NBK107: బాలయ్యతో గోపీచంద్ సినిమా - 'అఖండ' సెంటిమెంట్ రిపీట్?
బాలయ్య సినిమాను ముందుగా దసరా కానుకగా విడుదల చేయాలనుకున్నారు. అయితే ఇప్పుడు రిలీజ్ విషయంలో 'అఖండ' సెంటిమెంట్ ఫాలో అవ్వాలనుకుంటున్నారట.
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్స్ ను, టీజర్ ను విడుదల చేశారు. ఇందులో బాలయ్య మాస్ అవతార్ కి అభిమానులు ఫిదా అయిపోయారు. ఈ సినిమాతో బాలయ్య మరో హిట్ అందుకోవడం ఖాయమని నమ్ముతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. త్వరలోనే టర్కీలో ఓ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ వార్త వెలుగులోకి వచ్చింది. ముందుగా ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయాలనుకున్నారు. అయితే ఇప్పుడు రిలీజ్ విషయంలో 'అఖండ' సెంటిమెంట్ ఫాలో అవ్వాలనుకుంటున్నారట. దాని ప్రకారం 'అఖండ' సినిమా విడుదలైన రోజున డిసెంబర్ 2నే ఈ సినిమాను కూడా విడుదల చేయాలనుకుంటున్నారు. అఫీషియల్ గా టైటిల్ తో పాటు రిలీజ్ డేట్ ని ప్రకటించే ఛాన్స్ ఉంది.
ముందు అనుకున్నట్లుగా దసరా నాటికి సినిమా రెడీ అయ్యే అవకాశం లేదట. బాలయ్యకి కరోనా వచ్చి షూటింగ్ కి బ్రేక్ పడడం, అమెరికాలో జరగాల్సిన షూటింగ్ వీసా కారణంగా టర్కీకి షిఫ్ట్ చేయడం ఇలా పలు కారణాల వలన షూటింగ్ ఆలస్యమవుతోంది. అయితే ఎలా లేదన్నా అక్టోబర్ లోపు షూటింగ్ పూర్తి చేసి రెండు నెలల పాటు ప్రమోషన్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇంకా లాల్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు.
Also Read: ఓ అబ్బాయికి లవ్ లెటర్ రాశానని చితకబాదారు - సాయిపల్లవి కామెంట్స్
View this post on Instagram