Chiranjeeva Trailer: ఎవరెప్పుడు చస్తారో ముందే తెలిస్తే... రౌడీతో ఢీకొట్టిన అంబులెన్స్ డ్రైవర్... రాజ్ తరుణ్ 'చిరంజీవ' ట్రైలర్ చూశారా?
Chiranjeeva OTT Release Date: రాజ్ తరుణ్ హీరోగా అభినయ కృష్ణ (జబర్దస్త్ అభి) దర్శకత్వం వహించిన ఆహా ఒరిజినల్ ఫిల్మ్ 'చిరంజీవ'. నవంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది. లేటెస్టుగా ట్రైలర్ విడుదల చేశారు.

యువ కథానాయకుడు రాజ్ తరుణ్ (Raj Tarun) నటించిన ఆహా ఒరిజినల్ ఫిల్మ్ 'చిరంజీవ' (Chiranjeeva Movie). ఇందులో కుషిత కల్లపు హీరోయిన్. అభినయ కృష్ణ (జబర్దస్త్ అభి) దర్శకత్వం వహించారు. స్ట్రీమ్ లైన్ ప్రొడక్షన్స్ పతాకంపై రాహుల్ అవుదొడ్డి, సుహాసినీ రాహుల్ ప్రొడ్యూస్ చేశారు. నవంబర్ 7 నుంచి 'ఆహా ఓటీటీ'లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. అది ఎలా ఉందంటే?
అంబులెన్స్ డ్రైవర్‌గా రాజ్ తరుణ్!
Raj Tarun role in Chiranjeeva movie revealed: 'చిరంజీవ' సినిమాలో అంబులెన్స్ డ్రైవర్ శివ పాత్రలో నటించారు రాజ్ తరుణ్. అతను పుట్టినప్పుడు 'ఈ పిల్లాడు మహార్జాతకుడు అవుతాడు' అని పురోహితులు చెబుతారు. చిన్నప్పటి నుంచి హుషారుగా, జోరుగా తిరిగే అతడు అంబులెన్స్ డ్రైవర్ అయ్యాక... ఒక రోడ్డు ప్రమాదానికి గురి అవుతాడు. ఆ తర్వాత అతనికి తెలియకుండానే కొన్ని పవర్స్ వస్తాయి. ఎవరెవరు ఎంత కాలం జీవిస్తారు? అనేది శివకు తెలుస్తుంది. ఆ శక్తులతో శివ ఏం చేశాడు? అనేది సినిమా.
Also Read: ఎవరీ నిరంజన్ రెడ్డి? 'మనీ' అసిస్టెంట్ to 'ఆచార్య' నిర్మాత, రాజ్యసభ ఎంపీ వరకు... ఊహకు అందని ఎదుగుదల
View this post on Instagram
సాధారణ అంబులెన్స్ డ్రైవర్ అయిన శివ... తనకు సూపర్ పవర్ వచ్చాక ఏం చేశాడు? రౌడీ సత్తు పైల్వాన్, అతనికి మధ్య ఏం జరిగింది? సత్తు పైల్వాన్‌తో పోరాటంలో శివ గెలిచాడా? లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ కథలో హీరో హీరోయిన్స్ మధ్య ప్రేమ కథ ఆసక్తికరంగా ఉంటుందని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: అచ్చు రాజమణి, ఛాయాగ్రహణం: రాకేష్ ఎస్ నారాయణ్, కూర్పు: సాయి మురళి, కథనం: ఎంఆర్, నిర్మాతలు: రాహుల్ అవుదొడ్డి - సుహాసినీ రాహుల్, దర్శకత్వం: అభినయ కృష్ణ.
Also Read: 'కాంతార'లో ఆ రోల్ మేకప్‌కు 6 గంటలు... మాయావి కాదు... రిషబ్ శెట్టే - మరో నేషనల్ అవార్డు గ్యారెంటీ!





















