Ae Watan Mere Watan OTT: ఓటీటీలోకి వచ్చిన సారా దేశభక్తి సినిమా - డీటెయిల్స్ తెలుసుకోండి!
Ae Watan Mere Watan OTT Streaming: పటౌడీ వారసురాలు సారా అలీ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'ఏ వతన్ మేరే వతన్'. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఎందులో చూడవచ్చంటే?
Ae Watan Mere Watan Release Date OTT: బీ టౌన్ యంగ్ హీరోయిన్, పటౌడీ వారసురాలు సారా అలీ ఖాన్ (Sara Ali Khan) ప్రధాన పాత్రలో నటించిన దేశ భక్తి సినిమా 'ఏ వతన్ మేరే వతన్'. ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ప్రొడ్యూస్ చేశారు. ఇప్పుడీ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
ప్రైమ్ వీడియోలో 'ఏ వతన్ మేరే వతన్'
ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం ఎక్స్‌క్లూజివ్‌గా రూపొందిన ఒరిజినల్ సినిమా 'ఏ వతన్ మేరే వతన్'. స్వాతంత్ర్య సమర యుద్ధం నేపథ్యంలో చిత్రాన్ని తెరకెక్కించారు. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వీక్షకులకు అందుబాటులో ఉంది.
'ఏ వతన్ మేరే వతన్' కథ ఏమిటంటే?
Ae Watan mmere Watan Story: స్వాతంత్ర సమర యుద్ధంలో ఎంతో మంది తమ ప్రాణాలకు తెగించి పోరాటం చేశారు. కొందరు నేరుగా యుద్ధంలో పాల్గొంటే... ఇంకా కొందరు తెర వెనుక ఉండి, ప్రజల్లో సమరోత్సాహం నింపేలా కృషి చేశారు. ఆ విధంగా పని చేసిన ఓ మహిళ కథే 'ఏ వతన్ మేరే వతన్'.
#AeWatanMereWatan
— Neeti Roy (@neetiroy) March 21, 2024
Directed by Kannan Iyer, this historical drama is an engaging and well narrated tale of an unsung hero from India's struggle for independence, Usha Mehta.
However, #SaraAliKhan really struggles to hit the high notes of the character. Emraan Hashmi's portrayal… pic.twitter.com/9h6qMDsDEr
కాంగ్రెస్ పార్టీని బ్రిటీషర్ల నిషేధించడంతో పాటు మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి నాయకులను అరెస్ట్ చేస్తారు. అప్పుడు అండర్ గౌండ్ రేడియో స్టేషన్ ఏర్పాటు చేసిన ఓ యువతి, ఉద్యమకారుల్లో ఏ విధంగా ఉత్సాహం నింపారు? అనేది సినిమా కథ. ఉషా మెహతా జీవితం ఆధారంగా తెరకెక్కించారు. ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా మార్చి 21న సినిమా స్ట్రీమింగ్ చేయడం విశేషం.
Also Read: శవం చుట్టూ సాలెగూడు, తాంత్రిక పూజలు - ఇంట్రెస్టింగ్‌గా నవీన్ చంద్ర 'ఇన్‌స్పెక్టర్ రిషి' ట్రైలర్
Loved the film #AeWatanMereWatan
— Moses Sapir (@MosesSapir) March 20, 2024
It’s #SaraAliKhan’s best performance till date ( and I didn’t like any of her performance till now )
Moving film and very interesting.
Dir done a fine work and all the actors@emraanhashmi is terrific , he is just fantastic actor.
Do watch this… pic.twitter.com/FoWFxtZv8W
'ఏ వతన్ మేరే వతన్'లో ఎవరెవరు నటించారంటే?
ఉషా మెహతా పాత్రలో సారా అలీ ఖాన్ నటించిన 'ఏ వతన్ మేరే వతన్' సినిమాలో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలో నటించారు. ఆయన రామ్ మనోహర్ లోహియా పాత్ర పోషించారు. సారా అలీ ఖాన్ తండ్రి పాత్రలో సచిన్ ఖేడేకర్ నటించారు. ఇంకా అభయ్ వర్మ, స్పార్ష్ శ్రీవాత్సవ, అలెక్స్ ఓ నేలి, ఆనంద్ తివారి ఇతర తారాగణం.
Also Read: గ్రాండ్‌గా పూజతో ప్రారంభమైన రామ్ చరణ్ కొత్త సినిమా - ముఖ్య అతిథిగా మెగాస్టార్