Actress Anshu Reddy : సినిమాల్లోనే కాదు.. సీరియల్స్‌లోనూ తెలుగు వారికి అవకాశాలు రావట్లేదు - బుల్లితెర నటి అన్షురెడ్డి ఆవేదన!
Anshu Reddy :తెలుగు సినిమాలతో పాటుసీరియల్స్లోనూ స్థానికులకు సరైన అవకాశాలు లభించడం లేదని టీవీ నటి అన్షురెడ్డి ఆవేదన వ్యక్తం చేసింది.
TV Actress Anshu Reddy About Serials Opportunities : తెలుగు బుల్లితెరపై అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న నటి అన్షురెడ్డి. ‘భార్యామణి’ సీరియల్ తో బుల్లితెర కెరీర్ ప్రారంభించిన ఆమె.. తొలి ధారావాహికతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె చక్కటి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత వరుస అవకాశాలు దక్కిచుకుంది. ‘గోకులంలో సీత’, ‘ఇద్దరమ్మాయిలతో’, ‘సూర్యవంశం’, ‘కథలో రాజకుమారి’ లాంటి సీరియల్స్ లో బాగా పాపులర్ అయ్యింది. తెలుగుతో పాటు తమిళ సీరియల్స్ లోనూ సత్తా చాటుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, తెలుగు సీరియల్స్ లో తెలుగు వారికి అవకాశాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.
తెలుగు సీరియల్స్ లో తెలుగు వారికి ఛాన్సులు రావట్లేదు- అన్షు రెడ్డి
ఇతర టీవీ పరిశ్రమలలో స్థానికులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన తర్వాతే, ఇతరులకు ఆఫర్లు ఇస్తారని అన్షురెడ్డి వెల్లడించింది. కానీ, తెలుగులో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంటుందని చెప్పింది. “నేనే వేరే భాషల్లో సీరియల్స్ చేశాను. చేస్తున్నాను. ఎవరు ఎక్కడైనా చెయ్యొచ్చు. కానీ, ఏ ఇండస్ట్రీలోనైనా ముందు తమ భాష వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. తమిళం వాళ్లు తమిళ్ వారికి 80 శాతం అవకాశాలు ఇస్తారు. ఇతర భాషల వాళ్లకు 20 శాతం అవకాశాలు ఇస్తారు. కన్నడ వాళ్లు 90 శాతానికిపైగా స్థానికులకు ఛాన్సులు ఇస్తారు. ఇతరులకు కొద్ది శాతమే ఆఫర్లు ఇస్తారు. కానీ, తెలుగులో పరిస్థితి అలా లేదు. ఇక్కడ చాలా మంది నటులు ఉన్నా, ఇతర భాషల నుంచి వచ్చిన వారికి ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు. మనల్ని కాదని ఇతరులను తీసుకోవడం పట్ల బాధ ఉంది. తెలుగు వారిని కాదని ఇతరులను తీసుకోవడానికి కారణం, ముందు తెలుగు నటీనటులలో ఐక్యత లేకపోవడం. నేను తమిళ సీరియల్ చేసే సమయంలో నాకు తమిళం రాదు. అలాగని అక్కడి నటీనటుల్లో 90 శాతానికి పైగా తెలుగు వచ్చు. కానీ, నాతో మాట్లాడే వారు కాదు. తమిళ్ నేర్చుకుని మాట్లాడాలి అనేవాళ్లు. నేను తమిళం నేర్చుకున్న తర్వాత వాళ్లు తెలుగులో మాట్లాడేవాళ్లు. వాళ్ల భాష మీద వారికి అంత ఇష్టం ఉంటుంది. తెలుగులో నిజానికి టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. నిర్మాతలు వారిని తీసుకోవడానికి ప్రయత్నించాలి. ఒకవేళ వారు సూట్ కాకపోతే, ఇతర భాషల ఆర్టిస్టులను తీసుకోండి. కానీ, ఇక్కడి వాళ్లను పూర్తిగా పక్కకు పెట్టి వేరే భాషల వారిని తీసుకోవడం మంచిది కాదు” అని అన్షు అభిప్రాయపడింది.
ఇంతకీ అన్షురెడ్డి ఎవరంటే?
అన్షురెడ్డి తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా చీర్యాలలో జన్మించింది. ఆమె పదో తరగతి పూర్తి కాగానే పేరెంట్స్ హైదరాబాద్ కు మకాం మార్చారు. అన్షుకు చిన్నప్పటి నుంచే నటన పట్ల మక్కువ ఎక్కువ. ఓ రోజు స్టార్ మహిళ షోలో పాల్గొన్నది. అదే సమయంలో సీరియల్స్‌లో పాల్గొనే ఛాన్స్ దక్కించుకుంది. ప్రస్తుతం పలు సీరియల్స్ లో ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో అన్షు బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ అభిమానులకు ఆకట్టుకుంటుంది.
Read Also: అల్లు అర్జున్ను పెళ్లి చేసుకోవాలనుంది.. మనసులో మాట బయటపెట్టిన లేడీ కమెడియన్