X

Bigg Boss 5 Telugu: ‘వాళ్లు ఆడితే గేమ్.. నేను ఆడితే క్రైమ్’..సన్నీ ఫైర్, బిగ్ బాస్ హౌస్‌లో ‘బంగారు కోడిపెట్ట’

నిన్న నామినేషన్ల రచ్చ ఈ రోజు కూడా కొనసాగింది. గ్రూపులుగా విడిపోయిన ఇంటి సభ్యులు మాటల తూటాలు పేల్చుకున్నారు...ఈ వేడి చల్లారక ముందే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్.

FOLLOW US: 

ఒక్కో వారం గడుస్తున్న కొద్దీ బగ్ బాస్ హౌస్ లో హీట్ పెరుగుతోంది. ఆరు వారాలు పూర్తిచేసుకుని ఏడోవారంలోకి ఎంట్రీ ఇచ్చారు ఇంటి సభ్యులు. ఎప్పటిలానే సోమవారం నామినేషన్లు జరిగాయి. గడిచిన వారాల్లో ముఖం మీదే నామినేషన్లు చేసేసుకున్నారు. కానీ ఏడో వారం నామినేషన్లు భిన్నంగా సాగాయి. అరటిపండు-వేటగాడు-చెట్టు-కోతి కాన్సెప్ట్ తో డిజైన్ చేశారు బిగ్ బాస్. సిరి ఆట.. సన్నీ వేట ఓ రేంజ్ లో సాగింది. గేమ్ మొత్తం వీళ్లిద్దరే ఆడారా అన్నట్టు నడిచింది. ఫైనల్ గా  ఈ వారం నామినేట్ అయిన సభ్యులు కాజల్, రవి, సిరి, ఆనీ, ప్రియ, శ్రీరామ్, జస్వంత్  తో పాటూ  సీక్రెట్ రూమ్ లో ఉన్న లోబో కూడా నామినేషన్లో ఉన్నాడని చెప్పారు బిగ్ బాస్. ఈ రచ్చ సోమవారంతో ఆగిపోలేదు...మంగళవారం కూడా కొనసాగింది.  దీనికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు నిర్వాహకులు. 

సన్నీ తన స్నేహితులను సేవ్ చేసుకునేందుకు ఆడాడని ఇంటి సభ్యులంతా మండిపడ్డారు. గ్రూపులుగా విడిపోయి చర్చలు పెట్టారు. ఓ రకంగా ఇంటి సభ్యుల నామినేష్ కాదు.. సన్నీ వ్యక్తిగతంగా నామినేట్ చేశాడని అన్నారు. సేఫ్ గేమ్ ఆడుతున్నావంటూ సన్నీపై ప్రియాంక సింగ్ ఫైరైంది. సన్నీ నిర్ణయాన్ని తప్పుపట్టిన రవితో కాజల్ వాదించింది. సన్నీ తప్పుచేయలేదని స్ట్రాంగ్ గా చెప్పింది. మరోవైపు ఫ్రెండ్ షిప్ ని టాస్కుల్లో ఎలా చూపిస్తారని షణ్ముక్ ప్రశ్నించాడు. అందరి అభిప్రాయాలు విన్న సన్నీ ఒక్కసారిగా ఫైరయ్యాడు. ‘వాళ్లు ఆడితే గేమ్.. నేను ఆడితే ప్రెండ్ షిప్పా అని రివర్సయ్యాడు.  చూస్తుంటే ఈ రోజు ఎపిసోడ్ లోనూ సగం వరకూ నిన్నటి నామినేషన్ల రచ్చే సాగినట్టు అర్థమవుతోంది. ఈ వేడి చల్లారక ముందే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ "బంగారు కోడిపెట్ట" ఇచ్చారు బిగ్ బాస్. ఇంటి సభ్యులంతా తట్టలు పట్టుకుని గార్డెన్ ఏరియాలో కొడిపెట్ట సెట్టింగ్ వద్ద గుడ్లు కోసం పోటీపడ్డారు. మరోవైపు బయట నుంచి ఎగిరి వస్తున్న ఎగ్స్ పట్టుకునేందుకు పోటీపడ్డారు. అయితే ఎగ్స్ సంపాదించడం ఓ ఎత్తు...వాటిని కాపాడుకోవడం మరో ఎత్తు. అంటే ఈ టాస్క్ కూడా రచ్చే అని ముందే అర్థమైపోతోంది. ఇక గడిచిన ఆరువారాల్లో సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్ మాస్టర్, హమీద, శ్వేత వర్మ ఎలిమినేట్ అయ్యారు. మరి ఈ వారం మొత్తం 8 మంది నామినేట్ అయ్యారు. వీరిలో ఉండే దెవరో, వెళ్లేదెవరో వెయిట్ అండ్ సీ...
Also Read: ప్రభాస్ బర్త్ డే సందర్భంగా 'రాథేశ్యామ్' టీజర్…!
Also Read:  'సిరి ఆట-సన్నీ వేట' విలవిల్లాడిన బిగ్ బాస్ ఇంటి సభ్యులు..ఈ వారం నామినేషన్లో ఉన్నదెవరంటే…
Also Read: పొట్టి డ్రస్సులో జూనియర్ సమంత హొయలు...వైరల్ అవుతున్న బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి ఫొటోస్..
Also Read: కుర్రాళ్ల గుండెల్లో 'ఉప్పెన' సృష్టిస్తోన్న కృతి శెట్టి
Also Read: ఇది లోబడ్జెట్ ‘స్క్విడ్ గేమ్’.. అదరగొట్టేసిన పిల్లలు.. కొరియన్ వెబ్‌సీరిస్ రికార్డుల మోత!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Bigg Boss House Nominations heat Captaincy Contestants Task 'Bangaru Kodipetta'

