News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Nani 30 : నాని, మళ్ళీ కంఫర్ట్ జానర్‌లోకి - 'సీతారామం' భామతో

నాని 30వ సినిమాను నేడు వెల్లడించారు. ఈ సందర్భంగా న్యూ ఇయర్ విషెస్ చెబుతూ విడుదల చేసిన వీడియో చూస్తే... మళ్ళీ నేచురల్ స్టార్ కంఫర్ట్ జోన్ సినిమా చేస్తున్నట్లు ఉంది.

FOLLOW US: 
Share:

హీరో నాని (Nani Actor) లో మంచి నటుడు ఉన్నాడు. అందుకనే... అభిమానులు, తెలుగు సినిమా ప్రేక్షకులు ముద్దుగా నేచురల్ స్టార్ అని పిలుస్తారు. ఎటువంటి పాత్రలో అయినా సరే సహజంగా నటిస్తారని నానికి పేరు ఉంది. అయితే, ఆయన మాస్ రోల్స్ కంటే ఎమోషనల్ క్లాసీ రోల్స్‌లో నటించినప్పుడు మంచి మంచి విజయాలు వచ్చాయి. నాని ప్లస్ ఫీల్ గుడ్ ఫ్యామిలీ, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌ సూపర్ డూపర్ డెడ్లీ కాంబినేషన్. హీరోగా తొలి సినిమా 'అష్టా చమ్మా' నుంచి 'జెర్సీ', 'అంటే సుందరినికీ' వరకూ ఆయన చేసిన ఫ్యామిలీ ఫిల్మ్స్ హిట్టే. 

నాని 30 అనౌన్స్ చేశారోచ్
Happy New Year 2023, Nani 30 : న్యూ ఇయర్ సందర్భంగా ఈ రోజు నాని కొత్త సినిమా ప్రకటించారు. కథానాయకుడిగా ఆయన 30వ చిత్రమిది. హీరో హీరోయిన్, ఇతర కీలక టెక్నీషియన్ల వివరాలు చెబుతూ... ఓ వీడియో విడుదల చేశారు.
 
కెమెరామెన్‌గా నాని?
నాని ఒక భవనం పైన కూర్చుని ఫోటోలు క్లిక్ చేస్తున్నారు. ఆయన పక్కన ఓ చిన్న అమ్మాయి కూర్చుని ఉంది. వాళ్ళిద్దరి మధ్య సంభాషణ వింటే... సినిమాలో తండ్రీ కుమార్తెలుగా నటిస్తున్నారని ఈజీగా అర్థం అయిపోతుంది. వాళ్ళిద్దరి బాండింగ్ సినిమాలో హైలైట్ కానుందని తెలుస్తోంది.
 
'దసరా' కోసం నాని మీసాలు, గడ్డం పెంచారు. కొత్త సినిమాలో మీసం, గడ్డం ఉండవని... షేవ్ చేస్తానని నాని కన్ఫర్మ్ చేశారు. ఇది డిఫరెంట్ కాన్సెప్ట్‌తో కూడిన ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అని చిత్ర బృందం చెప్పింది. ఇందులో నాని కెమెరామెన్‌గా కనిపించనున్నారా? అంటే... ఫోటోలు తీస్తున్నారు కదా! ఇది నిజమా? కదా? అనేది తర్వాత తెలుస్తుంది.
 
నానికి జోడీగా మృణాల్ ఠాకూర్
నానికి జోడీగా ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ నటించనున్నారు. 'సీతా రామం' తర్వాత ఆమె నటిస్తున్న రెండో చిత్రమిది. హిందీలో మృణాల్ చాలా సినిమాలు చేశారు. అయితే, 'సీతా రామం'తో ఆమెకు ఎక్కువ పేరు వచ్చింది.

శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం1గా రూపొందుతోంది. చెరుకూరి వెంకట మోహన్ (సీవీయమ్), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, మూర్తి కెఎస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

జెర్సీ, శ్యామ్ సింగ రాయ్ తర్వాత... 
ఈ చిత్రానికి సాను జాన్ వర్గీస్ ఛాయాగ్రహకుడు. నానితో ఆయనకు మూడో చిత్రమిది. 'జెర్సీ', 'శ్యామ్‌ సింగ రాయ్' చిత్రాలకూ ఆయన పని చేశారు. ఆ రెండు సినిమాల్లో సినిమాటోగ్రఫీ వర్క్ బావుందని పేరు వచ్చింది.

Also Read : సమంత - స్వర్గం - ఆ రెండు ప్రశ్నలు, 2022లో సమంత లాస్ట్ పోస్ట్! 

