News
News
X

Waltair Veerayya Songs : శృతితో చిరు మరో మెలోడీ - ఆమెకు అందం, ఆయనకు తొందర ఎక్కువ

Neekemo Andamekkuva Song - Waltair Veerayya Movie : 'వాల్తేరు వీరయ్య'లో మరో పాట మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

FOLLOW US: 
Share:

'నువ్వు సీతవైతే నేను రాముడిని అంట... నువ్వు రాధావైతే నేను కృష్ణుడిని అంట'' అంటూ ''నువ్వు శ్రీదేవి అయితే నేను చిరంజీవంటా!'' శ్రుతీ హాసన్‌తో పాటలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) స్టెప్పులు వేశారు. 'వాల్తేరు వీరయ్య' సినిమాలో వాళ్ళిద్దరి మధ్య సాంగ్ అదొక్కటే కాదు, మరొకటి ఉంది. మరికొన్ని గంటల్లో ఆ పాట ప్రేక్షకుల ముందుకు రానుంది. 

నీకేమో అందం ఎక్కువ... 
నాకేమో తొందర ఎక్కువ!
Waltair Veerayya 5th Single : 'వాల్తేరు వీరయ్య' నుంచి ఇప్పటి వరకు నాలుగు పాటలు విడుదల చేశారు. 'బాస్ పార్టీ...' పాటను అన్నిటి కంటే ముందు విడుదల చేశారు. 40 మిలియన్స్ ప్లస్ వ్యూస్ వచ్చాయి. చిరంజీవి, రవితేజపై తెరకెక్కించిన 'పూనకాలు లోడింగ్...', 'వాల్తేరు వీరయ్య' టైటిల్ సాంగ్స్ కూడా ఆకట్టుకున్నాయి. 'నువ్వు శ్రీదేవి, చిరంజీవి' సాంగ్ ఒకటి. ఇప్పుడు ఐదో పాట విడుదలకు సమయం ఆసన్నమైంది.
 
'నీకేమో అందం ఎక్కువ... నాకేమో తొందర ఎక్కువ' అంటూ సాగే పాటను జనవరి 11న... అనగా బుధవారం ఉదయం 10.35 గంటలకు విడుదల చేయనున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది. సాంగ్ స్టిల్ కూడా విడుదల చేశారు. అందులో శ్రుతీ హాసన్ మోడ్రన్ లుక్‌లో, చిరంజీవి మాస్ లుక్‌లో కనిపించారు.

Also Read : '3Cs' వెబ్ సిరీస్ రివ్యూ : అమ్మాయిలు డ్రగ్స్ కలిపిన వోడ్కా తాగి, ఆ 'హ్యాంగోవర్'లో రచ్చ చేస్తే?

View this post on Instagram
 
A post shared by Mythri Movie Makers (@mythriofficial)

అంచనాలు పెంచిన ట్రైలర్
మెగా అభిమానులు చిరంజీవిని ఏ విధంగా చూడాలని కోరుకుంటారో... ఆ విధంగా తన అభిమాన కథానాయకుడిని ప్రేక్షకులకు చూపించే ఉద్దేశంతో 'వాల్తేరు వీరయ్య'ను దర్శకుడైన మెగాభిమాని బాబీ కొల్లి (కె.ఎస్. రవీంద్ర) తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. వింటేజ్ చిరును గుర్తు చేసేలా ఆయన కామెడీ సీన్స్, యాక్షన్ సీక్వెన్సులు డిజైన్ చేశారు. ఆల్రెడీ విడుదలైన ట్రైలర్ అంచనాలు పెంచింది. 

'మాస్ అనే పదానికి బొడ్డు కోసి పేరెట్టింది ఆయన్ను చూసి...' చిరంజీవి గురించి ఓ క్యారెక్టర్ చెప్పే డైలాగ్, 'రికార్డుల్లో నా పేరు ఉండటం కాదు, నా పేరు మీద రికార్డులు ఉంటాయి' అని మెగాస్టార్ చెప్పే మాట అభిమానులకు మాంచి కిక్ ఇచ్చేలా ఉన్నాయి. చిరంజీవి, రవితేజ మీద కట్ చేసిన కొన్ని షాట్లు బావున్నాయి. ఫుల్ మాస్ మీల్స్ సినిమాలా ఉంది... ట్రైలర్ చూస్తుంటే! థియేటర్లలో సినిమా చూసే అభిమానులకు మెగా మాస్ పూనకాలే!

ట్రైలర్ చివర్లో 'హలో మాష్టారు! ఫేస్ కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి. ఒక్కొక్కడికి బాక్సులు బద్దలైపోతాయి' అని రవితేజ వార్నింగ్ ఇవ్వడం... 'ఏంట్రా బద్దలయ్యేది? ఈ సిటీకి నీలాంటి కమీషనర్లు ఎంతో మంది వస్తారు, పోతారు. కానీ, వీరయ్య లోకల్' అని చిరంజీవి కౌంటర్ ఇవ్వడం హైలైట్. థియేటర్లలో ఈ సన్నివేశాలకు అభిమానులకు మెగా మాస్ పూనకాలే!

అభిమానులను మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథ, కథనం 'వాల్తేరు వీరయ్య' సినిమాలో ఉన్నాయని బాబీ చెప్పారు. లాక్‌డౌన్‌లో వరల్డ్ సినిమా, ఓటీటీలకు అలవాటు పడ్డ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా కథ రాయడంతో రవితేజ క్యారెక్టర్ యాడ్ అయ్యిందని చెప్పారు.  

Also Read : లోకేష్‌ను కలిసిన నందమూరి తారకరత్న - ఎమ్మెల్యే టికెట్ విషయమై చర్చలు?

ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవి శంకర్ నిర్మించారు. చిత్ర దర్శకుడు బాబీ కథ, మాటలు రాయగా... స్క్రీన్‌ప్లే : కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి అందిస్తున్నారు. హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : ఆర్థర్ ఎ విల్సన్, ఎడిటర్: నిరంజన్‌ దేవరమానె, ప్రొడక్షన్‌ డిజైనర్: ఎఎస్‌ ప్రకాష్‌, కాస్ట్యూమ్ డిజైనర్: సుష్మిత కొణిదెల, సహ నిర్మాతలు: జీకే మోహన్, ప్రవీణ్ ఎం.
Published at : 10 Jan 2023 01:23 PM (IST) Tags: Devi Sri Prasad Shruti Haasan Chiranjeevi Neekemo Andamekkuva Song Waltair Veerayya Review

సంబంధిత కథనాలు

మొన్న బాలకృష్ణ, నేడు చిరంజీవి - వివాదాలకు కేరాఫ్ గా సక్సెస్ మీట్లు? ఇంతకీ ఏమైంది?

మొన్న బాలకృష్ణ, నేడు చిరంజీవి - వివాదాలకు కేరాఫ్ గా సక్సెస్ మీట్లు? ఇంతకీ ఏమైంది?

Rakhi Sawant Mother Death: రాఖీ సావంత్ తల్లి జయ భేదా కన్నుమూత - ఇక ఎవరు నన్ను హగ్ చేసుకుంటారంటూ భావోద్వేగం

Rakhi Sawant Mother Death: రాఖీ సావంత్ తల్లి జయ భేదా కన్నుమూత - ఇక ఎవరు నన్ను హగ్ చేసుకుంటారంటూ భావోద్వేగం

Ajith Kumar’s AK62 Movie: అజిత్ సినిమా నుంచి దర్శకుడు విఘ్నేష్ శివన్ ఔట్? కారణం అదేనా?

Ajith Kumar’s AK62 Movie: అజిత్ సినిమా నుంచి దర్శకుడు విఘ్నేష్ శివన్ ఔట్? కారణం అదేనా?

Chiranjeevi - Ram Charan: రామ్ చరణ్ స్థానంలో నేనే ఉన్నంత గర్వంగా ఉంది: చిరంజీవి

Chiranjeevi - Ram Charan: రామ్ చరణ్ స్థానంలో నేనే ఉన్నంత గర్వంగా ఉంది: చిరంజీవి

Pawan Kalyan New Movie: పవర్ స్టార్ అభిమానులకు సూపర్ న్యూస్, పవన్ - సుజిత్‌ మూవీ షూటింగ్ డేట్ ఫిక్స్!

Pawan Kalyan New Movie: పవర్ స్టార్ అభిమానులకు సూపర్ న్యూస్, పవన్ - సుజిత్‌ మూవీ షూటింగ్ డేట్ ఫిక్స్!

టాప్ స్టోరీస్

Australian Open 2023: 2023ను రికార్డుతో మొదలెట్టిన ‘జోకర్’ - పదో ఆస్ట్రేలియన్ ఓపెన్ సొంతం!

Australian Open 2023: 2023ను రికార్డుతో మొదలెట్టిన ‘జోకర్’ - పదో ఆస్ట్రేలియన్ ఓపెన్ సొంతం!

Nellore Rural MLA: నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు ! వైసీపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

Nellore Rural MLA: నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు ! వైసీపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

Gujarat Junior Clerk Exam Cancel: హైదరాబాద్‌లో పేపర్ లీకేజీ కలకలం, జూనియర్ క్లర్క్ ఎగ్జామ్ రద్దు చేసిన గుజరాత్

Gujarat Junior Clerk Exam Cancel: హైదరాబాద్‌లో పేపర్ లీకేజీ కలకలం, జూనియర్ క్లర్క్ ఎగ్జామ్ రద్దు చేసిన గుజరాత్

BRS Parliamentary Party Meeting: బీఆర్ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ భేటీ - ముఖ్యంగా ఆ విషయాలపైనే ఫోకస్ !

BRS Parliamentary Party Meeting: బీఆర్ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ భేటీ - ముఖ్యంగా ఆ విషయాలపైనే ఫోకస్ !