Family Dhamaka: ‘ఫ్యామిలీ ధమాకా’ నుండి ‘ధమాకా’ పాట - గెస్ట్ చెప్పిన కవితతో విశ్వక్ ఫుల్ ఇంప్రెస్!
హోస్టింగ్‌లోకి అడుగుపెడుతున్న విషయం పెద్ద సర్‌ప్రైజ్‌గా అనౌన్స్ చేశాడు విశ్వక్ సేన్. తన సోషల్ మీడియా పోస్ట్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు.
ఒకప్పుడు స్టార్ హీరోలు బుల్లితెరపై కనిపించడం అనేది చాలా పెద్ద విషయం. వారు ఏదో ఒక షోకు గెస్ట్‌గా వస్తేనే.. హైప్ వేరే లెవెల్‌లో ఉండేది. అలాంటిదే వారు హోస్ట్ అయితే.. ఎంటర్‌టైన్మెంట్ ఏ రేంజ్‌లో ఉంటుందో.. ఈమధ్య స్టార్ హీరోలు చూపిస్తున్నారు. ముందుగా చిరంజీవి, నాగార్జున లాంటి వారు సైతం హోస్టింగ్‌లోకి అడుగుపెట్టి.. ఇతర హీరోలకు కూడా ఆ అవకాశాన్ని అందించారు. వారి బాటలో మరికొందరు యంగ్ హీరోలు హోస్టింగ్‌లోకి అడుగుపెట్టారు. వెండితెరపై కనిపించి అలరించిన స్టార్ హీరోలు బుల్లితెరపైకి.. అది కూడా తమకు మరింత దగ్గరగా రావడంతో ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుష్ అయిపోయారు. ఇప్పుడు ఈ హోస్టింగ్ లిస్ట్‌లోకి మరో యంగ్ హీరో వచ్చి చేరాడు. అతడే విశ్వక్ సేన్. తాజాగా ఈ హీరో హోస్ట్ చేస్తున్న ‘ఫ్యామిలీ ధమాకా’ షోకు సంబంధించి ధమాకా పాట బయటికొచ్చింది.
పెళ్లి అనుకున్నారు.. కానీ..
హోస్టింగ్‌లోకి అడుగుపెడుతున్న విషయం పెద్ద సర్‌ప్రైజ్‌గా అనౌన్స్ చేశాడు విశ్వక్ సేన్. తన సోషల్ మీడియా పోస్ట్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. ‘జీవితంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాను. ఫ్యామిలీని స్టార్ట్ చేయబోతున్నాను’ అంటూ విశ్వక్ పోస్ట్ చేశాడు. ఇది కొన్ని గంటల్లోనే వైరల్ అయ్యింది. ఈ పోస్ట్‌కు అర్థం విశ్వక్ పెళ్లి చేసుకోబోతున్నట్టు అని చాలామంది అనుకున్నారు. అసలు ఆ అమ్మాయి ఎవరు అని గెస్ చేయడం కూడా మొదలుపెట్టారు. కానీ కొందరు మాత్రం ఇదంతా ప్రమోషనల్ స్టంట్ అని కొట్టిపారేశారు. అందులో చాలా తక్కువమంది మాత్రమే విశ్వక్.. హోస్టింగ్‌లోకి అడుగుపెడుతున్నాడని కరెక్ట్‌గా అంచనా వేశారు. అనుకున్నట్టుగానే రెండు రోజుల్లో తను హోస్ట్ చేయబోతున్న ‘ఫ్యామిలీ ధమాకా’ షో గురించి రివీల్ చేశాడు.
లూప్‌లో వినే పాట..
ఆహాలో బాలయ్య ‘అన్‌స్టాపబుల్’ అనే షోను హోస్ట్ చేస్తున్న సమయంలో విశ్వక్ సేన్ రెండుసార్లు గెస్ట్‌గా వచ్చాడు. ఆ సమయంలోనే బాలయ్యతో కలిసి విశ్వక్ చేసిన అల్లరి అందరినీ ఆకట్టుకుంది. దీంతో ఆహా.. తనకు కూడా హోస్ట్‌గా ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఓవైపు యాక్టింగ్, మరోవైపు హోస్టింగ్ మ్యానేజ్ చేయడం మన హీరోలకు కొత్తేమీ కాకపోవడంతో విశ్వక్.. ఈ ఆఫర్‌ను ఒప్పుకున్నాడు. ఇప్పటివరకు ‘ఫ్యామిలీ ధమాకా’ నుండి కొన్ని ప్రోమోలు విడుదల కాగా.. తాజాగా ధమాకా సాంగ్ అంటూ ఇంట్రో సాంగ్ ఒకటి విడుదలయ్యింది. ‘లూప్‌లో వినే టాప్ లేపే సాంగ్ వచ్చేసింది. ఫ్యామిలీ ధమాకా.. ఇది దాస్‌కా ఇలాకా’ అంటూ ఈ పాటను ఆహా సోషల్ మీడియాలో విడుదల చేసింది.
విశ్వక్ వేసిన మాస్ స్టెప్పులతో ధమాకా పాట..
‘అశోక వనంలో అర్జున కళ్యాణం చూడడానికి వచ్చి ఈ నగరానికి ఏమైంది అంటూ ప్రశ్నించి హిట్ కొట్టేసిన మిమ్మల్ని.. అందరూ పాగల్ అంటారా నేను ఒప్పుకోను’ అంటూ ‘ఫ్యామిలీ ధమాకా’కు వచ్చిన ఒక గెస్ట్ చెప్పిన డైలాగుతో ఈ ధమాకా పాట మొదలయ్యింది. కచ్చితంగా ఈ షో ద్వారా ఫ్యామిలీస్‌ను ఎంటర్‌టైన్ చేస్తాను అంటూ విశ్వక్ సేన్ మాటిస్తున్నట్టు అనిపిస్తోంది. లియోన్ జేమ్స్.. ఈ ఫ్యామిలీ ధమాకా పాటకు మ్యూజిక్ అందించాడు. దీనికి విశ్వక్ సేన్ వేసిన స్టెప్పులు సూపర్‌గా సూట్ అయ్యాయి. ఇప్పటివరకు సినిమాల్లోనే తన యాటిట్యూడ్‌ను చూపించిన విశ్వక్.. ఇప్పుడు బుల్లితెరపై తన యాటిట్యూడ్‌తో ఫ్యామిలీలను ఎలా అలరిస్తాడో చూడాలి.
Loop lo vine top lepe song vachesindhi..!🎶🥳
— ahavideoin (@ahavideoIN) August 25, 2023
Family Dhamakha Idhi Dass ka ilakha...🤙🤙
Dhamaka Song Out Now 🔥 🥳 💃🏽🕺🏽#FamilyDhamakaOnAHA @VishwakSenActor @leon_james@rsbrothersindia @KhiladiOfficia3 @sprite_india @lalithaajewels @fremantle_india pic.twitter.com/7OBKNXaTdd
Also Read: కావాలంటే వారిని పిలుస్తా, జర్నలిస్టుకు దర్శకుడు ప్రవీణ్ సత్తారు కౌంటర్!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial