News
News
X

NTR 30: ఎన్టీఆర్‌తో కయ్యానికి కాలు దువ్వనున్న సైఫ్ అలీ ఖాన్ - ఎన్టీఆర్30 సూపర్ అప్‌డేట్!

జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది.

FOLLOW US: 
Share:

టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో నటించనున్న సంగతి అందరికీ తెలిసిందే.  బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఆమె జూనియర్ ఎన్టీఆర్‌తో రొమాన్స్ చేయనుంది. ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది.

తాజా వార్తల ప్రకారం ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ప్రధాన విలన్‌గా నటించనున్నాడు. ప్రభాస్, కృతి సనన్ కలిసి నటించిన పాన్ ఇండియా చిత్రం 'ఆదిపురుష్'లో సైఫ్ అలీ ఖాన్ లంకేష్ రావణుడిగా కనిపించనున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా కోసం సైఫ్ అలీ ఖాన్‌కు భారీ పారితోషికాన్ని ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

సైఫ్ అలీ ఖాన్ కూడా ఈ సినిమాలో నటించటానికి అంగీకరించడానికి తెలుస్తోంది. అయితే అగ్రిమెంట్లపై సంతకాలు అయ్యాక దీని గురించి అప్‌డేట్ అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ పూజా కార్యక్రమాలు ఫిబ్రవరి 24వ తేదీన జరగనున్నాయి. ఎన్టీఆర్ 30వ చిత్రమిది. అందుకని, ఎన్టీఆర్ 30గా వ్యవహరిస్తున్నారు. మార్చిలో సెట్స్ మీదకు వెళ్ళనుంది. మార్చి 20న రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తామని ఎన్టీఆర్ స్వయంగా 'అమిగోస్' ప్రీ రిలీజ్ వేడుకలో తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆలోపు అప్డేట్స్... అప్డేట్స్ అంటూ దర్శక నిర్మాతలపై ఒత్తిడి తీసుకు రావద్దని కూడా అభిమానులకు ఎన్టీఆర్ క్లాస్ పీకారు. యాంకర్ సుమ కనకాల అప్డేట్ అడిగినప్పుడు ఎన్టీఆర్ సీరియస్ అయ్యారు కూడా. ఈ సినిమా కథా నేపథ్యం గురించైనా ఆసక్తికరమైన వార్త ఒకటి బయటకు వచ్చింది. 

ఈ సినిమా ఓ కల్పిత దీవి, పోర్టు నేపథ్యంలో తెరకెక్కుతోందట. కథా నేపథ్యం ఈ ట్వంటీయెత్ సెంచరీ కాదని సమాచారం అందుతోంది. సెమీ పీరియడ్ బ్యాక్ డ్రాప్ సెలెక్ట్ చేశారట కొరటాల శివ. హైద్రాబాదులో ఈ సినిమా కోసం భారీ సెట్ వేస్తున్నారు. భాగ్య నగరంలో కొంత... ఆ తర్వాత విశాఖ, గోవా ఏరియాల్లో మరి కొంత షూటింగ్ చేయాలని ప్లాన్ చేశారట. వీఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువ ఉంటుందని, సీజీ అవసరం అయ్యే సన్నివేశాలను ముందు షూట్ చేసి విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలకు ఇవ్వాలని ప్లాన్ చేశారట.

ఆల్రెడీ విడుదల చేసిన సినిమా అనౌన్స్‌మెంట్‌ టీజర్‌ ప్రేక్షకుల అందరి దృష్టిని ఆకర్షించింది. ''అప్పుడప్పుడూ ధైర్యానికి కూడా తెలియదు. అవసరానికి మించి తను ఉండకూడదని! అప్పుడు భయానికి తెలియాలి... తాను రావాల్సిన సమయం వచ్చిందని! వస్తున్నా'' అని ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ సూపర్ హిట్ అయ్యింది.

నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై కొరటాల శివ సన్నిహిత మిత్రులు మిక్కినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మిస్తున్న చిత్రమిది. దీనికి యువ సంగీత సంచలన అనిరుధ్  రవిచంద్రన్ సంగీతాన్ని అందించబోతున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ : సాబు సిరిల్, సినిమాటోగ్రాఫర్ : రత్నవేలు.

Published at : 16 Feb 2023 10:18 PM (IST) Tags: Jr NTR Koratala siva Saif Ali Khan NTR 30

సంబంధిత కథనాలు

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్

Kajal Aggarwal: బాలయ్య సరసన కాజల్ - రావిపూడి సినిమాలో హీరోయిన్‌గా కన్ఫర్మ్!

Kajal Aggarwal: బాలయ్య సరసన కాజల్ - రావిపూడి సినిమాలో హీరోయిన్‌గా కన్ఫర్మ్!

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌

BB Jodi Grand finale: ‘BB జోడీ’ గ్రాండ్ ఫినాలే - రూ.25 లక్షల ప్రైజ్ మనీ కోసం 5 జంటల మధ్య పోటీ, గెలిచేదెవరు?

BB Jodi Grand finale: ‘BB జోడీ’ గ్రాండ్ ఫినాలే - రూ.25 లక్షల ప్రైజ్ మనీ కోసం 5 జంటల మధ్య పోటీ, గెలిచేదెవరు?

Nikhil Siddhartha: నిఖిల్ కు ఐకానిక్ గోల్డ్ అవార్డు, ‘కార్తికేయ 2‘లో నటనకు గాను ప్రతిష్టాత్మక పురస్కారం

Nikhil Siddhartha: నిఖిల్ కు ఐకానిక్ గోల్డ్ అవార్డు, ‘కార్తికేయ 2‘లో నటనకు గాను ప్రతిష్టాత్మక పురస్కారం

టాప్ స్టోరీస్

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!

MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

KTR Vs Revanth : కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !

KTR Vs Revanth :  కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !