News
News
X

Nandamuri Mokshagna Debut Movie : ప్రేమకథతో నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ?

తనయుడు మోక్షజ్ఞను త్వరలో కథానాయకుడిగా పరిచయం చేయడానికి నట సింహం బాలకృష్ణ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. నందమూరి వారసుడి తొలి చిత్రానికి ప్రేమకథను ఎంపిక చేశారట.

FOLLOW US: 

నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తనయుడు మోక్షజ్ఞ తేజ తెరంగేట్రం ఎప్పుడు జరుగుతుంది? కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకు నందమూరి వారసుడు వచ్చేది ఎప్పుడు? సగటు తెలుగు సినిమా ప్రేక్షకుడితో పాటు ప్రతి నందమూరి అభిమాని ఈ ప్రశ్నలకు సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. అది త్వరలో లభిస్తుందని సమాచారం.

యువ దర్శకుడి చేతిలో మోక్షజ్ఞ తొలి సినిమా?
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నందమూరి అభిమానులు చాలా మంది ఉన్నారు. ఆ అభిమానుల్లో అగ్ర దర్శకులు సైతం ఉన్నారు. కొన్నాళ్ల నుంచి మోక్షజ్ఞ ఎంట్రీ వినిపించిన ప్రతిసారీ ఒకొక్క దర్శకుడి పేరు తెరపైకి వచ్చింది. మాస్ కమర్షియల్ చిత్రాల దర్శకుడు, బాలయ్యతో 'సింహా', 'లెజెండ్', 'అఖండ' వంటి భారీ బ్లాక్ బస్టర్లు తీసిన బోయపాటి శ్రీనుకు కుమారుడిని వెండితెరకు పరిచయం చేసే బాధ్యతను అప్పగించాలని బాలకృష్ణ భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఒక సమయంలో క్రిష్ జాగర్లమూడి పేరు వినిపించింది. మధ్య అనిల్ రావిపూడి పేరు తెరపైకి వచ్చింది. అయితే, ఇప్పుడు వాళ్ళందరినీ కాదని యువ దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ కథకు బాలకృష్ణ ఓకే చెప్పారట.
 
ప్రేమకథతో మోక్షజ్ఞ ఎంట్రీ?
'టాక్సీవాలా' సినిమాతో దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ పేరు వెలుగులోకి వచ్చింది. ఆ సినిమా తర్వాత నాని, సాయి పల్లవి జంటగా 'శ్యామ్ సింగ రాయ్' చేశారు. నందమూరి మోక్షజ్ఞ కోసం ఆయనో ప్రేమ కథ రెడీ చేశారట. ఈ మధ్య కథను నందమూరి కుటుంబ సభ్యులకు వినిపించడం... వాళ్ళందరూ ఓకే చేయడం జరిగాయట. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకు వెళుతుందని టాక్.

మాస్ కాకుండా ప్రేమ ఎందుకు?
బాలకృష్ణకు మాస్ ఇమేజ్ ఉంది. ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు అటువంటి ఇమేజ్ కోరుకుంటున్నారు. నందమూరి అభిమానులు కూడా మాస్ ఆశిస్తారు. ఆ విషయాలు బాలయ్యకు తెలియనవి కావు. మరి, ప్రేమ కథ ఎందుకు ఎంపిక చేశారు? అనేది తెలియడం లేదు. కెరీర్ స్టార్టింగులో ఫుల్ మాస్ చేస్తే, ఆ తర్వాత కథల ఎంపిక కష్టం అవుతుందని, ప్రేమ కథలతో ప్రారంభించి అని వర్గాల ప్రేక్షకులకు చేరువయ్యే కథలు చేయించాలనేది బాలకృష్ణ అభిప్రాయంగా తెలుస్తోంది.

Also Read : బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌ ఫోటోలు

మోక్షజ్ఞ తేజ మంగళవారం (సెప్టెంబర్ 6న) తల్లిదండ్రులు, NBK107 సినిమా యూనిట్ సభ్యుల నడుమ టర్కీలో పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్నారు. ఆయనతో పాటు తల్లి వసుంధర కూడా ఉన్నారు. ఎన్‌బికె 107 షూటింగ్ లొకేషన్‌లో అబ్బాయి చేత కేక్ కట్ చేయించారు బాలకృష్ణ. ఆ తర్వాత కుమారుడికి ఆప్యాయంగా తినిపించారు. నటుడు సప్తగిరి, హీరోయిన్ శ్రుతీ హాసన్, దర్శకుడు గోపీచంద్ మలినేని తదితరులు కూడా టర్కీలోని ఇస్తాంబుల్ సిటీలో ఈ సినిమా షూటింగ్ చేస్తున్నారు. వాళ్ళందరూ మోక్షజ్ఞకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 

కొన్ని రోజుల క్రితం వరకు సినిమా షూటింగ్స్‌కు మోక్షజ్ఞ దూరంగా ఉండేవారు. కానీ, ఈ మధ్య తరచు తండ్రితో కనిపిస్తున్నారు. సినిమా షూటింగ్స్‌తో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్, ఇతర విషయాలపై అవగాహన పెంచుకుంటున్నారట.  

Also Read : రాజ మందిరంలోకి వంచన, ద్రోహం - మణిరత్నం తీసిన విజువల్ వండర్, 'పొన్నియన్ సెల్వన్' ట్రైలర్

Published at : 07 Sep 2022 05:08 PM (IST) Tags: Balakrishna Rahul Sankrityan Nandamuri Mokshagna Teja Nandamuri Mokshagna Debut Movie Balakrishna Son Debut Movie

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: రేవంత్ వల్లే ఎలిమినేట్ అయ్యాను, దమ్మున్న కంటెస్టెంట్స్ వాళ్లే - నేహా కామెంట్స్!

Bigg Boss 6 Telugu: రేవంత్ వల్లే ఎలిమినేట్ అయ్యాను, దమ్మున్న కంటెస్టెంట్స్ వాళ్లే - నేహా కామెంట్స్!

Rana Naidu Web Series: బాబాయ్‌ వెంకీ తలకి గన్ గురి పెట్టిన రానా- క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ 'రానానాయుడు' టీజర్ రిలీజ్

Rana Naidu Web Series: బాబాయ్‌ వెంకీ తలకి గన్ గురి పెట్టిన రానా- క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ 'రానానాయుడు' టీజర్ రిలీజ్

Godfather: పూరీ చస్తే చేయనన్నాడు, గజగజా వణికిపోయాడు: చిరంజీవి

Godfather: పూరీ చస్తే చేయనన్నాడు, గజగజా వణికిపోయాడు: చిరంజీవి

Mahesh Babu: మహేష్ కారణంగా నిర్మాతకు కోట్లలో నష్టాలు - నిజమేనా?

Mahesh Babu: మహేష్ కారణంగా నిర్మాతకు కోట్లలో నష్టాలు - నిజమేనా?

Balakrishna: బాలయ్యతో సమంత చిట్ చాట్ - వర్కవుట్ అవుతుందా?

Balakrishna: బాలయ్యతో సమంత చిట్ చాట్ - వర్కవుట్ అవుతుందా?

టాప్ స్టోరీస్

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Loan Apps Cheating : రాజమండ్రి నుంచి గుజరాత్ వరకూ, లోన్ యాప్ నెట్ వర్క్ ను ఛేదించిన పోలీసులు!

Loan Apps Cheating : రాజమండ్రి నుంచి గుజరాత్ వరకూ, లోన్ యాప్ నెట్ వర్క్ ను ఛేదించిన పోలీసులు!

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల