By: ABP Desam | Updated at : 12 Dec 2022 12:27 AM (IST)
ఏషియన్ తారకరామ థియేటర్ తిరిగి ప్రారంభం కానుంది.
ఒకప్పుడు హైదరాబాద్‌లోని ఫేమస్ థియేటర్లలో ‘తారక రామ’ కూడా ఒకటి. అయితే కాలక్రమంలో ఆ థియేటర్ మూతపడింది. ఎన్టీఆర్‌పై ఉన్న గౌరవంతో లెజెండరీ ఫిలిం పర్సనాలిటీ నారాయణ్ కె.దాస్ 10 సంవత్సరాల క్రితం కాచిగూడలోని తారకరామ థియేటర్‌ని పునరుద్ధరించారు. ఎన్టీఆర్, నారాయణ్ కె.దాస్ నారంగ్ ఇద్దరూ చాలా మంచి స్నేహితులు.
ఆసియన్ తారకరామ సినిమా హాల్‌ను నారాయణ్ కె.దాస్ నారంగ్ కుమారుడు సునీల్ నారంగ్ పునరుద్ధరించారు. ఈ థియేటర్‌లో ఇప్పుడు పూర్తిగా కొత్త టెక్నాలజీ అయిన 4కే ప్రొజెక్షన్, సుపీరియర్ సౌండింగ్, సీటింగ్ ఉన్నాయి. 975 సీట్ల కెపాసిటీ ఉన్న హాల్‌ని 590 సీట్లకు తగ్గించి సినిమా చూసే అనుభూతిని మెరుగుపరచనున్నారు. హాల్‌లో పూర్తి రెక్లైనర్ సీట్లు, సోఫాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇంటీరియర్ వర్క్ కూడా అద్బుతంగా ఉండనుంది.
నందమూరి బాలకృష్ణ ఏషియన్ తారకరామను రీ-ఓపెన్ చేయనున్నారు. డిసెంబరు 14వ తేదీ మధ్యాహ్నం 12:50 గంటలకు ఈ థియేటర్ తిరిగి ప్రారంభం కానుంది. ఏషియన్ సినిమాలకు లక్కీ చార్మ్ గా నిలిచిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ శిరీష్ ఈ కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన చేయనున్నారు. తమకు సహకరించిన నందమూరి మోహనకృష్ణకు సునీల్ నారంగ్, భరత్ నారంగ్, సురేష్ బాబు, సదానంద్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.
మొన్న బాలకృష్ణ, నేడు చిరంజీవి - వివాదాలకు కేరాఫ్ గా సక్సెస్ మీట్లు? ఇంతకీ ఏమైంది?
Rakhi Sawant Mother Death: రాఖీ సావంత్ తల్లి జయ భేదా కన్నుమూత - ఇక ఎవరు నన్ను హగ్ చేసుకుంటారంటూ భావోద్వేగం
Ajith Kumar’s AK62 Movie: అజిత్ సినిమా నుంచి దర్శకుడు విఘ్నేష్ శివన్ ఔట్? కారణం అదేనా?
Chiranjeevi - Ram Charan: రామ్ చరణ్ స్థానంలో నేనే ఉన్నంత గర్వంగా ఉంది: చిరంజీవి
Pawan Kalyan New Movie: పవర్ స్టార్ అభిమానులకు సూపర్ న్యూస్, పవన్ - సుజిత్ మూవీ షూటింగ్ డేట్ ఫిక్స్!
Nara Lokesh Yatra: తాళిబొట్లు తాకట్టు పెట్టించిన వ్యక్తి సీఎం, ఎంత మోసగాడో అర్థం చేసుకోండి - లోకేశ్ వ్యాఖ్యలు
BRS Nanded Meeting: నాందేడ్‌లో బీఆర్ఎస్ సభ, ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
Delhi Khalistan Attacks : దిల్లీలో ఖలిస్థానీ స్లీపర్ సెల్స్, ఉగ్రదాడులకు ప్లాన్- నిఘా సంస్థల హెచ్చరిక
U-19 womens WC Final: అమ్మాయిలు సాధిస్తారా! నేడే మహిళల అండర్- 19 టీ20 ప్రపంచకప్ ఫైనల్