Actress Sai Pallavi: శారీరకంగానే కాదు మాటలతో ఇబ్బంది పెట్టినా అది వేధింపులతో సమానమే : సాయి పల్లవి
నటి సాయి పల్లవి ఇటీవల ఆమె ఓ టాక్ షో లో పాల్గొంది. ఉమెన్స్ డే సందర్భంగా ఈ టాక్ షో కు సంబంధిచిన ప్రోమో విడుదల అయింది. ఈ సందర్భంగా తన వ్యక్తిగత, సినిమా జీవిత విశేషాల గురించి వివరించింది.
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ల లో నటి సాయి పల్లవి ఒకరు. ఆమె అందం, అభినయంతో పాటు తన డాన్స్ తో కూడా ఎందో మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. ‘ఫిదా’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ న్యాచురల్ బ్యూటీ ఆ మూవీతో అందర్నీ ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చకుంది సాయిపల్లవి. ఇటీవల ఆమె ఓ టాక్ షో లో పాల్గొంది. ఉమెన్స్ డే సందర్భంగా ఈ టాక్ షో కు సంబంధిచిన ప్రోమో విడుదల అయింది. ఈ సందర్భంగా తన వ్యక్తిగత, సినిమా జీవిత విశేషాల గురించి వివరించింది. ఇదే షో లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీ టూ ఉద్యమం పై సాయి పల్లవి కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ప్రముఖ ఓటీటీ సంస్థ సోని లీవ్ లో స్మిత హోస్ట్ గా ‘నిజం విత్ స్మిత’ కార్యక్రమం జరుగుతోంది. ఇటీవల ఈ కార్యక్రమానికి ప్రముఖ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి గెస్ట్ గా తీసుకొచ్చారు నిర్వాహకులు. అందుకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ సందర్బంగా స్మిత అడిగిన ప్రశ్నలకు సాయి పల్లవి సమాధానాలు చెప్పింది. ‘ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్.. ఈ ముగ్గురిలో ఎవరితో డాన్స్ చేయాలని అనుకుంటున్నావు’ అని స్మిత అడిగితే.. ఈ ముగ్గురితో కలసి ఓ పాట చేస్తే బాగుంటుంది అని నవ్వుతూ సమాధానమిచ్చింది సాయి పల్లవి. అలాగే ఈ ఇంటర్వ్యూలో తన కెరీర్ లో ఎదుర్కొన్న ప్రతికూల పరిస్థితుల గురించి పలు విషయాలను పంచుకుంది. ఈ సందర్బంగా దేశంలో ప్రకంపనలు సృష్టించిన మీ టూ ఉద్యమం గురించి సాయి పల్లవి ను అడిగింది స్మిత. దీనికి సాయి పల్లవి సమాధానం చెబుతూ.. "ఎవరైనా శారీరకంగా వేధింపులకు గురిచేయకపోవచ్చు. కానీ, మాటలతో ఎదుటి వారిని ఇబ్బంది పెట్టినా అది వేధింపులతోనే సమానం" అని చెప్పింది సాయి పల్లవి. ఈ కార్యక్రమం మార్చి 10 న స్ట్రీమింగ్ కానుంది.
ఇక సాయి పల్లవి సినిమాల విషయానికొస్తే.. గతేడాది ‘విరాటపర్వం’, ‘గార్గి’ వంటి విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన సినిమాలలో కనిపించింది. ఈ రెండు సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు. అయితే ‘గార్గి’ సినిమాలో సాయి పల్లవి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమా తర్వాత సాయి పల్లవి నటించే సినిమాల గురించి కొత్త వార్తలేమీ రాలేదు. అయితే ఈ మధ్య సుకుమార్-బన్నీ కాంబో లో తెరకెక్కుతోన్న ‘పుష్ఫ 2’ లో సాయి పల్లవి ఓ గిరిజన అమ్మాయి పాత్రలో కనిపించనుందనే వార్తలు విపరీతంగా వస్తున్నాయి. కానీ దీనిపై మూవీ మేకర్స్ ఎలాంటి అధికారిక ప్రకటనా ఇవ్వలేదు. ఏదేమైనా సాయి పల్లవి, బన్నీ కలసి ఓ సినిమాలో నటించాలని బన్నీ అభిమానులు ఎప్పటినుంచో కోరుతున్న విషయం తెలిసిందే. మరి ఈ సినిమాలో సాయి పల్లవి నటిస్తుందో లేదో చూడాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.