NTR30: క్రేజీ ఛాన్స్ పోగొట్టుకున్న బాలీవుడ్ బ్యూటీ!
ఎన్టీఆర్30 సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేను తీసుకోవాలనుకున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) 'ఆర్ఆర్ఆర్' తరువాత ఇప్పటివరకు మరో సినిమాను మొదలుపెట్టలేదు. కొరటాల శివ, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఆయన సినిమాలు చేయనున్నారు. ముందుగా కొరటాల శివ సినిమాను మొదలుపెట్టాల్సివుంది. కానీ ఇప్పటివరకు సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. జూలై లేదా ఆగస్టు నెలలో ఈ సినిమా మొదలవ్వాలి కానీ ఇప్పుడు ప్లాన్స్ అన్నీ మారిపోయాయి. స్క్రిప్ట్ లో మార్పులు చేయడానికి కొరటాలకి మరింత సమయం ఇచ్చారు ఎన్టీఆర్.
ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే(Ananya Panday)ను తీసుకోవాలనుకున్నారు. అయితే 'లైగర్' సినిమా విడుదలయ్యే వరకు వెయిట్ చేయమని కోరిందట ఈ బ్యూటీ. తీరా సినిమా రిలీజ్ అయిన తరువాత రిజల్ట్ బోల్తా కొట్టింది. సినిమాలో అనన్య నటనపై ట్రోల్స్ కూడా పడ్డాయి.
దీంతో ఇప్పుడు ఎన్టీఆర్ సరసన ఆమెని తీసుకోవడానికి మేకర్స్ ఆలోచిస్తున్నారు. ఆమెకి బదులుగా మరో హీరోయిన్ ను తీసుకోవాలనుకుంటున్నారు. స్టార్ హీరోయిన్లతో పాటు మృణాల్ ఠాకూర్ లాంటి వాళ్లను కూడా పరిశీలిస్తున్నారు. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో హీరోయిన్ ఛాన్స్ ఎవరికీ దక్కుతుందో చూడాలి..!
మరోపక్క 'ఉప్పెన' దర్శకుడు బుచ్చిబాబు సానాను కూడా ఫైనల్ స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పారట ఎన్టీఆర్. రెండు నెలల్లో స్క్రిప్ట్ పూర్తయితే.. కొరటాల శివ, బుచ్చిబాబు సినిమాలను ఒకేసారి సెట్స్ పైకి తీసుకెళ్లాలనుకుంటున్నారు ఎన్టీఆర్. ముందుగా కొరటాల శివ సినిమాను అక్టోబర్ నెలలో మొదలుపెట్టనున్నారు. అక్టోబర్ నుంచి మూడు నెలల తరువాత అంటే 2023 ఆరంభంలో బుచ్చిబాబు సినిమా కూడా మొదలైపోతుంది.
అప్పటికి కొరటాల సినిమా కూడా సెట్స్ పై ఉంటుంది. అలా రెండు సినిమాలను ఒకేసారి పూర్తి చేయాలనేది ఎన్టీఆర్ ప్లాన్. మరోపక్క.. తమిళ దర్శకుడు వెట్రిమారన్ కూడా రీసెంట్ గా ఎన్టీఆర్ ని కలిశారు. అతడితో కలిసి పని చేయడానికి ఎన్టీఆర్ ఆసక్తి చూపించారు. కానీ ఇప్పట్లో ఈ ప్రాజెక్ట్ మొదలయ్యే అవకాశాలు లేవు. ఎన్టీఆర్, వెట్రిమారన్ ఇద్దరికీ కూడా కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి. ఇక ప్రశాంత్ నీల్ సినిమాను కూడా త్వరలోనే మొదలుపెట్టే ఛాన్స్ ఉంది.
Prashanth Neel On NTR 31: ఎన్టీఆర్‌తో సినిమా గురించి చెప్పమని ఇటీవల ప్రశాంత్ నీల్(Prashanth neel) ని అడిగితే అడిగితే... ''ఏం చెప్పాలి? కథ చెప్పాలా? ఆ సినిమా షూటింగ్ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ లేదా మేలో షూటింగ్ స్టార్ట్ చేస్తాం'' అని ప్రశాంత్ నీల్ తెలిపారు.
Also Read : ఒకవేళ ఆ సినిమాలు పవన్ కళ్యాణ్ చేస్తే మహేశ్, రవితేజ, సూర్యకు స్టార్‌డమ్ వచ్చేదా?
Also Read : పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్... రీమేక్‌లందు పవన్ రీమేక్స్ వేరయా - పవర్ స్టార్‌ది సపరేట్ మేనియా