అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Karthikeya 2 Movie Release Date: 'కార్తికేయ2' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
కార్తికేయ 2 షూటింగ్ మొదలయ్యిన దగ్గర నుంచి సామాన్య ప్రేక్షకుల్లో, సినిమా ప్రముఖుల్లో ఆసక్తి నెలకొంది.
![Karthikeya 2 Movie Release Date: 'కార్తికేయ2' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ Nikhil Siddhartha's Karthikeya 2 Movie To Release on July 22 Worldwide Karthikeya 2 Movie Release Date: 'కార్తికేయ2' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/11/2c8f359f4caf8a91792961ca341b7e98_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
'కార్తికేయ2' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
ఎనర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్.. చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయకి సీక్వెల్ గా వస్తున్న 'కార్తికేయ 2' షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా జులై 22 న విడుదల చేస్తున్నారు. కమర్షియల్ చిత్రాలతో పాటు విభిన్నమైన కథలతో నిర్మాణాన్ని కొనసాగిస్తూ విజయాలు సొంతం చేసుకుంటున్న క్రేజీ నిర్మాణ సంస్థలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్ పై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
కార్తికేయ 2 షూటింగ్ మొదలయ్యిన దగ్గర నుంచి సామాన్య ప్రేక్షకుల్లో, సినిమా ప్రముఖుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో ముగ్ధ పాత్రలో అనుపమ పరమేశ్వరన్.. నిఖిల్ కి జంటగా నటిస్తుంది. . ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. Saviours Emerge in crisis అంటూ ఆ మధ్య విడుదలైన నిఖిల్ బర్త్ డే పోస్టర్‌లో ఉన్న మ్యాటర్ ఆకట్టుకుంది.
అదే విధంగా తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో ఇంట్రస్టింగ్ థింగ్ ఏంటంటే డాక్టర్ కార్తికేయ ప్రయాణం. శ్రీకృష్టుడి చరిత్రకి సంబంధించిన ద్వారక, ద్వాపర యుగంలో జరిగింది. ఇప్పటికి ఆ లింక్ లో కార్తికేయ శ్రీ కృష్ణుడి గురించి వెతికే ఒక ప్రయాణం.శ్రీ కృష్ణుడు ఆయనకి సంబందించిన కథలో డాక్టర్ కార్తికేయ అన్వేషణగా శ్రీకృష్ణుడు చరిత్రలోకి ఎంటరవుతూ కనిపిస్తున్నాడు. ఈ చిత్రంలోని భావాన్ని ఈ పోస్టర్ ద్వారా దర్శకుడు చందు మొండేటి ప్రేక్షకుల కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జులై 22న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్టైన్మెంట్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion