News
News
X

Oscar 2023 - Rana: తారక్, చెర్రీ వెంట రానా - ‘ఆస్కార్’ వేడుకలకు భల్లాదేవ!

మార్చి 12 న అమెరికా లాస్ ఏంజిల్స్ లో ఆస్కార్ అవార్డుల వేడుక జరగనుంది. ఈ కార్యక్రమానికి ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ తో పాటు రానా దగ్గుబాటి కూడా వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

FOLLOW US: 
Share:

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించడమే కాకుండా ఇతర దేశాల అభిమానులను కూడా సొంతం చేసుకుంది. అంతర్జాతీయంగా ఈ సినిమాకు పెద్ద ఎత్తున ప్రశంసలు దక్కుతున్నాయి. వరుసగా అంతర్జాతీయ అవార్డులను కైవశం చేసుకుంటూ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. అంతే కాకుండా అత్యంత ప్రతిష్టాత్మక అవార్డులైన ఆస్కార్ బరిలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చోటుదక్కించుకుంది. త్వరలో జరగబోయే ఆస్కార్ వేడుకలకు మూవీ టీమ్ హాజరుకానుంది. ఈ నేపథ్యంలో దీనిపై టాలీవుడ్ యంగ్ హీరో దగ్గుబాటి రానా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

రానా దగ్గుబాటి గురించి సినిమా ఇండస్ట్రీలో తెలియని వారుండరు. పెద్ద సినిమా బ్యాగ్రౌండ్ ఉన్నా ఫ్యామిలీ నుంచి వచ్చినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రానా. కెరీర్ ప్రారంభంలోనే బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అయితే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’, ‘బాహుబలి 2’ సినిమాలలో నటించి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో రాజమౌళి అతని టీమ్ తో రానా కు మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఆస్కార్ అవార్డు వేడుకకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇటీవల ఓ ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ఆస్కార్ వేడుకకు ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ తో పాటు తాను కూడా వెళ్లడానికి సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు కచ్చితంగా ఆస్కార్ అవార్డు వరిస్తుందని, తనకు ఆ నమ్మకం ఉందని అన్నారట రానా. ఆ సమయంలో వారిని ఉత్తేజపరచడానికి వారి టీమ్ లో తాను కూడా ఉంటే బాగుంటుందనుకుంటున్నానని రానా అన్నట్లు వార్తలు వచ్చాయి. అంతేకాదు, జక్కన్న తన చిరకాల మిత్రుడు ప్రభాస్‌ను కూడా తనతో రమ్మని ఆహ్వానించినట్లు తెలిసింది. అయితే, దీనిపై క్లారిటీ రావల్సి ఉంది. ఎందుకంటే అవార్డుల వేడుకలకు కేవలం ఆహ్వానితులకు మాత్రమే ఎంట్రీ ఉంటుంది. మరి, ఆ జాబితాలో బాహుబలి, భల్లాలదేవ పేర్లు ఉన్నాయో లేదా అనేది ఇప్పట్లో తెలియదు. 

ప్రస్తుతం రానా దగ్గుబాటి, విక్టరీ వెంకటేష్ కలసి నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ త్వరలో నెట్ ఫ్లిక్స్ వేదికగా విడుదల కానుంది. దీనికి అన్ని ఏర్పాట్లను చేసినట్లు తెలిపారు. అన్నీ అనుకున్నట్లుగా వెబ్ సిరీస్ విడుదల అయితే తాను కొన్ని రోజులు బయటకు వెళ్లాలని అనుకుంటున్నానని రానా వెల్లడించినట్లు సమాచారం. అయితే ఆస్కార్ వేదికపై ‘నాటు నాటు’ లైవ్ ప్రదర్శనలో మీరు కూడా ఉంటారా అని రానా ను అడిగితే.. నిజానికి అంత ఉత్సాహం తనకూ ఉన్నప్పటికీ.. అది చేయడానికి రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ఉన్నారని, ఆ ఐకానిక్ స్టెప్పులు వాళ్లు చేస్తేనే బాగుంటుందని బదులిచ్చారట రానా. అయితే రానా కూడా ఆస్కార్ వేదికపై ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ తో కలసి కనిపిస్తారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. మార్చి 12 న అమెరికా లాస్ ఏంజిల్స్ లో ఈ ఆస్కార్ అవార్డుల కార్యక్రమం జరగనుంది. ఈ వేదికపై ‘నాటు నాటు’ పాట లైవ్ ప్రదర్శన కోసం యావత్ భారత ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇక దగ్గుబాటి రానా నటించిన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ మార్చి 10 నుంచీ స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ లో వెంకీ, రానా పరస్పర వ్యతిరేక క్యారెక్టర్లలో కనిపిస్తుండటంతో దీనిపై ఆసక్తి నెలకొంది. 

Also Read ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌ను అవమానించిన బాలకృష్ణ?

Published at : 03 Mar 2023 07:01 PM (IST) Tags: RRR Rana Daggubati Jr NTR Ram Charan Oscar 2023

సంబంధిత కథనాలు

Sreeleela Role In NBK 108 : బాలకృష్ణకు శ్రీలీల కూతురు కాదు - అసలు నిజం ఏమిటంటే?

Sreeleela Role In NBK 108 : బాలకృష్ణకు శ్రీలీల కూతురు కాదు - అసలు నిజం ఏమిటంటే?

Tollywood: మహేశ్ తర్వాత నానినే - మిగతా స్టార్స్ అంతా నేచురల్ స్టార్ వెనుకే!

Tollywood: మహేశ్ తర్వాత నానినే - మిగతా స్టార్స్ అంతా నేచురల్ స్టార్ వెనుకే!

Taraka Ratna Wife Alekhya : కోయంబత్తూరు వెళ్లిన తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి

Taraka Ratna Wife Alekhya : కోయంబత్తూరు వెళ్లిన తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి

Pawan Kalyan Movie Title : అబ్బాయి అకీరా నందన్ బర్త్ డేకు పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టైటిల్?

Pawan Kalyan Movie Title : అబ్బాయి అకీరా నందన్ బర్త్ డేకు పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టైటిల్?

Janaki Kalaganaledu April 1st: రౌడీ దుమ్ముదులిపిన జానకి- జ్ఞానంబకి పెద్దకోడలు మీద చాడీలు చెప్పిన పెట్రోల్ మల్లిక

Janaki Kalaganaledu April 1st:  రౌడీ దుమ్ముదులిపిన జానకి- జ్ఞానంబకి పెద్దకోడలు మీద చాడీలు చెప్పిన పెట్రోల్ మల్లిక

టాప్ స్టోరీస్

AP News : ప్రొబేషన్ కోసం పడిగాపులు - ఏపీలో 17వేల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎన్ని కష్టాలో ...

AP News  :  ప్రొబేషన్ కోసం పడిగాపులు - ఏపీలో 17వేల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎన్ని కష్టాలో ...

PBKS Vs KKR: కోల్‌కతాపై పంజాబ్ భారీ స్కోరు - భానుక రాజపక్స మెరుపు ఇన్నింగ్స్!

PBKS Vs KKR: కోల్‌కతాపై పంజాబ్ భారీ స్కోరు - భానుక రాజపక్స మెరుపు ఇన్నింగ్స్!

Ganta Srinivasa Rao : టీడీపీ, జనసేన కలిసి వెళ్లాలనే ప్రజల కోరిక, పవన్ మాట కూడా అదే - గంటా శ్రీనివాసరావు

Ganta Srinivasa Rao : టీడీపీ, జనసేన కలిసి వెళ్లాలనే ప్రజల కోరిక, పవన్ మాట కూడా అదే - గంటా శ్రీనివాసరావు

YS Sharmila: బండి సంజయ్, రేవంత్ రెడ్డికి షర్మిల ఫోన్ - ఏం మాట్లాడుకున్నారంటే?

YS Sharmila: బండి సంజయ్, రేవంత్ రెడ్డికి షర్మిల ఫోన్ - ఏం మాట్లాడుకున్నారంటే?