NTR 30 Update: కొరటాల సినిమా కోసం కొత్త లుక్.. బరువు తగ్గనున్న యంగ్ టైగర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా లాస్ట్ షెడ్యూల్ ఉక్రెయిన్ లో జరుగుతోంది. నిన్ననే టీమ్ మొత్తం ఉక్రెయిన్ కి పయనమైంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా లాస్ట్ షెడ్యూల్ ఉక్రెయిన్ లో జరుగుతోంది. నిన్ననే టీమ్ మొత్తం ఉక్రెయిన్ కి పయనమైంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి అక్టోబర్ 13న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ తన తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'జనతా గ్యారేజ్' సినిమా రికార్డులు సృష్టించింది. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుండడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
రెండు వారాల్లో 'ఆర్ఆర్ఆర్' సినిమా పూర్తి చేసి కొరటాల శివ సినిమా కోసం సిద్ధమవనున్నాడు ఎన్టీఆర్. అక్టోబర్ నెల నుండి కొరటాల శివ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తన లుక్ ను మార్చుకోనున్నాడు. దీనికోసం కాస్త బరువు తగ్గనున్నాడు. 'ఆర్ఆర్ఆర్' సినిమా కోసం ఎన్టీఆర్ కండలు పెంచాడు. భీమ్ క్యారెక్టర్ కోసం కండలు తిరిగిన దేహంతో కనిపించాల్సి రావడంతో.. వర్కవుట్స్ చేసి మరీ బాడీ పెంచాడు. కానీ ఇప్పుడు కొరటాల శివ సినిమాలో సింపుల్ లుక్ తో కనిపించాలి.
అందుకే బరువు తగ్గించుకోబోతున్నాడు. కొరటాల శివ తన సినిమాల్లో హీరోలను మ్యాన్లీగా చూపిస్తుంటాడు. 'మిర్చి' సినిమాలో ప్రభాస్ ను ఎంత హ్యాండ్సమ్ గా చూపించారో తెలిసిందే. 'భరత్ అనే నేను' సినిమాలో మహేష్ ను ఎంతో స్టైలిష్ గా అందంగా చూపించారు. 'జనతా గ్యారేజ్'లో ఎన్టీఆర్ ను స్టైలిష్ గా చూపిస్తూనే మాస్ లుక్ ప్రొజెక్ట్ అయ్యేలా చూపించారు. ఇప్పుడు మరోసారి తారక్ ను సరికొత్త లుక్ లో చూపించడానికి రెడీ అవుతున్నారు. ఇందులో హీరోయిన్ గా కియారా అద్వానీను తీసుకోవాలనుకున్నారు. కానీ ఆమె రామ్ చరణ్ సినిమాకి డేట్స్ ఇచ్చింది కాబట్టి ఎన్టీఆర్ సినిమా చేసే ఛాన్స్ లేదనిపిస్తుంది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ రవిచంద్రన్ ను తీసుకోబోతున్నారు.
ప్రస్తుతం కొరటాల శివ 'ఆచార్య' సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డారు. మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. మెగాస్టార్ చిరంజీకి నటిస్తోన్న ఈ సినిమా ఈపాటికే ప్రేక్షకుల ముందుకు రావాలి. కానీ కరోనా కారణంగా షూటింగ్ ఆలస్యం కావడంతో సినిమా కూడా వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటివరకు సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి క్లారిటీ రాలేదు!
Also Read : Ram charan New Look : రామ్ చరణ్ ఎలిగెంట్ లుక్ పై బాలీవుడ్ ప్రశంసలు!