఓటీటీ 'సన్ నెక్స్ట్'లో స్ట్రీమింగ్ కానుంది. కబీర్ లాల్ దర్శకత్వం వహించగా... సునీల్, ఇషా చావ్లా, కమల్ కామరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 'మీరు భయాన్నే చూసే ముందే ఎక్స్‌పీరియన్స్ అవండి.' అంటూ రాసుకొచ్చారు.
గతంలో సునీల్, ఈషా చావ్లా కలిసి పూలరంగడు, మిస్టర్ పెళ్లి కొడుకు మూవీస్ చేశారు. పూలరంగడు మంచి విజయం అందుకోగా రెండో మూవీ మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇది మూడో మూవీ కాగా ఎక్స్‌క్లూజివ్‌గా డిజిటల్‌లోనే స్ట్రీమింగ్ కానుంది. గతంలో మూవీస్ కంటే డిఫరెంట్‌గా హారర్ థ్రిల్లింగ్ జానర్‌లో ఈ మూవీపై హైప్ క్రియేట్ అవుతోంది.
View this post on Instagram
Also Read : 'ద్రౌపది' సాంగ్ వివాదం - సింగర్ చిన్మయి సారీ... ట్వీట్ డిలీట్ చేయాలన్న డైరెక్టర్





















