అన్వేషించండి

Bhaag Saale OTT Release Date: ఫేమస్ డైమండ్ రింగ్ వెనుక స్టోరీ - రెండేళ్ల తర్వాత మరో ఓటీటీలోకి కీరవాణి కొడుకు క్రైమ్ కామెడీ డ్రామా 'భాగ్ సాలే'

Bhaag Saale OTT Platform: కీరవాణి కుమారుడు శ్రీసింహా నటించిన క్రైమ్ కామెడీ మూవీ 'భాగ్ సాలే' దాదాపు రెండేళ్ల తర్వాత మరో ఓటీటీలోకి వస్తోంది. ఇప్పటికే 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో స్ట్రీమింగ్ అవుతోంది.

Simha Koduri's Bhaag Saale OTT Release Date On Etvwin: ఆస్కార్ విన్నర్ కీరవాణి కుమారుడు శ్రీసింహ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ కామెడీ డ్రామా 'భాగ్ సాలే'. దాదాపు రెండేళ్ల తర్వాత ఈ మూవీ మరో ఓటీటీలోకి స్ట్రీమింగ్ కాబోతోంది. ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వం వహించిన ఈ మూవీ 2023లో రిలీజ్ కాగా... బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది.

ఎందులో స్ట్రీమింగ్ అంటే?

ఓ ఫేమస్ డైమండ్ రింగ్ చుట్టూ సాగే ఈ స్టోరీ ఇప్పటికే ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా మరో ఓటీటీ 'ఈటీవీ విన్'లోనూ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ నెల 28 నుంచి మూవీ అందుబాటులోకి వస్తుందంటూ సోషల్ మీడియా వేదికగా ఈటీవీ విన్ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. 'ముందుగా చూడండి. ముందుగా నవ్వండి' అంటూ పేర్కొంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ETV Win (@etvwin)

Also Read: 'బాహుబలి' మళ్లీ వచ్చేశాడు - రెండు మూవీస్ ఒకే మూవీగా... 'బాహుబలి: ది ఎపిక్' టీజర్ చూశారా?

ఈ మూవీలో శ్రీసింహా సరసన నీహా సోలంకి హీరోయిన్‌గా నటించారు. వీరితో పాటే జాన్ విజయ్, రాజీవ్ కనకాల, నందిని రాయ్, హర్ష చెముడు తదితరులు కీలక పాత్రలు పోషించారు. బిగ్ బెన్ సినిమాస్, సినీవాలీ మూవీస్‌తో కలిసి వేదాన్స్ క్రియేటివ్ వర్క్స్ మూవీని నిర్మించింది. అర్జున్ దాస్యం, యశ్ రంగినేని, సింగనమల కల్యాణ్ నిర్మాతలుగా వ్యవహరించారు.

స్టోరీ ఏంటంటే?

అర్జున్ (శ్రీసింహా) ఓ స్టార్ హోటల్‌లో షెఫ్‌గా పని చేస్తూనే ఓ పెద్ద రెస్టారెంట్‌కు ఓనర్ కావాలని కలలు కంటుంటాడు. తాను రిచ్ పర్సెన్ అని చెప్పి మాయ (నేహ సోలంకి)ని లవ్‌లోకి దింపుతాడు. తన తండ్రి (రాజీవ్ కనకాల)కి ఎంతో ఇష్టమైన సొంతింటిని కూడా అమ్మించి ఆ డబ్బులతో రెస్టారెంట్ పెట్టాలని అనుకుంటాడు. ఇంతలో మాయ ఇంటిపై శామూల్ (జాన్ విజయ్) అనే ఓ పెద్ద డాన్ దాడి చేసి తనకు డైమండ్ రింగ్ ఇవ్వాలంటూ ఆమె తండ్రిని కిడ్నాప్ చేస్తాడు. అసలు ఆ రింగ్ ఏంటి? దాని వెనుక స్టోరీ ఏంటి? మాయ తండ్రిని అర్జున్ కాపాడాడా? తన రెస్టారెంట్ కల నెరవేర్చుకున్నాడా? అర్జున్ స్టేటస్ మాయకు తెలుస్తుందా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

This Week OTT Movies : అక్టోబర్ సెకండ్ వీక్ ఓటీటీ మూవీస్ - శుక్రవారం ఒక్క రోజే 10 సినిమాలు స్ట్రీమింగ్... ఈ నాలుగు సినిమాలు డోంట్ మిస్
అక్టోబర్ సెకండ్ వీక్ ఓటీటీ మూవీస్ - శుక్రవారం ఒక్క రోజే 10 సినిమాలు స్ట్రీమింగ్... ఈ నాలుగు సినిమాలు డోంట్ మిస్
Mandaadi OTT : ఓటీటీలోకి సుహాస్ తమిళ బ్లాక్ బస్టర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సుహాస్ తమిళ బ్లాక్ బస్టర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Jio Hotstar Top Movies : జియో హాట్ స్టార్‌లో టాప్ 10 మూవీస్ - హారర్, క్రైమ్ థ్రిల్లర్స్ ఇప్పుడే చూసెయ్యండి
జియో హాట్ స్టార్‌లో టాప్ 10 మూవీస్ - హారర్, క్రైమ్ థ్రిల్లర్స్ ఇప్పుడే చూసెయ్యండి
Trending OTT Movies : అమెజాన్ ప్రైమ్ వీడియోలో టాప్ ట్రెండింగ్ మూవీస్ - వీకెండ్‌లో ఈ 10 సినిమాలు డోంట్ మిస్
అమెజాన్ ప్రైమ్ వీడియోలో టాప్ ట్రెండింగ్ మూవీస్ - వీకెండ్‌లో ఈ 10 సినిమాలు డోంట్ మిస్

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BC Reservations In AP: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు.. అక్టోబర్ 28 వరకు డెడ్‌లైన్
బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు.. అక్టోబర్ 28 వరకు డెడ్‌లైన్
AP Dasara Holidays: ఏపీలో ఈ 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
ఏపీలో ఈ నెల 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
CM Chandrababu: వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
Medicine Nobel Prize: మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
Supreme Court Notices To Gyanesh Kumar: సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
Kiran Abbavaram Reality : కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' - డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీ... బాలయ్య, నాగ్ మూవీస్‌తో పాటే...
కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' - డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీ... బాలయ్య, నాగ్ మూవీస్‌తో పాటే...
పితృపక్షంలో ఇందిరా ఏకాదశి: పూర్వీకులకు మోక్షం ప్రసాదించే ఇందిరా ఏకాదశి రోజు తప్పనిసరిగా చదువుకోవాల్సిన కథ ఇది!
పితృపక్షంలో ఇందిరా ఏకాదశి: పూర్వీకులకు మోక్షం ప్రసాదించే ఇందిరా ఏకాదశి రోజు తప్పనిసరిగా చదువుకోవాల్సిన కథ ఇది!
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
Embed widget