IPL, 2022 | Qualifier 1 | Eden Gardens, Kolkata - 24 May, 07:30 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
RR
RR
IPL, 2022 | Eliminator | Eden Gardens, Kolkata - 25 May, 07:30 pm IST
(Match Yet To Begin)
LSG
LSG
VS
RCB
RCB

Ban Netflix Trends: బ్యాన్ నెట్‌ప్లిక్స్‌ హ్యాష్‌ట్యాగ్‌ ట్విట్టర్‌లో ఎందుకు ట్రెండ్‌ అవుతుంది... నవరస వెబ్‌సిరీస్‌పై ఆ వర్గానికి ఉన్న అభ్యంతరమేంటి?

నవరస వెబ్‌సిరీస్ అందరి నుంచి అభినందనలు వస్తున్నాయి. కానీ ఓ వర్గం మాత్రం మండిపడుతోంది. ఏకంగా బ్యాన్ నెట్‌ఫ్లిక్స్‌ అంటూ ఆన్‌లైన్ ఉద్యమం లేవదీసింది.

FOLLOW US: 

ముస్లిం వర్గానికి చెందిన వారంతా నెట్‌ప్లిక్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవిత్రమైన ఖురాన్‌ను ఇష్టం వచ్చినట్టు వాడుకోవడంపై మండిపడుతున్నారు. ఈ వివాదానికి ప్రధాన కారణమే నవరస వెబ్‌సిరీస్.

ఎప్పటి నుంచో వేచి చూస్తున్న వెబ్‌సిరీస్‌లో నవరస ఒకటి. అలాంటి మచ్‌ వెయిటెడ్‌ వెబ్‌సిరీస్ నవరస శుక్రవారం(ఆగస్టు-6) నెట్‌ఫ్లిక్స్‌ విడుదలైంది. తొమ్మిది ప్రత్యేక కథనాలను సౌతిండియా సినీ ఫీల్డ్‌లోని పెద్ద నటులు నటిస్తే... ప్రముఖ దర్శకులు తీశారు. అందుకే దీనిపై ఎప్పుడూ లేనంత హైప్ క్రియేట్ అయింది.  

ఈ వెబ్‌సిరీస్ చూసిన నెటిజన్లు చాలా మంది నవరసలో నటించిన నటులు, తీసిన దర్శకులపై ప్రశంసల జల్లు కురిపిస్తుంటే... ముస్లింలు మాత్రం తీవ్రంగా మండిపడుతున్నారు. దీనంతటికీ వెబ్‌సిరీస్ ప్రచారం కోసం ఇచ్చిన యాడ్‌ కారణమవుతోంది.

నవరస వెబ్‌సిరీస్‌ విడుదల అవుతుందని నెట్‌ఫ్లిక్స్‌... తమిళనాడులోని న్యూస్‌పేపర్స్‌లో యాడ్ వేసింది. దానిపై అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు ముస్లింలు. పవిత్రమైన ఖురాన్‌ను ఓ అడ్వర్టైజ్‌మెంట్‌ ప్రోపర్టీగా చూడటమేంటని ఆ వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 

పవిత్రమైన తమ మతగ్రంథాన్ని కించపరిచే నెట్‌ఫ్లిక్స్‌పై చర్యలు తీసుకోవాలని ముస్లింపెద్దలు డిమాండ్‌ చేస్తున్నారు. ఖురాన్ అనేది ఎంటర్‌టైన్‌మెంట్‌ సోర్స్‌ కాదని... నెటిజన్లు మండిపడుతున్నారు. అందుకే వాళ్లంతా  #BanNetflix పేరుతో ట్విట్టర్‌లో నిరసన తెలియజేస్తున్నారు. 

నెట్‌ఫ్లిక్స్‌ తమ మనోభావాలను దెబ్బ తీసిందని... దీనిపై వివరణ ఇవ్వాల్సిందేనంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఖురాన్ లాంటి పవిత్ర గ్రంథాలను ఇష్టం వచ్చినట్టు వాడుకొని... సెంటిమెంట్స్‌ను కించపరచొద్దని గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు. 

నవరస వెబ్‌సిరీస్‌లో ఇన్మయి స్టోరీ ఉంది. ఇందులో సిద్ధార్థ్, పార్వతి తిరువోతు, పావెల్ నవగీతన్, రాజేష్‌ బాలచంద్రన్ ప్రధాన పాత్రలు పోషించారు. దీన్ని రతీంద్ర ఆర్‌ ప్రసాద్ డైరెక్ట్ చేశారు. దీనికి విశాల్ భరధ్వజ్‌ సంగీతం అందించారు. ఈ ఎపిసోడ్‌పై వచ్చిన ప్రకటనే వివాదానికి కారణమైంది. 

జయేంద్ర పంచపకేసన్‌తో కలిసి మణిరత్నం ఈ నవరస వెబ్‌సిరీస్‌ను నిర్మించారు. ప్రియదర్శన్, వసంత్, గౌతమ్ వాసుదేవ్ మేనన్, అరవింద్ స్వామి, బిజయ్ నంబియార్, కార్తీక్ సుబ్బరాజ్, కార్తిక్ నారెన్, సర్జున్ కేఎం, రతీంద్ర ఆర్.ప్రసాద్ ఒక్కో ఎపిసోడ్‌ను డైరెక్ట్ చేశారు. 

సూర్య, విజయ్ సేతుపతి, సిద్ధార్థ్, అరవింద్ స్వామి, ప్రకాశ్ రాజ్, రేవతి, గౌతమ్ మేనన్, అంజలి, ఐశ్వర్య రాజేశ్, యోగిబాబు ఈ నవరస వెబ్‌సిరీస్‌లో నటించారు. అందుకే దీనికి ఇంతటి క్రేజ్ వచ్చింది. 

వెబ్‌ సిరీస్ ట్రైలర్ ఇక్కడ చూడండి :

ALSO READ: 'నవరస' అద్భుతహా.. ఔరా అనిపిస్తున్న స్టార్ హీరోస్ వెబ్‌సిరీస్

Published at : 06 Aug 2021 08:25 PM (IST) Tags: Netflix Twitter Navarasa Ban Netflix Trending

సంబంధిత కథనాలు

Bigg Boss Non-Stop Winner Prize Money: బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ - ప్రైజ్ మనీ ఎంత గెలుచుకుందంటే?

Bigg Boss Non-Stop Winner Prize Money: బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ - ప్రైజ్ మనీ ఎంత గెలుచుకుందంటే?

Bindu Madhavi vs Nataraj: నటరాజ్‌తో శపథం, చివరికి పంతం నెగ్గించుకున్న ఆడపులి బిందు మాధవి

Bindu Madhavi vs Nataraj: నటరాజ్‌తో శపథం, చివరికి పంతం నెగ్గించుకున్న ఆడపులి బిందు మాధవి

Bigg Boss OTT Finale: గోల్డెన్ సూట్ కేస్ రిజెక్ట్ చేసిన ఫైనలిస్ట్స్ - విన్నర్ గా నిలిచిన బిందు మాధవి!

Bigg Boss OTT Finale: గోల్డెన్ సూట్ కేస్ రిజెక్ట్ చేసిన ఫైనలిస్ట్స్ - విన్నర్ గా నిలిచిన బిందు మాధవి!

Bindu Madhavi: ‘బిగ్ బాస్ తెలుగు’ హిస్టరీలో తొలిసారి - విజేతగా లేడీ కంటెస్టెంట్, బిందు సరికొత్త రికార్డ్

Bindu Madhavi: ‘బిగ్ బాస్ తెలుగు’ హిస్టరీలో తొలిసారి - విజేతగా లేడీ కంటెస్టెంట్, బిందు సరికొత్త రికార్డ్

Bigg Boss Telugu: ‘బిగ్ బాస్’ లైవ్ అప్‌డేట్స్: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ విన్నర్ బిందు మాధవి

Bigg Boss Telugu: ‘బిగ్ బాస్’ లైవ్ అప్‌డేట్స్: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ విన్నర్ బిందు మాధవి
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Kakinanda News : ఎమ్మెల్సీ అనంతబాబు ఇగో హర్ట్ అయి నెట్టడంతో డ్రైవర్ మృతి - ఎస్పీ రవీంద్రనాథ్

Kakinanda News : ఎమ్మెల్సీ అనంతబాబు ఇగో హర్ట్ అయి నెట్టడంతో డ్రైవర్ మృతి - ఎస్పీ రవీంద్రనాథ్

Bus Accident: బెంగళూరు-హైదరాబాద్ హైవేపై ప్రమాదం, ప్రైవేటు బస్సు - లారీ ఢీ

Bus Accident: బెంగళూరు-హైదరాబాద్ హైవేపై ప్రమాదం, ప్రైవేటు బస్సు - లారీ ఢీ

YS Jagan Davos Tour: దావోస్‌లో ఏపీ ధగధగలు, హై ఎండ్‌ టెక్నాలజీ హబ్‌గా విశాఖ - రెండోరోజు హైలైట్స్ ఇవే

YS Jagan Davos Tour: దావోస్‌లో ఏపీ ధగధగలు, హై ఎండ్‌ టెక్నాలజీ హబ్‌గా విశాఖ - రెండోరోజు హైలైట్స్ ఇవే

Simple Hacks: పచ్చి మాంసాన్ని ఎక్కువ కాలం ఫ్రిజ్‌లో తాజాగా ఉంచాలంటే ఈ చిట్కాలు పాటించండి

Simple Hacks: పచ్చి మాంసాన్ని ఎక్కువ కాలం ఫ్రిజ్‌లో తాజాగా ఉంచాలంటే ఈ చిట్కాలు పాటించండి