అన్వేషించండి

Coolie OTT: 'కూలీ' ఓటీటీలోకి వచ్చేశాడు - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?

Coolie OTT Platform: తలైవా రజినీకాంత్ రీసెంట్ మూవీ 'కూలీ' ఓటీటీలోకి వచ్చేసింది. ఆగస్ట్ 14న వచ్చిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకున్నా... దాదాపు రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

Rajinkanth's Coolie OTT Streaming On Amazon Prime Video: తమిళ సూపర్ స్టార్ రీసెంట్ మాస్ యాక్షన్ థ్రిల్లర్ 'కూలీ' ఓటీటీలోకి వచ్చేసింది. స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా ఆగస్ట్ 14న రిలీజై మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. 

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?

బుధవారం అర్ధరాత్రి నుంచి ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో కూలీ స్ట్రీమింగ్ అవుతోంది. 'ప్రేమ, ప్రమాదం ఒకదానిలో ఒకటిగా మారాయి. కూలీ తుపానును వీక్షించండి.' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ఈ మూవీలో తలైవా రజినీకాంత్ దేవా పాత్రలో అదరగొట్టగా విలన్ సైమన్‌గా కింగ్ నాగార్జున నటించారు. బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ ఓ స్పెషల్ రోల్ చేశారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by prime video IN (@primevideoin)

Also Read: మనవడిని చూసి మురిసిపోయిన మెగాస్టార్... వరుణ్ తేజ్ కొడుకుతో చిరు ఫోటో!

మరో ఓటీటీలోకి హిందీ వెర్షన్

అయితే, హిందీ వెర్షన్‌ ఓటీటీ రిలీజ్‌పై మేకర్స్ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. త్వరలోనే మరో ఓటీటీలోకి హిందీ వెర్షన్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో తలైవా, నాగార్జునతో పాటు ఉపేంద్ర, రచితా రామ్, శ్రుతిహాసన్, సౌబిన్ షాహిర్, సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు. బుట్ట బొమ్మ పూజా హెగ్డే స్పెషల్ సాంగ్‌లో కనిపించగా... అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించారు.

స్టోరీ ఏంటంటే?

కింగ్ పిన్ లాజిస్టిక్ ఓనర్ సైమన్ (నాగార్జున) ప్రభుత్వం నుంచి విశాఖ పోర్టును లీజుకు తీసుకుని దాని కేంద్రంగా ఇల్లీగల్ బిజినెస్ చేస్తుంటాడు. అతని అక్రమ వ్యాపారానికి దయాల్ (సౌబిన్ షాహిర్) సపోర్ట్ చేస్తూ ఆ పోర్టును తన అండర్‌లోనే ఉంచుకుంటాడు. ఈ అక్రమాలను బయట పెట్టాలని చూసిన వారిని అక్కడికక్కడే చంపేస్తుంటాడు. అయితే, అన్ని శవాలను మాయం చేయడం ఈ ముఠాకు ఓ సవాల్‌గా మారుతుంది. ఇదే టైంలో రాజశేఖర్ (సత్యరాజ్) కనిపెట్టిన ఓ మొబైల్ క్రిమేటర్ గురించి తెలుసుకున్న సైమన్ తనతో పని చేయాలంటూ రాజశేఖర్‌ను బలవంత పెడతాడు.

గత్యంతరం లేని స్థితిలో రాజశేఖర్ తన కూతురు ప్రీతి (శ్రుతిహాసన్) తో కలిసి సైమన్ వద్ద పనిచేస్తాడు. ఇంతలో అనుకోకుండా ఓ రోజు రాజశేఖర్ చనిపోతాడు.ఈ విషయం తెలుసుకున్న అతని ప్రాణ మిత్రుడు దేవా (రజినీకాంత్) రాజశేఖర్‌ది హత్య అని గుర్తించి హంతకులను వేటాడే పనిలో పడతాడు. ఇదే క్రమంలో పోర్టులో జరిగే బిజినెస్ నార్మల్ స్మగ్లింగ్ కాదని... వేరేది ఉందని తెలుసుకుంటాడు. అసలు దేవాకు తెలిసిన నిజం ఏంటి? తన స్నేహితులను చంపిన వారిని దేవా ఏం చేశాడు? పోర్టులో జరిగే అక్రమాలతో పాటు జరిగే అతి పెద్ద ఇల్లీగల్ బిజినెస్ ఏంటి? సైమన్‌కు దాహా (ఆమిర్ ఖాన్)కు సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Jana Nayakudu OTT: జన నాయకుడు ఓటీటీ రిలీజ్ డేట్... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన జీ5 ఓటీటీ
జన నాయకుడు ఓటీటీ రిలీజ్ డేట్... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన జీ5 ఓటీటీ
Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
This Week OTT Movies : ఈ వారం ఓటీటీల్లో ట్రెండింగ్ మూవీస్ - ఒకే రోజు 5 సినిమాలు... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీల్లో ట్రెండింగ్ మూవీస్ - ఒకే రోజు 5 సినిమాలు... ఇవి డోంట్ మిస్

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Embed widget