అన్వేషించండి

Best Horror Movie On OTT: చిన్న బాటిల్‌తో అమెరికన్లను భయపెట్టిన ఇండియన్ అమ్మాయి - ఆ సీసా పగలగానే ఏమైంది? ఈ మూవీని ఒంటరిగా చూడొద్దు

ఆమె స్కూల్‌కు ఓ బాటిల్ తీసుకొస్తుంది. భయంతో వణికపోతూ.. ఆ సీసాతో స్కూల్ మొత్తం తిరుగుతుంది. చివరికి ఆ బాటిల్ పగిలిపోతుంది. ఆ తర్వాత దాన్ని పట్టుకున్న అమ్మాయి మాయమవుతుంది. ఇంతకీ ఆ బాటిల్‌లో ఏముంది?

మెరికన్స్‌కు ఇండియన్ కల్చర్స్ అంటే చాలా ఇష్టం.. ఆసక్తి. అందుకే.. ఓ ఇండియన్ డైరెక్టర్ పూర్తిగా హాలీవుడ్ టెక్నిషియన్స్‌, ప్రవాస భారతీయులతో కలిసి.. ఓ భయానకమైన హర్రర్ మూవీని తెరకెక్కించారు. 2023లో విడుదలైన ఈ మూవీ.. అమెరికన్లకు తెగ నచ్చేసింది. ఈ సినిమాకు మంచి రేటింగ్స్ కూడా వచ్చాయి. ఇంతకీ ఆ మూవీ ఏమిటో తెలుసా? It lives inside.

ఇండియన్ కల్చర్‌కు సంబంధించిన కథలు వెస్టర్న్ ఆడియెన్స్‌కు పరిచయం చేయాలనుకున్నా.. ఈ ప్రయత్నం మంచి విజయాన్ని సాధించింది. హార్రర్‌కు కల్చరల్ మైథాలజీ తోడైతే ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయనేది.. ‘ఇట్ లివ్స్ ఇన్సైడ్’ మూవీ చూస్తే అర్థమవుతుంది.

‘ఇట్ లివ్స్ ఇన్సైడ్’ బిషాల్ దత్తా డైరెక్ట్ చేసిన తొలి చిత్రం. కల్చరల్ మైథాలజీని, ఒక ఇమ్మిగ్రెంట్ కుటుంబంలో కల్చర్స్ కి ఇమడలేకపోతున్న ఒక అమ్మాయి సమిధ స్టోరీ ఇది. ఈ పాత్రలో మేఘన్ సూరి అద్భుతంగా చేసింది. ఈమె ఒక టిపికల్ టీనేజర్ లాగే మొండిఘటం. అతిగా భరించే తల్లి, స్కూల్లో ఒక బోయ్ క్రష్. ఇంకా ఒకప్పటి బెస్ట్ ఫ్రెండ్ తమిరా. ఈ మూవీలో ఇవే కీలక పాత్రలు.

కథమేమిటీ?

చాలా సైలెంట్‌గా ఈ మూవీ మొదలవుతుంది. స్టార్టింగ్‌లోనే ఆసక్తి కలిగించేలా సీన్ ఉంటుంది. ఒక ఇంట్లోకి ప్రవేశించగానే.. భయానక దృశ్యాలు కనిపిస్తాయి. హాల్లో శవాలు పడి ఉంటాయి. దూరం నుంచి భయంకరమైన అరుపులు వినపడుతాయి. మెట్ల కింద కాలిపోయిన శరీరం నుంచి ఇంకా పొగలు వస్తుంటాయి. ఆ శవం చేయి ఒక గాజు జార్ వైపుకు చాచి ఉంటుంది. ఇంతకీ ఆ గాజు జార్‌లో ఏముంది? వారిని ఎవరు చంపారనే ప్రశ్నలు మదిలో మెదలుతాయి. 

