రాజమౌళి ఫ్యామిలీ హీరో శ్రీ సింహ (కీరవాణి తనయుడు) హీరోగా తెరకెక్కిన 'మత్తు వదలరా 2'లో ప్లస్, మైనస్‌లు ఏంటనేది చూడండి.

కథ: బాబు (శ్రీ సింహ), ఏసు (సత్య) హీ టీమ్‌లో స్పెషల్ ఏజెంట్స్. డబ్బు కోసం కాస్త తెలివితేటలు ప్రదర్శించడం మొదలు పెట్టారు.

కిడ్నాప్ కేసులో 2 కోట్లు వెనుకేయాలని అనుకుంటే మర్డర్ కేసులో ఇరుక్కుంటారు. అది ఎలా జరిగింది?

బాబు, ఏసును టార్గెట్ చేసింది ఎవరు? సీనియర్ నిధి (ఫరియా అబ్దుల్లా) ఎలాంటి సపోర్ట్ చేసింది?

ప్రకాష్ (అజయ్), హీరో యువ (వెన్నెల కిశోర్) ఏం చేశారు? మర్డర్ కేసు నుంచి బాబు, ఏసు ఎలా బయట పడ్డారనేది సినిమా.

విశ్లేషణ: 'మత్తు వదలరా'తో కంపేర్ చేస్తే కొన్ని సీక్వెల్ థ్రిల్ విషయంలో కొంత వెనుకబడింది. కానీ కామెడీ బావుంది.

సెటైరికల్ రైటింగ్‌లో రితేష్ రానా టాలెంట్ చూపించారు. ఫస్టాఫ్‌లో కామెడీ భలే కుదిరింది. సెకండాఫ్ కామెడీ, థ్రిల్ తగ్గాయి.

సత్య వన్ మ్యాన్ షోతో 'మత్తు వదలరా 2'లో ఫన్ వర్కవుట్ అయ్యింది. శ్రీ సింహ బాగా చేశారు.

కామెడీ కోసం అయితే 'మత్తు వదలరా 2'ను హ్యాపీగా చూడొచ్చు. థ్రిల్ తగ్గినా ఫన్ ఉంది.