Aditi Gautam marriage: వైభవంగా ‘నేనింతే’ హీరోయిన్ వివాహం, వరుడు ఎవరో తెలుసా?
రవితేజ నటించిన ‘నేనింతే’ సినిమాలో హీరోయిన్ గా నటించిన శియా గౌతమ్ పెళ్లిపీటలెక్కింది. ముంబైకు చెందిన వ్యాపారవేత్తతో ఆమె వివాహం వైభవంగా జరిగింది. ఆమె పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్ అవతున్నాయి.
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు నటీనటులు వరుసగా పెళ్లి పీటలెక్కుతున్నారు. ముఖ్యంగా హీరోయిన్ లు పెళ్లి బంధంతో కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా హీరోయిన్ శియా గౌతమ్ కూడా వివాహం చేసుకుంది. చాలా మందికి శియా గౌతమ్ అంటే అంతగా గుర్తురాకపోవచ్చు. రవితేజ నటించిన ‘నేనింతే’ సినిమాలో హీరోయిన్ గా నటించింది శియా. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2008లో విడుదలై హిట్ టాక్ ను అందుకుంది. ఈ మూవీలో హీరోయిన్ గా చేసిన శియా గౌతమ్ కు కూడా మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఈ సినిమా తర్వాత ఆమె పెద్దగా సినిమాల్లో నటించలేదు. తాజాగా ఆమె వివాహం చేసుకుంది. దీంతో ఆమె పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
శియా గౌతమ్ అసలు పేరు అధితి గౌతమ్. ఈమె ముంబై లో పుట్టి పెరిగింది. రవితేజ నటించిన ‘నేనింతే’ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఈ మూవీ తర్వాత దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన ‘వేదం’ మూవీలో కనిపించింది. అయితే ఈ మూవీ తర్వాత ఆమెకు అంతగా అవకాశాలు దక్కలేదు. క్రమేపీ ఆమె తెలుగు సినిమాలకు దూరమైంది. ఇక తెలుగులో లాభం లేదని హిందీ, కన్నడ భాషల్లో నటించిందీ బ్యూటీ. అయితే అక్కడ కూడా అంతగా గుర్తింపు రాలేదు. కొన్నాళ్ల తర్వాత తెలుగులో గోపిచంద్ నటించిన ‘పక్కా కమర్షియల్’ సినిమాలో ఓ పాత్రలో మెరిసింది. ఇటీవల ముంబైకు చెందిన నికిల్ పాల్కేవాలా అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది.
వీరి వివాహానికి సినీ ఇండస్ట్రీ నుంచి పలువురు సెలబ్రెటీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. నటి ప్రియమణి దంపతులు శియా పెళ్లికి హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఈ పెళ్లి వేడుకతో పాటు సంగీత్, మెహందీ వేడుకలను కూడా వైభవంగా నిర్వహించారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను శియా తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అవి చూసిన నెటిజన్స్ కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతూ కామెంట్లు పెడుతున్నారు.
Also Read : ఇళయరాజా సంగీతంలో ధనుష్ పాట - కమెడియన్ హీరోగా వస్తున్న సీరియస్ సినిమా కోసం
View this post on Instagram