అన్వేషించండి

New theatres and OTT Releases: ‘ఆదిపురుష్’ TO ‘ది ఫ్లాష్’- ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో సందడి చేసే సినిమాలు ఇవే!

ఈ వారం థియేటర్లలో భారీ బడ్జెట్ సినిమాలు సందడి చేయబోతున్నాయి. ఓటీటీ వేదికగా పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి.

వారం థియేటర్లలో ‘ఆది పురుష్’, ‘ది ఫ్లాష్’ లాంటి ప్రతిష్టాత్మక చిత్రాలతో పాటు మరికొన్ని సినిమాలు థియేటర్లలో విడుదలకాబోతున్నాయి. ఓటీటీలోనూ పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు విడుదలకు రెడీ అవుతన్నాయి. ఇంతకీ ఈ వారం ఓటీటీ, థియేటర్లలో సందడి చేయబోయే సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం..   

థియేటర్లలో విడుదలయ్యే సినిమాలివే!

ఆదిపురుష్’-  జూన్ 16న విడుదల

ప్రభాస్ హీరోగా నటిస్తున్న'ఆదిపురుష్' చిత్రం జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సినిమా కోసం యావత్ నీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా కథ అందరికీ తెలిసిందే అయినా ప్రజెంట్ ఉన్న జనరేషన్ కి తగ్గట్టు మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాని తెరకెక్కించాడు. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ అనే ఈ కొత్త ఫార్మేట్ ఎలా ఉంటుందో చూడాలని అటు ఆడియన్స్ లో ఎంతో ఆసక్తి నెలకొంది. రామాయణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో కనిపిస్తుండగా, కృతి సనన్ సీతగా నటిస్తోంది. అలాగే లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవదత్త నగే, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. రెట్రో ఫైల్ సమర్పణలో టి సిరీస్ బ్యానర్ పై అగ్ర నిర్మాత భూషణ్ కుమార్ సుమారు రూ.550 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాని నిర్మించారు. 

బొమ్మై’(తమిళ చిత్రం) – జూన్ 16న విడుదల

ప్రముఖ నటుడు ఎస్‌జే సూర్య, హీరోయిన్‌ ప్రియా భవానీ శంకర్‌ జంటగా నటించిన చిత్రం ‘బొమ్మై’. ‘మాన్‌స్టర్‌’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఈ జంట కలిసి నటించిన మరో చిత్రం ‘బొమ్మై’.  వైవిధ్య భరిత కథా చిత్రాల దర్శకుడు రాధామోహన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఏంజెల్‌ స్టూడియో పతాకంపై వి.మారుడు పాండియన్‌, డాక్టర్‌ జాస్మిన్‌ సంతోష్‌, డాక్టర్‌ దీప డి.దురై కలిసి నిర్మించారు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతాన్ని అందించారు. రిచర్డ్‌ ఎం.నాథన్‌ సినిమాటోగ్రఫీ చేశారు. ఇందులో నటి చాందిని, డౌట్‌ సెంథిల్‌, ఆరోల్‌ శంకర్‌ ముఖ్యపాత్రలు పోషించారు. రొమాంటిక్‌, సైకలాజికల్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 16వ విడుదలకానుంది.   

ది ఫ్లాష్’(హాలీవుడ్ మూవీ)- జూన్ 15న విడుదల

డీసీ, వార్నర్ బ్రదర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో ‘ది ఫ్లాష్’ అనే సూపర్ హీరో సినిమా రాబోతుంది. డీ’సీ ఎక్స్‌ టెండెడ్ యూనివ‌ర్స్’ అనే సినిమాకు కొన‌సాగింపుగా వ‌స్తున్న ఈ చిత్రానికి అండీ ముషియెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి మేక‌ర్స్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌గా రికార్డు స్థాయిలో వ్యూస్ తో దూసుకుపోతోంది. ఈ ట్రైలర్ లో హ‌నుమంతుడు కనిపించడం విశేషం. ఎజ్రా మిల్ల‌ర్ సూప‌ర్ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రంలో.. ఒక‌ప్పుడు హాలీవుడ్ బ్యాట్‌మ్యాన్‌గా వెలుగొందిన‌ మైఖ‌ల్ కీట‌న్ మ‌ళ్లీ బ్యాట్‌మ్యాన్‌గా అల‌రించ‌నున్నాడు. ప్రపంచవ్యాప్తంగా డీసీ మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా జూన్ 16న వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్ కానుంది.

OTTలో విడుదలయ్యే సినిమాలు, వెబ్ సిరీస్ లు

అమెజాన్ ప్రైమ్ వీడియో:

జీ కర్దా(హిందీ వెబ్ సిరీస్) – జూన్ 15న విడుదల

నెట్‌ ఫ్లిక్స్:

ఎక్సట్రాక్షన్ 2 (హాలీవుడ్ మూవీ)– జూన్ 16 న విడుదల

డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్:

సైతాన్(తెలుగు వెబ్ సిరీస్) – జూన్ 15 న విడుదల

బిచ్చగాడు-2 (సినిమా) - జూన్ 17

జియో సినిమా:

ఐ లవ్ యు(హిందీ చిత్రం) – జూన్ 16 న విడుదల

ETV విన్:

‘కనులు తెరిచిన కనులు మూసినా’(తెలుగు సినిమా) – జూన్ 16 న విడుదల

Sony Liv:

ఫర్హాన (తెలుగు) - జూన్ 16

Read Also: విషాదంలో సాయి ధరమ్ తేజ్ - ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్, స్పందించిన మనోజ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
Nitish Records Alert: ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
Jio Airtel Best Plans: కాలింగ్, ఎస్ఎంఎస్‌తో పాటు ఓటీటీ యాప్స్ కూడా - జియో, ఎయిర్‌టెల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
కాలింగ్, ఎస్ఎంఎస్‌తో పాటు ఓటీటీ యాప్స్ కూడా - జియో, ఎయిర్‌టెల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
Embed widget