'భలే ఉన్నాడే'తో రాజ్ తరుణ్‌కు విజయం వస్తుందా? ఈ సినిమాలో ప్లస్, మైనస్ పాయింట్స్ ఏంటి?

కథ: రాధ (రాజ్ తరుణ్) శారీ డ్రెపర్. అమ్మాయిలను టచ్ చేయకుండా శారీ కట్టడం అతని స్టైల్.

రాధ, కృష్ణ (మనీష) ప్రేమలో పడతారు. పెళ్లికి రెడీ అయినప్పుడు రాధ మగాడా? కాదా? అని సందేహం కలుగుతుంది.

రాధను తీసుకుని కృష్ణ ఓ ఆశ్రమానికి వెళుతుంది. అక్కడ ఏమైంది? రాధాకృష్ణుల మధ్య దూరం ఎందుకు పెరిగింది?

రాధ తల్లి గౌరీ (అభిరామి) గతం ఏమిటి? అమ్మాయిలకు రాధ దూరంగా ఉండటం వెనుక కారణం ఏంటి? అనేది మిగతా సినిమా. 

విశ్లేషణ: క్లాస్ పాయింట్‌తో తీసిన మాస్ కామెడీ సినిమా 'భలే ఉన్నాడే'. ఫన్ ఓకే కానీ ఎమోషన్స్ సరిగా డీల్ చేయలేదు.

ఇంటర్వెల్ వరకు సాఫీగా సాగినా... తర్వాత రోలర్ కోస్టర్ అయ్యింది. సెకండాఫ్‌లో ల్యాగ్, మాస్ కామెడీ చిరాకు పెట్టిస్తాయి.

రచ్చ రవి, సుదర్శన్ ట్రాక్స్ నవ్వించలేదు. కానీ, వీటీవీ గణేష్ - 'హైపర్' ఆది కాస్త నవ్వించారు.

రాజ్ తరుణ్ తన ఎనర్జీ పక్కనపెట్టి కామ్ యాక్టింగ్ చేశాడు. కానీ, హీరోయిన్ ఆ పాత్రకు సూట్ కాలేదు. దాంతో సీన్స్ సరిగా రాలేదు.

హీరో ఎందుకు అలా బిహేవ్ చేస్తాడో చెప్పడానికి రీజన్ ఉంది కానీ సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఎమోషన్స్ వర్కవుట్ కాలేదు.

కొత్త రాజ్ తరుణ్ కోసం అయితే సినిమాకు వెళ్ళండి. ఎక్స్‌పెక్టేషన్స్‌ ఏం పెట్టుకోవద్దు. ఒకవేళ పెట్టుకుంటే డిజప్పాయింట్ అవుతారు.