సంబంధిత కథనాలు

Shreya Muralidhar : కార్డియాక్ అరెస్ట్‌తో యంగ్ యూట్యూబ‌ర్‌ మృతి...

Shreya Muralidhar : కార్డియాక్ అరెస్ట్‌తో యంగ్ యూట్యూబ‌ర్‌ మృతి...

Bigg Boss 5 Telugu: టాప్ లో సన్నీ.. లాస్ట్ లో సిరి.. నామినేషన్ లో ఐదుగురు..

Bigg Boss 5 Telugu: టాప్ లో సన్నీ.. లాస్ట్ లో సిరి.. నామినేషన్ లో ఐదుగురు..

Pushpa Trailer: 'ఎవడి యుద్ధం వాడిదే'.. పుష్పరాజ్ వచ్చేశాడు.. 

Pushpa Trailer: 'ఎవడి యుద్ధం వాడిదే'.. పుష్పరాజ్ వచ్చేశాడు.. 

The wrong swipe: మొబైల్ ఫోన్‌తో వైద్యులు తీసిన సినిమా... ప్రశంసలు అందుకుంటోంది

The wrong swipe: మొబైల్ ఫోన్‌తో వైద్యులు తీసిన సినిమా... ప్రశంసలు అందుకుంటోంది

Prabhas: 'సలార్' సినిమా రీషూటింగ్.. ఇంటర్వెల్ ఎపిసోడ్ పై స్పెషల్ ఫోకస్.. 

Prabhas: 'సలార్' సినిమా రీషూటింగ్.. ఇంటర్వెల్ ఎపిసోడ్ పై స్పెషల్ ఫోకస్.. 
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Weather Updates: అల్పపీడనంగా మారిన వాయుగుండం.. ఏపీలో మరో రెండు రోజులు ఓ మోస్తరు వర్షాలు

Weather Updates: అల్పపీడనంగా మారిన వాయుగుండం.. ఏపీలో మరో రెండు రోజులు ఓ మోస్తరు వర్షాలు

Spirituality: చేయి నాకి నాకి తింటున్నారా.. మీకు ఆ వ్యామోహం చాలా ఎక్కువట..

Spirituality: చేయి నాకి నాకి తింటున్నారా.. మీకు ఆ వ్యామోహం చాలా ఎక్కువట..

Gold-Silver Price: నేడు స్థిరంగా బంగారం ధర.. వెండి స్వల్పంగా పెరుగుదల.. మీ ప్రాంతంలో నేటి ధరలివీ..

Gold-Silver Price: నేడు స్థిరంగా బంగారం ధర.. వెండి స్వల్పంగా పెరుగుదల.. మీ ప్రాంతంలో నేటి ధరలివీ..

Highest YouTube Subscribers: భారతీయ యూట్యూబ్ చానెల్ ప్రపంచ రికార్డు.. ఏకంగా 200 మిలియన్ సబ్‌స్కైబర్లు!

Highest YouTube Subscribers: భారతీయ యూట్యూబ్ చానెల్ ప్రపంచ రికార్డు.. ఏకంగా 200 మిలియన్ సబ్‌స్కైబర్లు!