Naresh-Pavitra: భూమి బద్దలైనా, ఆకాశం ఊడిపడినా కలిసే ఉంటాం - పవిత్రతో ప్రేమపై నరేష్ వ్యాఖ్యలు
గత కొంత కాలంగా సోషల్ మీడియాను ఊపు ఊపేస్తున్నది పవిత్ర, నరేష్ జంట. లేటు వయసులో ఘాటు ప్రేమతో ఒక్కటి కాబోతున్నారు. తాజాగా వీరిద్దరు కలిసి ఓ షోలో పాల్గొన్నారు. స్టేజి మీదే ముద్దులతో రెచ్చిపోయారు.
సీనియర్ నటుడు నరేష్, ప్రముఖ నటి పవిత్రా లోకేష్ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం 'మళ్ళీ పెళ్లి'. ఎంఎస్ రాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. విజయ కృష్ణ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. నరేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నరేష్, పవిత్ర మధ్య ప్రేమయాణాన్ని 'మళ్ళీ పెళ్లి' పేరుతో వెండితెరపై చూపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్, ట్రైలర్ ఇదే విషయాన్ని కన్ఫామ్ చేస్తున్నాయి. త్వరలో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో నరేష్, పవిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.
ఓంకార్ షోలో రెచ్చిపోయిన నరేష్, పవిత్ర
తాజాగా నరేష్, పవిత్ర జంట ఓంకార్ షో ‘సిక్స్త్ సెన్స్’లో పాల్గొన్నారు. ఈ షోలో వీళ్లు చేసిన హంగామా మామూలుగా లేదు. ఒకరినొకరు హగ్ చేసుకోవడంతో పాటు ముద్దులు పెట్టుకుంటూ రెచ్చిపోయారు. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. వయసులో ఉన్న యువతీయువకులకు మించి వీళ్లిద్దరు ఆ షోలో రచ్చ చేశారు. మీ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటనే నరేష్ ను ఓంకార్ అడిగారు. “భూమి బద్దలైనా, ఆకాశం ఊడిపడినా, తామిద్దరం కలిసే ఉంటాం” అంటూ కుండబద్దలు కొట్టారు నరేష్. మీరు ముద్దుగా పవిత్రని ఏమని పిలుస్తారు? అని ఓంకార్ మరో ప్రశ్న అడుగతారు. “అమ్ములు అని పిలుస్తాను. ఇంకా ప్రేమ ఎక్కువైతే అమ్ము అంటాను. ఇంకా ప్రేమ ఎక్కువైతే వద్దులే. చెప్తే బాగోదు” అంటూ నవ్వుతారు. వీళ్లిద్దరు కలిసి ఫుల్ జోష్ గా గేమ్ ఆడారు. వీరిద్దరి యాక్టివ్ నెస్ ముందు కుర్రాళ్లు కూడా పనికి రారు అనే మాదిరిగా షో ఆడుతూ అలరించారు.
View this post on Instagram
కొంతకాలంగా డేటింగ్ చేస్తున్న నరేష్, పవిత్ర
గత కొంత కాలంగా నరేష్, పవిత్ర సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారారు. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేష్, ప్రస్తుతం పవిత్రా లోకేష్ తో డేటింగ్ చేస్తున్నారు. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరికొంత మంది మాత్రం కేవలం డేటింగ్ చేస్తున్నారని చెప్తున్నారు. ఎవరు ఏమనుకున్నా వీరిద్దరు కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు.
త్వరలోనే వీరిద్దరు కలిసి నటించిన ‘మళ్ళీ పెళ్లి’ సినిమా తెలుగు, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాలో జయసుధ, శరత్ బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వనితా విజయ్ కుమార్, అనన్య నాగెళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి స్వరాలు సమకూర్చగా, అరుల్ దేవ్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు.
Read Also: 'అన్నీ మంచి శకునములే' మూవీకి ‘ప్రాజెక్ట్ కె‘ సపోర్ట్ - అడగకుండానే ప్రజలకు సాయం, ఇదిగో వీడియో!