X

67th National Film Awards Winners List: జాతీయ పురస్కార విజేతలు... బాధ్యత పెంచిందన్న 'మహర్షి' దర్శకుడు

67th National Film Awards Winners Full List: 67వ జాతీయ చలన చిత్ర పురస్కారాల ప్రదానోత్సవం సోమవారం ఢిల్లీలో నిర్వహించారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా పలువురు పురస్కారాలు అందుకున్నారు. 

FOLLOW US: 

67వ జాతీయ చలన చిత్ర పురస్కారాల ప్రదానోత్సవం సోమవారం ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌ ఆడిటోరియంలో నిర్వహించారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా 2019వ సంవత్సరానికి గాను పలువురు పురస్కారాలు అందుకున్నారు.

మోహన్ లాల్ కథానాయకుడిగా ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన 'మరక్కార్: ద లయన్ ఆఫ్ అరేబియన్ సీ' ఉత్తమ చిత్రంగా నిలిచిన సంగతి తెలిసిందే. వంద కోట్లకు పైగా భారీ నిర్మాణ వ్యయంతో తెరకెక్కిన ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. కేరళలో పూర్తిస్థాయిలో థియేటర్లు తెరిచే వరకూ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు లేవు. ‘భోంస్లే’కి మనోజ్‌ బాజ్‌పాయి, ‘అసురన్’ (తెలుగులో 'నారప్ప'గా వెంకటేష్ రీమేక్ చేశారు) చిత్రానికి గాను ధనుష్‌... 67వ జాతీయ పురస్కారాల్లో ఉత్తమ నటుడిగా ఈ  ఇద్దరు పురస్కారం అందుకున్నారు. కంగనా రనౌత్ ఉత్తమ నటిగా నిలిచారు. ఝాన్సీ లక్ష్మీబాయి జీవితం ఆధారంగా రూపొందిన 'మణికర్ణిక', 'పంగా' చిత్రాలకు ఆమె అవార్డు అందుకున్నారు. ప్రముఖ కథానాయకుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ ను కేంద్ర ప్రభుత్వం 'దాదా సాహెబ్ ఫాల్కే' పురస్కారంతో సత్కరించింది.

మహేష్ బాబు కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన 'మహర్షి'కి ఉత్తమ వినోదాత్మక సినిమా, నృత్య దర్శకుడు... రెండు విభాగాల్లో అవార్డులు వచ్చాయి. ఎడిటింగ్ విభాగంలో నవీన్ నూలికి వచ్చిన పురస్కారంతో పాటు తెలుగులో ఉత్తమ సినిమాగా 'జెర్సీ'కి రెండు అవార్డులు వచ్చాయి. హిందీలో ఉత్తమ చిత్రంగా 'చిచ్చోరే', తమిళంలో ఉత్తమ సినిమాగా 'అసురన్' నిలిచాయి. పురస్కారం అందుకోవడానికి ముందు 'మహర్షి' నిర్మాత 'దిల్' రాజు, దర్శకుడు వంశీ పైడిపల్లి మీడియాతో మాట్లాడారు. 'మహర్షి'కి జాతీయ పురస్కారం రావడంతో తనపై బాధ్యత మరింత పెరిగిందని దర్శకుడు వంశీ పైడిపల్లి తెలిపారు. ఇటువంటి చిత్రాలు తీసే ప్రయత్నం చేయాలని, మంచి చిత్రాలు తీస్తూ ఉండాలని ఈ పురస్కారం గుర్తు చేస్తూ ఉంటుందని ఆయన చెప్పారు.
'దిల్' రాజు మాట్లాడినా "రైతులకు నగర ప్రజలు ఏ విధంగా సాయం చేయాలనే అంశంతో 'మహర్షి' తీశాం. మహేష్ బాబు కమర్షియల్ స్టార్. ఆయనకు తగ్గట్టు సినిమాలో పాటలు, ఫైట్లుతో దర్శకుడు వంశీ పైడిపల్లి చక్కటి సినిమా తీశాడు" అని అన్నారు.

దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ "లైఫ్ టైమ్ మెమరీ ఇది. మా చిత్రాన్ని గుర్తించి ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారాల్లో...  ఉత్తమ వినోదాత్మక చిత్రంగా ప్రకటించారు. పురస్కారం ఇస్తున్నారు. ఇంతకంటే ఎక్కువ ఏం అడగగలను? వినోదంతో పాటు సందేశం ఇవ్వడం సినిమాతో సాధ్యమవుతుంది. ఎక్కువమంది ప్రజలకు చేరువ అవుతుంది. మహేష్ బాబు లాంటి  సూపర్ స్టార్ తో సినిమా చేసినప్పుడు మరింతమంది చూస్తారు. మేం అదే చేశాం. గొప్ప సందేశాత్మక సినిమా తీశాం. భారత సంస్కృతి సాంప్రదాయాలు ఆధారపడిన వ్యవసాయం గురించి సినిమాలో చెప్పాం. అందువల్లే, ఈ రోజు మేం ఇక్కడ ఉన్నామని అనుకుంటున్నాను. నాకు ఒకరు ఫోన్ చేశారు. 'మహర్షి' విడుదలైన తర్వాత!  'టీచర్లు కొన్ని విషయాలు నేర్పుతారు. స్కూల్, కాలేజ్ కొన్ని విషయాలు నేర్పుతాయి. పేరెంట్స్ కొన్ని విషయాలు నేర్పుతారు. ఎవరూ అన్ని విషయాలు నేర్పరు. అదే సినిమా చెబితే... మనసులోకి వెళుతుంది' అని చెప్పారు. నాకు గొప్పగా అనిపించింది" అని అన్నారు.
67వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు అందుకున్న విజేతల వివరాలు:
చిత్రం: మరక్కర్: 'ద లయన్ ఆఫ్ అరేబియన్ సీ' (మలయాళం)
నటుడు: మనోజ్‌ బాజ్‌పాయి ('భోంస్లే'), ధనుష్‌ ('అసురన్‌')
నటి : కంగనా రనౌత్‌ ('మణికర్ణిక')
దర్శకుడు: సంజయ్‌ పూరన్‌ సింగ్‌ చౌహాన్‌ ('బహత్తర్‌ హూరైన్‌')
ఎడిటింగ్‌: నవీన్‌ నూలి ('జెర్సీ')
వినోదాత్మక చిత్రం: 'మహర్షి'
సహాయ నటి: పల్లవి జోషి('ది తాష్కెంట్‌ ఫైల్స్‌')
సహాయ నటుడు: విజయ్‌ సేతుపతి('సూపర్‌ డీలక్స్‌')
నృత్యదర్శకుడు: రాజు సుందరం ('మహర్షి')
సంగీత దర్శకుడు (స్వరాలు): డి. ఇమాన్‌ (విశ్వాసం)
సంగీత దర్శకుడు (నేపథ్య సంగీతం): ప్రబుద్ధ బెనర్జీ (జ్యేష్టపుత్రో)
గాయకుడు: బ్రి.ప్రాక్‌ ('కేసరి’-హిందీ)
గాయని: శావని రవీంద్ర (బర్దో-మరాఠీ)
మేకప్‌: రంజిత్‌ (హెలెన్‌)
యాక్షన్‌ కొరియోగ్రఫీ: 'అవనే శ్రీమన్నారాయణ' (కన్నడ సినిమా - తెలుగులో 'అతడే శ్రీమన్నారాయణ'గా విడుదలైంది)

Tags: Dil Raju Vamshi Paidipally 67th National Film Awards National Film Awards 2021 National Film Awards 2020 National Film Awards National Film Awards Live NFA Film Awards India 2021 67th Indian Film Awards Best Film India Best National Film India 67th National Film Awards Winners National Film Awards Winners List Vamshi Paidipally Speech At National Awards Dil Raju Speech At National Awards

సంబంధిత కథనాలు

Bigg Boss 5 Telugu: సన్నీ కాదు.. సిరి కాదు.. ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరంటే..?

Bigg Boss 5 Telugu: సన్నీ కాదు.. సిరి కాదు.. ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరంటే..?

Akhanda: 'బాలయ్య బాలయ్య.. ఇరగతీసావయ్యా..' బాబాయ్ పై ప్రేమ కురిపించిన కళ్యాణ్ రామ్.. 

Akhanda: 'బాలయ్య బాలయ్య.. ఇరగతీసావయ్యా..' బాబాయ్ పై ప్రేమ కురిపించిన కళ్యాణ్ రామ్.. 

Bigg Boss 5 Telugu: టాప్ 5 లో ఆ ముగ్గురూ కన్ఫర్మ్.. సిరి గెలిస్తే ఈక్వేషన్ మారుతుందా..?

Bigg Boss 5 Telugu: టాప్ 5 లో ఆ ముగ్గురూ కన్ఫర్మ్.. సిరి గెలిస్తే ఈక్వేషన్ మారుతుందా..?

Kangana Ranaut Update: 'నా వాహనంపై రైతులు దాడి చేశారు.. చంపేస్తామని వార్నింగ్ ఇచ్చారు'

Kangana Ranaut Update: 'నా వాహనంపై రైతులు దాడి చేశారు.. చంపేస్తామని వార్నింగ్ ఇచ్చారు'

Balakrishna & Mahesh : బాలకృష్ణ... మహేష్... షూటింగ్‌కు రెడీ! ఎప్పుడు? ఎక్కడ? అంటే...

Balakrishna & Mahesh : బాలకృష్ణ... మహేష్... షూటింగ్‌కు రెడీ! ఎప్పుడు? ఎక్కడ? అంటే...
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Samsung A73: శాంసంగ్ కొత్త 5జీ మొబైల్ వచ్చేస్తుంది.. 108 మెగాపిక్సెల్ కెమెరా కూడా!

Samsung A73: శాంసంగ్ కొత్త 5జీ మొబైల్ వచ్చేస్తుంది.. 108 మెగాపిక్సెల్ కెమెరా కూడా!

Jawad Cyclone: విశాఖకు 770 కి.మీటర్ల దూరంలో తుపాను... రేపు ఉదయం ఉత్తరాంధ్ర-ఒడిశా మధ్య తీరం దాటొచ్చు... ఏపీ విపత్తు నిర్వహణశాఖ ప్రకటన

Jawad Cyclone: విశాఖకు 770 కి.మీటర్ల దూరంలో తుపాను... రేపు ఉదయం ఉత్తరాంధ్ర-ఒడిశా మధ్య తీరం దాటొచ్చు... ఏపీ విపత్తు నిర్వహణశాఖ ప్రకటన

Govt FAQs on Omicron: ఒమిక్రాన్‌ వల్ల థర్డ్ వేవ్ వస్తుందా? టీకాలు పనిచేస్తాయా? ఇదిగో సమాధానాలు

Govt FAQs on Omicron: ఒమిక్రాన్‌ వల్ల థర్డ్ వేవ్ వస్తుందా? టీకాలు పనిచేస్తాయా? ఇదిగో సమాధానాలు

Pushpa Trailer Tease: నోటిలో బ్లేడుతో అనసూయ... బన్నీ బైక్ స్టంట్

Pushpa Trailer Tease: నోటిలో బ్లేడుతో అనసూయ... బన్నీ బైక్ స్టంట్