Akhanda 2 OTT : ఆ ఓటీటీలోకి బాలయ్య 'అఖండ 2' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Akhanda 2 OTT Platform : బాలయ్య 'అఖండ 2' ఓటీటీ రిలీజ్ కోసం ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ మూవీ ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది.

Balakrishna's Akhanda 2 OTT Release Date : గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య, స్టార్ డైరెక్టర్ బోయపాటి కాంబోలో 'అఖండ 2 తాండవం' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ వారం రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్, మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
'అఖండ 2' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ఫేమస్ ఇంటర్నేషనల్ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' సొంతం చేసుకుంది. మూవీ థియేటర్లలో మంచి క్రేజ్‌తో దూసుకెళ్తుండగా ఓటీటీలోకి వచ్చేటప్పటికీ టైం పట్టే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఏ మూవీ అయినా సాధారణంగా 4 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండడం కామన్.
ఈ మూవీ కూడా జనవరి రెండో వారంలో ఓటీటీలోకి స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. మరి దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.
Also Read : 'OG' డైరెక్టర్‌కు పవన్ కాస్ట్‌లీ కారు గిఫ్ట్ - హిట్ కొట్టినందుకు కాదు... అసలు రీజన్ ఏంటంటే?
బాలయ్య సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించారు. ఆది పినిశెట్టి విలన్ రోల్ చేయగా... హర్షాలి మల్హోత్రా, పూర్ణ కీలక పాత్రలు పోషించారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ అచంట, గోపీ అచంట మూవీని నిర్మించారు. సనాతన హైందవ ధర్మంతో పాటు ఆలయాల విశిష్టిత, సామాజిక అంశాల టచ్ చేస్తూ డైరెక్టర్ బోయపాటి మూవీని రూపొందించారు.
స్టోరీ ఏంటంటే?
టిబెట్ సరిహద్దులో ఈ కథ మొదలవుతుంది. చైనాకు చెందిన ఆర్మీకి, భారత ఆర్మీకి జరిగిన ఘర్షణల్లో చైనా ఆర్మీ జనరల్ (సంగే సల్ట్రామ్) కుమారుడు చనిపోతాడు. దీంతో ఇండియాపై పగ పెంచుకున్న ఆ దేశ ఆర్మీ జనరల్ మన దేశ మూలాలు, భారతీయుల నమ్మకాల్ని దెబ్బకొట్టేలా విధ్వంసం ప్లాన్ చేస్తాడు. ఇందు కోసం దేశ ప్రధాని పదవిపై కన్నేసిన పొలిటీషియన్ అజిత్ ఠాకూర్ (కబీర్ సింగ్ దుహాన్)తో చేతులు కలుపుతాడు.
బయో వార్‌లో భాగంగా కుంభమేళాలో ఓ ప్రమాదకర వైరస్ వ్యాపింపచేస్తారు. దీంతో కుంభమేళాలో స్నానం చేసిన వారంతా అపస్మారక స్థితికి వెళ్లిపోతారు. అయితే, DRDO సైంటిస్టులు ఈ వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెడతారు. ఈ విషయం తెలుసుకున్న అజిత్ తన బలగంతో డీఆర్డీవోపై దాడికి దిగుతాడు. అందరినీ చంపేయగా వ్యాక్సిన్‌తో యంగ్ సైంటిస్ట్ జననీ (హర్షాలీ మల్హోత్రా) మాత్రమే బయటపడుతుంది. శత్రువులు ఆమె వెంటపడగా రుద్ర సికిందర అఘోరా (బాలకృష్ణ) ఆమెను రక్షించేందుకు రంగంలోకి దిగుతాడు. అసలు జననీకి రుద్ర సికిందర్ అఘోరా ఏమవుతాడు? శత్రువుల్ని ఎదిరించిన అఘోరా సనానత హైందవ ధర్మ గొప్పతనాన్ని ఎలా చాటి చెప్పారు? అనంతపురం ఎమ్మెల్యే బాల మురళీకృష్ణకు సంబంధం ఏంటి? ఈ విషయాలు తెలియాలంటే మూవీ చూడాల్సిందే.





















