అన్వేషించండి

Love Me OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ‘లవ్ మీ’ - స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Love Me OTT Streaming: దిల్ రాజు ప్రొడక్షన్స్‌లో తెరకెక్కించిన ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ ‘లవ్ మీ’. ఈ సినిమా థియేటర్లలో విడుదలయిన మూడు వారాల తర్వాత సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది.

Love Me OTT Streaming: ఒకప్పుడు సినిమా థియేటర్లలో విడుదలయిన తర్వాత అది హిట్ అయినా, ఫ్లాప్ అయినా కనీసం నెలరోజుల పాటు ఓటీటీలో విడుదల చేయకూడదని నిర్మాతలు నిర్ణయించుకున్నారు. కొన్నిరోజుల పాటు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ కూడా ఇదే రూల్‌ను ఫాలో అయ్యాయి. కానీ ఇప్పుడు కథ మళ్లీ మొదటికి వచ్చింది. థియేటర్లలో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు విడుదల అవుతూ పాత సినిమాలకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోవడంతో ఓటీటీలో వెంటనే విడుదల చేసేయడమే బెటర్ అనుకుంటున్నారు నిర్మాతలు. అలాగే ‘లవ్ మీ’ మూవీ కూడా సైలెంట్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభించుకుంది.

మూడు వారాల్లోనే..

ఒక దెయ్యానికి, మనిషికి మధ్య ప్రేమకథ అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘లవ్ మీ ఇఫ్ యూ డేర్’ మూవీ. కాన్సెప్ట్ డిఫరెంట్‌గా ఉంది అనే నమ్మకంతో సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేశారు. దానికోసం ఓ రేంజ్‌లో ప్రమోషన్స్ కూడా చేశారు. మే 25న ఈ మూవీ థియేటర్లలో విడుదలయ్యింది. మొదటి రోజు నుండే ‘లవ్ మీ’ సినిమా ప్రేక్షకుల దగ్గర నుండి మిక్స్‌డ్ టాక్ అందుకుంది. ఆ తర్వాత వారమే మరిన్ని చిత్రాలు థియేటర్లలో సందడి చేశాయి. దీంతో ‘లవ్ మీ’కి వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోయింది. దీంతో థియేటర్లలో విడుదలయిన మూడు వారాలలోనే ఓటీటీలోకి వచ్చేసింది.

సీక్వెల్ ఫిక్స్..

ప్రస్తుతం ‘లవ్ మీ ఇఫ్ యూ డేర్’ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది. సైలెంట్‌గా స్ట్రీమింగ్ ప్రారంభించుకున్న ఈ సినిమా.. తెలుగు భాషలో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో సబ్‌స్క్రైబర్లకు అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో యావరేజ్ టాక్‌ను సంపాదించుకున్న ‘లవ్ మీ’.. ఓటీటీలో అయినా ప్రేక్షకులకు నచ్చుతుందేమో అని నెటిజన్లు భావిస్తున్నారు. ఈ సినిమాకు ప్రేక్షకుల దగ్గర నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందనే నమ్మకంతో ముందే దీనికి సీక్వెల్ కూడా ప్లాన్ చేసుకున్నారు మేకర్స్. ‘లవ్ మీ’ క్లైమాక్స్‌లో సీక్వెల్‌కు సంబంధించిన టైటిల్ కూడా ప్రకటించారు. అదే ‘కిల్ మీ ఇఫ్ యూ లవ్’.

గెస్ట్ రోల్‌లో సంయుక్త..

‘లవ్ మీ ఇఫ్ యూ డేర్’ విషయానికొస్తే.. ఇందులో ఆశిష్ రెడ్డి హీరోగా నటించాడు. తనకు జోడీగా తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా కనిపించింది. ఇప్పటికే ‘బేబి’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న వైష్ణవి చైతన్య ఛార్మ్ కూడా ‘లవ్ మీ’ కోసం ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురాలేకపోయింది. ఇక ఇందులో రవికిషన్, సిమ్రాన్ చౌదరీ కూడా ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి, నాగ మల్లిడి కలిసి ఈ సినిమాను నిర్మించారు. కీరవాణి.. ‘లవ్ మీ’కి సంగీతాన్ని అందించారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ravi krishna (@ravikrishna_official)

Also Read: రష్ రివ్యూ: ETV Winలో యాక్షన్ థ్రిల్లర్ - రవిబాబు సినిమా బావుందా? లేదా?

టాప్ హెడ్ లైన్స్

The Court OTT : ఓటీటీలోకి సరికొత్త కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - తండ్రీ కూతుళ్ల మధ్య వార్... ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సరికొత్త కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - తండ్రీ కూతుళ్ల మధ్య వార్... ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
Friday OTT Movies : ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
Memu Copulam Series OTT : మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget