Annapoorani OTT Release : ఓటీటీలోకి నయన్ కొత్త మూవీ, ‘అన్నపూరణి’లో ఆ డైలాగులు ఉండేనా?
Annapoorani OTT Release : నయనతార లేటెస్ట్ మూవీ ‘అన్నపూరణి’ ఓటీటీలోకి రాబోతోంది. నెల రోజులు కాకముందే స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది.
Annapoorani Movie OTT Release: సౌత్ సినిమాల్లో లేడీ సూపర్ స్టార్ నయనతార వరుస సినిమాలతో కెరీర్ సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తోంది. ‘జవాన్’ మూవీతో దేశ వ్యాప్తంగా అద్భుత విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ, తాజాగా ‘అన్నపూరణి’ అనే సినిమాలో నటించింది. నయన్ కెరీర్‌లో 75వ సినిమాగా ఈ చిత్రం రూపొందింది. నీలేష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో జై, కేసీ రవికుమార్, సత్యరాజ్, అచ్యుత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. ‘ది గాడెస్ ఆఫ్ టేస్ట్’ అనే ట్యాగ్ లైన్ తో రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ కేవలం తమిళంలో మాత్రమే విడుదలయ్యింది. థియేటర్లలో ప్రేక్షకులను చక్కగా ఆకట్టుకుంది.
నెట్ ఫ్లిక్స్ వేదికగా ‘అన్నపూరణి’ స్ట్రీమింగ్
ఇక నయనతార కెరీర్ లో ల్యాండ్ మార్క్ మూవీగా రూపొందిన 'అన్నపూరణి’, థియేటర్‌లో విడుదలై నెల రోజులు కాకముందే ఓటీటీలోకి అడుగు పెట్టబోతోంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ వేదికగా ప్రేక్షకులకు అందుబాటులోకి రాబోతోంది. తాజాగా మూవీ స్ట్రీమింగ్ డేట్ ను కూడా ప్రకటించింది నెట్ ఫ్లిక్స్. ఈ నెల 29న విడుదల అవుతుందని వెల్లడించింది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషాల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపింది. ఈ ప్రకటనతో నయనతార అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. థియేటర్లలో చూడని ప్రేక్షకులు ఓటీటీలో చూసేందుకు సిద్ధం అవుతున్నారు. సంప్రదాయ కుటుంబానికి చెందిన అమ్మాయి.. నాన్ వెబ్ రెస్టారెంట్ పెట్టుకోవాలనుకున్న తన కలను ఎలా నెరవేర్చుకుంది అనే కథతో ఈ సినిమా తెరకెకింది.
Unga vayirum manasum neraika oru delicious movie oda varanga namma Lady Superstar😍#Annapoorani is coming to Netflix on 29 Dec in Tamil, Telugu, Malayalam, Kannada and Hindi.#AnnapooraniOnNetflix pic.twitter.com/py82y1imn4
— Netflix India South (@Netflix_INSouth) December 24, 2023
వివాదంలో 'అన్నపూరణి’ చిత్రం
'అన్నపూరణి’ సినిమా పలు వివాదాలకు కారణం అయ్యింది. ఈ చిత్రంలో బ్రాహ్మణ కమ్యూనిటీని కించపరిచేలా అంశాలు ఉన్నాయని సదరు కుల సంఘాలు ఆరోపించాయి. నయనతార బ్రాహ్మణ అమ్మాయిగా కనిపిస్తుండగా.. తనకు జంటగా నటించిన జై ముస్లీం అబ్బాయి పాత్రలో నటించాడు. అటు ‘దేవుడికి ప్రసాదం అందించేవాడి కూతురు.. అదే సమయంలో మాంసం వండుతుంది అని తెలిస్తే.. భక్తులంతా ఏమనుకుంటారు’ అంటూ నయనతార తండ్రి చెప్పిన డైలాగ్.. పర్సనల్‌గా బ్రాహ్మణ కమ్యూనిటీని టార్గెట్ చేసినట్టుగా ఉంది. ఈ అంశం తమ మనోభావాలను దెబ్బ తీసిందని రాష్ట్రీయ హిందూ మహాసభ వెల్లడించింది. ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలని డిమాండ్ చేసింది. ఒకవేళ సినిమాను బ్యాన్ చేయకపోతే.. మేకర్స్‌పై కేసు ఫైల్ చేయడంతో పాటు థియేటర్లను కూడా బ్లాక్ చేస్తామని హెచ్చరించింది. హిందూ మతాన్ని టార్గెట్ చేసేలా సినిమాలు తెరకెక్కించడం కరెక్ట్ కాదని తేల్చి చెప్పింది. ఈ వివాదం నేపథ్యంలో సినిమాలోని కొన్ని డైలాగులు తొలగించినట్లు చిత్రబృందం తెలిపింది. ఓటీటీలో ఆ డైలాగులు ఉంటాయా? ఉండవా? అనేది ఆసక్తికరంగా మారింది.
Read Also: 'సరిహద్దులు చెరిగిపోతున్నాయి.. ఇండియన్ ఫిల్మ్ రేంజ్ పెరుగుతోంది' ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్