అన్వేషించండి

Poonam Pandey: సర్వైకల్‌ క్యాన్సర్‌ బ్రాండ్ అంబాసిడర్‌గా పూనమ్‌ పాండే, క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం

Poonam Pandey: సర్వైకల్‌ క్యాన్సర్‌ గురించి అవగాహన కల్పించేందుకు పూనమ్ పాండేను కేంద్రం బ్రాండ్ అంబాసిడర్ గా నియమించబోతుందంటూ వార్తలు వచ్చాయి. తాజాగా ఊహాగానాలపై సర్కారు క్లారిటీ ఇచ్చింది.

Poonam Pandey Being Government's Brand Ambassador?: గర్భాశయ క్యాన్సర్ తో చనిపోయినట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించి సంచలనం సృష్టించింది ప్రముఖ మోడల్, నటి పూనమ్ పాండే. తాజాగా ఆమె గురించి మరో కీలక విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఆమెను క్యాన్సర్ ప్రచార కార్యక్రమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా కేంద్ర ప్రభుత్వం నియమించబోతున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. సర్వైకల్‌ క్యాన్సర్‌ తో పాటు అన్ని రకాల క్యాన్సర్లకు సంబంధించి ఆమె ప్రచార కార్యక్రమాలను నిర్వహించే అవకాశం ఉందని టాక్ వినిపించింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, ఈ విషయానికి సంబంధించి పూనమ్ పాండేతో పాటు ఆమె టీమ్ తో చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరిగింది.

పూనమ్ పాండే బ్రాండ్ అంబాసిడర్ వ్యవహారంపై స్పందించిన కేంద్రం

తాజాగా పూనమ్ పాండే బ్రాండ్ అంబాసిడర్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ వార్తలపై స్పష్టత ఇచ్చింది. ఈ వార్తలను ఎవరు ఎందుకు ప్రచారం చేస్తున్నారో తమకు అర్థం కావడం లేదని వెల్లడించింది. క్యాన్సర్ అవగాహన కార్యక్రమాల కోసం బ్రాండ్ అంబాసిడర్ గా ఆమెను నియమించే పరిశీలన ఏదీ తమ దగ్గర లేదని వెల్లడించింది. పూనమ్ పాండేకు సంబంధించి వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలేనని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది. ఈ ప్రకటనతో రెండు రోజులుగా పూనమ్ గురించి వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పడినట్లు అయ్యింది.

సర్వైకల్‌ క్యాన్సర్‌ తో చనిపోయినట్లు ప్రకటించిన పూనమ్

ఇక గత శుక్రవారం(ఫిబ్రవరి 2) నాడు సర్వైకల్‌ క్యాన్సర్‌ తో పూనమ్ పాండే చనిపోయినట్లు ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని ఆమె ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన మేనేజర్ పోస్టు చేసినట్లు అందరినీ నమ్మించింది. స్వయంగా ఆమె టీమ్ నుంచి ఈ ప్రకటన రావడంతో దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. కేవలం 32 ఏండ్ల వయసులో ఆమె చనిపోవడం పట్ల బాధపడ్డారు. సోషల్ మీడియా వేదిక ఆమెకు పలువురు శ్రద్ధాంజలి ఘటించారు.

పూనమ్ వ్యవహారంపై నిప్పులు చెరిగిన నెటిజన్లు

కొంత మంది నెటిజన్లు మాత్రం ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. అదంతా ఓ పబ్లిసిటీ స్టంట్ గా అభిప్రాయపడ్డారు. వారు చెప్పినట్టుగానే పూనమ్ ఒక్కరోజు తర్వాత ప్రత్యక్షం అయ్యింది. తాను చనిపోలేదంటూ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో రిలీజ్ చేసింది. సర్వైకల్‌ క్యాన్సర్‌ గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇలా చేశానని వెల్లడించింది. తాను చనిపోయినట్లు అబద్దం చెప్పడం పట్ల క్షమాపణలు చెప్పింది. ఒక మంచి కాజ్ కోసమే ఇలా చెయ్యాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. ఆమె తీరుపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాన్సర్‌పై అవగాహన కోసం చనిపోయానని చెప్పడం మంచి పద్దతి కాదని, చావు ప్రకటనతో ఎదుటి వాళ్ల మనోభావాలను దెబ్బతీసినట్లు అయ్యిందని పలువురు అభిప్రాయపడ్డారు. మరికొంత మంది ఆమెపై ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేశ ప్రజల మనోభావాలతో ఆడుకున్న ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Fighter Movie:  ‘ఫైటర్’లో లిప్ లాక్ సీన్ - లీగల్ నోటీసులు పంపిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతారరివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Crime News: ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Embed widget