Naresh, Pavitra's Malli Pelli: కొత్త ట్విస్ట్ ఇచ్చిన నరేష్, పవిత్ర లోకేష్ - ఇదంతా ‘మళ్లీ పెళ్లి’ కోసమా?
టాలీవేడ్ సీనియర్ నటుడు నరేష్ రిలీజ్ చేసిన ఓ పోస్టర్ ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. అంతే కాదు ఆ పోస్టర్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఇంతకీ ఆ పోస్టర్ ఏంటనేగా మీ డౌట్..
టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినింపించిన పేర్లు సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్. గత కొన్ని నెలలుగా వీరి వ్యవహారం ఇండస్ట్రీలో చర్చనీయాంశమవుతూ వస్తోంది. ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకుంటారు అనే వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల నరేష్ విడుదల చేసిన వీడియో చూసి వీరిద్దరూ నిజంగానే మళ్లీ పెళ్లి చేసుకున్నారని అనుకున్నారంతా. అయితే తాజాగా నరేష్ రిలీజ్ చేసిన ఓ పోస్టర్ చూస్తే.. మొన్న జరిగింది పెళ్లి కాదా? మనల్నిఆయన మనల్ని ఫూల్స్ చేశారా అని అనిపించక మానదు. ఇంతకీ ఆ పోస్టర్ ఏంటనేగా మీ డౌట్? ఇటీవలే నరేష్-పవిత్ర లోకేష్ కలసి ఓ సినిమాలో నటించారు. అదే ‘మళ్లీ పెళ్లి’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు నరేష్.
ఇప్పటిదాకా చేసిందంతా పబ్లిసిటీ కోసమా?
ఇటీవలే ‘మళ్లీ పెళ్లి’ ఫస్ట్ లుక్, గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు మూవీ టీమ్. ఇందులో పవిత్ర లోకేష్ ముసిముసిగా నవ్వుతూ ముగ్గు వేస్తుంటే.. నరేష్ కొంటెగా చూస్తున్నట్టు పోస్టర్ లో కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో దీనిపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. అంటే ఇప్పటి వరకూ నరేష్ పెట్టిన ఫోటోలు, పెళ్లి వీడియోలు అన్నీ కేవలం సినిమా పబ్లిసిటీ కోసమా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి. మరో వైపు నరేష్ భార్య రమ్య రఘుపతి కూడా నరేష్, పవిత్రలపై ఆరోపణలు చేస్తూ ఉంది. ఇదిలా కొనసాగుతుండగానే గతేడాది నరేష్, పవిత్ర లోకేష్ కలసి త్వరలో కొత్త జీవితం ప్రారంభిస్తున్నట్లు ఓ రొమాంటిక్ వీడియోను పోస్ట్ చేశారు. అంతే కాదు కొన్నిరోజు తర్వాత నరేష్-పవిత్ర ల పెళ్లి అయిపోయినట్టు ఓ వీడియోను నరేష్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఇది చూసి అంతా షాక్ అయ్యారు. దీంతో నరేష్-పవిత్రల పెళ్లి అయిపోయిందని, హనీమూన్ కు కూడా వెళ్లిపోయారు అని వార్తలు గుప్పుమన్నాయి. తాజాగా ఈ వ్యవహారం చూసి అంతా షాక్ అయ్యారు. ఇలా కూడా పబ్లిసిటీ చేసుకుంటారా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకొంత మంది ఫన్నీగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
వేసవిలో నరేష్-పవిత్ర ‘మళ్లీ పెళ్లి’..
నరేష్, పవిత్ర ప్రధాన పాత్రలలో వస్తోన్న సినిమానే ఈ ‘మళ్లీ పెళ్లి’. ఈ సినిమాకు ఎం.ఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, కన్నడ బైలింగ్యువల్ సినిమాగా తీస్తున్నారు. ఇటీవలే మేకర్స్ ఇవాళ సినిమా ఫస్ట్ లుక్, గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీగా సినిమాను తెరకెక్కిస్తున్నారు మూవీ టీమ్. విజయ నిర్మల మరణించిన తర్వాత ఈ బ్యానర్ పై ఎలాంటి సినిమాలు చేయలేదు. ఇప్పుడు ఈ విజయకృష్ణ మూవీస్ బ్యానర్ లో నరేష్ 'మళ్లీ పెళ్లి' సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా వేసవి కానుకగా థియేటర్లలోకి రానుంది. మరి ఈ సినిమాలో నరేష్-పవిత్ర ఎలాంటి మ్యాజిక్ చేశారో చూడాలి.
Also Read : ఏయ్ పిల్లా - రవితేజ వారసుడి సినిమా ఆగింది!
A beautiful project to celebrate the glorious 50th anniversary of #VijayakrishnaMovies🤩
— H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) March 24, 2023
Here’s the 1st Look of my next #MattheMaduve ❤️
Kannada - https://t.co/6jOBbGUKSP
Directed by @MSRajuOfficial
Co-starring #PavitraLokesh😍
Summer 2023 Release!@VKMovies_ pic.twitter.com/pbxIgzQQZc