నిద్రలేకుండా, తనలో తానే మాట్లాడుకుంటూ ఏదో గాజు జార్‌తో స్కూల్లో తిరుగుతూ కనిపిస్తుంది తమీరా. ఆమెను అలా చూసి స్కూల్ టీచర్ వర్రీ అవుతుంటుంది. దీంతో సమిధను ఆమెతో మాట్లాడమని చెబుతుంది. తోటి ఇండియన్స్‌తో ఉండేందుకు ఇష్టపడని సమిధ.. ఆ పిచ్చి బ్రౌన్ పర్సన్ తో నేను మాట్లాడను అని టీచర్‌కు చెబుతుంది. అయితే, తమీరా ఆ గాజు జార్ (బాటిల్)ను పట్టుకుని సమిధను కలుస్తుంది. తనకు హెల్ప్ చేయాలని కోరుతుంది. ఆ గ్లాస్ జార్ పట్టుకుని సమిధను సమీపిస్తుంది. దీంతో సమిధ కంగారులో ఆ జార్‌ను చేత్తో కొట్టడంతో తమీరా చేతి నుంచి జారిపోయి పగిలిపోతుంది. ఆ తర్వాత పొగలు కమ్ముకుని తమీరా కనిపించకుండా పోతుంది. ఏదో శక్తి ఆమెను లాక్కెళ్లిపోతుంది.

ఆ తర్వాత సమిధ ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూజ జరుగుతుంది. కనిపించకుండా పోయిన తమీరాను కాపాడాలంటూ సమిధ దేవుడిని కోరుకుంటుంది. అయితే, సమిధకు కలలో భయానకమైన రూపం కనిపిస్తుంది. దీంతో ఉలిక్కిపడుతుంది. వెంటనే తల్లికి ఆ విషయం చెబుతుంది. తల్లి ఆమెకు కొన్ని మంత్రాలను చెబుతుంది. సమిధ వాటిని నేర్చుకుంటుంది. ఆ తర్వాత తమీరా కోసం వెతకడం మొదలుపెడుతుంది. ఇంతకీ సమిధ.. ఆమెను కనుగొంటుందా? ఆ బాటిల్ నుంచి వచ్చిన భయానకమైన దెయ్యంతో ఆమె పోరాడగలుగుతుందా? అనేది తెరపైనే చూడాలి. 

ఈ సినిమాలో సమిధ తన ఇండియన్ పేరుతో పరిచయం చేసుకోవటానికి ఇష్టపడదు. వైట్ టీనేజర్స్ తోనే మాట్లాడుతూ ఉంటుంది. ఎవరితోనూ కలవదు. ఎవర్నీ ఇంటికి పిలవదు. హిందీ ఎప్పుడో తప్ప అస్సలు మాట్లాడదు. ఇండియన్ కల్చర్స్ నచ్చవు. సాంప్రదాయాలను పాటించే తన తల్లితో ఎప్పుడూ విభేదాలు అవుతూ ఉంటాయి. అందుకే, ఆమె తోటి ఎన్ఆర్ఐ తమీరాతో కూడా మాట్లాడదు. అయితే, తమీరాకు ఆ డెవిల్ జార్ ఎప్పుడు, ఎక్కడ ఎలా దొరికింది? అందులో ఏం ఉంది? ఆ జార్‌కు ఈ కథకు సంబంధం ఏమిటీ? ఇలా ఎన్నో చిక్కుముడులు.. ట్విస్టులతో ఈ కథ సాగుతుంది. అనుక్షణం భయపెట్టే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో, సీన్లతో ఎక్కడా బోర్ కొట్టకుండా కథ సాగుతుంది. ఈ సినిమాకి పార్ట్ 2 కూడా ఉండబోతుందని టాక్. ప్రస్తుతం ఈ మూవీ Hulu యాప్‌లో స్ట్రీమ్ అవుతోంది. 

It lives inside ట్రైలర్:

Also Read: కలలోనూ వెంటాడే సినిమా ‘ఇన్సెండీస్’ - క్లైమాక్స్‌ కంపరం పుట్టిస్తుంది, మీరు అస్సలు ఊహించలేరు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ustad Zakir Hussain Passed Away: తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఫిక్స్ - ఇంతకీ గెలిచింది ఎవరు?
బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఫిక్స్ - ఇంతకీ గెలిచింది ఎవరు?
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Best Chess Apps: ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ustad Zakir Hussain Passed Away: తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఫిక్స్ - ఇంతకీ గెలిచింది ఎవరు?
బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఫిక్స్ - ఇంతకీ గెలిచింది ఎవరు?
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Best Chess Apps: ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
TSPSC Group 2 Exam: సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
Manchu Manoj Vs Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
YSRCP On One Nation One Election: 2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
Embed widget