By: ABP Desam | Updated at : 30 Dec 2022 10:57 AM (IST)
Edited By: anjibabuchittimalla
Photo@Samanthaprabhu2/twitter
దక్షిణాదిలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత, టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా పలు సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతోంది. పలు వెబ్ సిరీస్ లతోనూ ఆకట్టుకుంది. తాజాగా ‘యశోద’ సినిమాలో ప్రేక్షకులను అలరించింది. ఈ ముద్దుగుమ్మ గత కొంత కాలంగా అరువైన వ్యాధితో బాధపడుతోంది. ఈ నేపథ్యంలో సినిమాలకు దూరంగా ఉంటూ విరామం తీసుకుంటోంది. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
కొద్ది రోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్న సమంత.. తాజాగా ఇన్ స్టాలో ఓ పోస్టు పెట్టింది. న్యూ ఇయర్ సందర్భంగా ఫ్యాన్స్ కు శుభాకాంక్షలు చెప్పింది. అంతేకాకుండా, పలు కీలక విషయాలను వెల్లడించింది. “మీరు కంట్రోల్ చేయగలిగిన వాటినే చేసేందుకు ప్రయత్నించండి. సరికొత్త, సులభమైన లక్ష్యాల కోసం నిర్ణయాలు తీసుకోండి. అందుకు ఇదే సరైన సమయం అని గుర్తుంచుకోండి. మనకు సాధ్యమయ్యే లక్ష్యాలను ముందుగానే నిర్దేశించుకోండి. ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడూ మీకు ఉంటాయని మర్చిపోకండి. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు” అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆమెకు నెటిజన్లు శుభాకాంక్షలు చెప్తున్నారు. చాలా మంది ఆమె ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు. వీలైనంత త్వరగా అనారోగ్యం నుంచి కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
సమంత చివరి సారిగా ‘యశోద’ సినిమాలో కనిపించింది. ఇందులో తను సరోగసీ మదర్ గా కనిపించింది. సరోగసీ పేరిట జరుగుతున్న మోసాలను బయటపెట్టే పాత్రలో నటించింది. ఈ సినిమా యా. సమంత నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. హరి, హరీష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం నవంబర్ 11న విడుదలై మంచి వసూళ్లు సాధించింది. ‘యశోద’ సినిమా తర్వాత సమంతా ‘ఖుషి’ సినిమాలో నటిస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. మయోసైటిస్ తో బాధపడుతున్న సమంత షూటింగ్ కు దూరంగా ఉంటోంది. ఆమె వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత సినిమాలపై ఫోకస్ పెట్టే అవకాశం ఉంది.
Read Also: పూజా హెగ్డే లైఫ్ స్టైల్ ఇదే, సముద్ర తీరంలో ఇల్లు, అదిరిపోయే కార్లు - ఇంకా ఎన్నో!
Vani Jayaram Death : వాణీ జయరామ్ తలపై గాయం నిజమే - మృతిపై ఇంకా వీడని మిస్టరీ
Prabhas Mahesh Akhil : 'పోకిరి', 'బాహుబలి' మేజిక్ రిపీట్ అవుతుందా? - ఇండస్ట్రీ హిట్ మీద కన్నేసిన అఖిల్
Vijay Devarakonda : విజయ్ దేవరకొండ అభిమానులకు గుడ్ న్యూస్ - 'ఖుషి' ఖుషీగా...
VBVK Trailer : విడుదలకు ముందు లాభాల్లో 'వినరో'
Salim Khan Marriage: పెళ్లి కోసం పేరు మార్చుకున్న సల్మాన్ తండ్రి, సలీం ఖాన్ శంకర్ గా ఎలా మారారో తెలుసా?
Cake Recipe: ఇడ్లీ పిండి మిగిలిపోయిందా? ఇలా టేస్టీ కేక్ తయారు చేసేయండి
Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!
Peddagattu Jatara 2023 Effect: హైదరాబాద్ - విజయవాడ హైవేపై ఈ నెల 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు ఇలా
Kotamreddy Security: కోటంరెడ్డికి ఏపీ సర్కార్ షాక్, సెక్యూరిటీ సగానికి తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