మలయాళ సినిమా 'హృదయం'తో భాషలకు అతీతంగా ప్రేక్షకులు అందరినీ తన పాటలతో ఆకట్టుకున్న ప్రముఖ మలయాళ సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. ఆల్రెడీ విడుదల చేసిన అనౌన్స్‌మెంట్‌ వీడియోలో నేపథ్య సంగీతం బావుంది. ఈ చిత్రానికి కూర్పు : ప్రవీణ్ ఆంథోని, ప్రొడక్షన్ డిజైనర్ : జోతిష్ శంకర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సతీష్ ఈవీవీ, క్రియేటివ్ ప్రొడ్యూసర్ : భాను ధీరజ్ రాయుడు. 

Also Read : పూనకాలు లోడింగ్ అంటే ఇదేనేమో!? - నరేష్, పవిత్ర పెళ్లిపై రెచ్చిపోయిన మీమర్లు, బాబోయ్ ఆ ట్రోల్స్ చూశారా? 

Published at : 01 Jan 2023 05:33 PM (IST) Tags: Mrunal Thakur Hesham Abdul Wahab Nani 30 Nani 30 Announced

ఇవి కూడా చూడండి

Lokesh Kanagaraj Fight Club : ఫైట్​క్లబ్​తో వస్తున్న లోకేశ్ కనగరాజ్.. డైరక్టర్​గా మాత్రం కాదు

Lokesh Kanagaraj Fight Club : ఫైట్​క్లబ్​తో వస్తున్న లోకేశ్ కనగరాజ్.. డైరక్టర్​గా మాత్రం కాదు

Naga Panchami November 29th Episode : కరాళి ప్రాణత్యాగం.. రంగంలోకి ఫణేంద్ర.. పంచమికి అండగా సుబ్బు!

Naga Panchami November 29th Episode : కరాళి ప్రాణత్యాగం.. రంగంలోకి ఫణేంద్ర.. పంచమికి అండగా సుబ్బు!

Krishna Mukunda Murari November 29th Episode : గత జ్ఞాపకాల్లో మురారి ముకుందతో పెళ్లికి ఏర్పాట్లు.. ముహూర్తం ఫిక్స్‌!

Krishna Mukunda Murari November 29th Episode : గత జ్ఞాపకాల్లో మురారి ముకుందతో పెళ్లికి ఏర్పాట్లు.. ముహూర్తం ఫిక్స్‌!

Bigg Boss Telugu 7: గౌతమ్‌కు ప్రియాంక సపోర్ట్ - వెధవను అయిపోయాను అంటూ అమర్ సీరియస్

Bigg Boss Telugu 7: గౌతమ్‌కు ప్రియాంక సపోర్ట్ - వెధవను అయిపోయాను అంటూ అమర్ సీరియస్

Sandeep Reddy Vanga : ‘స్పిరిట్’ విడుదల తేదీని రివీల్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా!

Sandeep Reddy Vanga : ‘స్పిరిట్’ విడుదల తేదీని రివీల్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా!

టాప్ స్టోరీస్

Hyderabad Poll Queue Status: హైదరాబాద్ ఓటర్లకు గుడ్ న్యూస్, క్యూ లైన్లో ఎందరున్నారో ఇలా చెక్ చేసుకోండి

Hyderabad Poll Queue Status: హైదరాబాద్ ఓటర్లకు గుడ్ న్యూస్, క్యూ లైన్లో ఎందరున్నారో ఇలా చెక్ చేసుకోండి

Singanamala Politics: ఏపీలో ఈ నియోజకవర్గం చాలా స్పెషల్! ఇక్కడ గెలిచిన పార్టీదే అధికారం, ఇదే చంద్రబాబుకి తలనొప్పి!

Singanamala Politics: ఏపీలో ఈ నియోజకవర్గం చాలా స్పెషల్! ఇక్కడ గెలిచిన పార్టీదే అధికారం, ఇదే చంద్రబాబుకి తలనొప్పి!

Telangana Elections 2023 : తెలంగాణలో ఓటు హక్కు ఉన్న ఏపీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ - అదేమిటో తెలుసా ?

Telangana Elections 2023 :  తెలంగాణలో ఓటు హక్కు ఉన్న ఏపీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ -  అదేమిటో తెలుసా ?

Padi Kaushik Reddy: పాడి కౌశిక్ రెడ్డిపై కేసు, ఈసీ కూడా సీరియస్ - వివరణ ఇవ్వాలని ఆదేశాలు

Padi Kaushik Reddy: పాడి కౌశిక్ రెడ్డిపై కేసు, ఈసీ కూడా సీరియస్ - వివరణ ఇవ్వాలని ఆదేశాలు